లేచిపోయింది...నన్ను ఒంటరిని చేసినాలుగు గోడలలో చీకటిని చల్లినిర్దాక్షిణ్యంగా చేయి విదిల్చిమూడు ముళ్ళను ముళ్ళ కంపల్లా భావించి అసహ్యపు చూపుతో గుండెలో రంపపు కోత కోసి అమ్మ చిటికెన వేలు విడిచి తప్పిపోయినట్లు వెళ్ళిపోయింది!
ఇపుడు ఎక్కడని వెతకను?అయినా పది సంవత్సరాల దాంపత్యం తర్వాత ఇద్దరు పిల్లల తల్లి ఇలా చేయడం అందరు నా చేతగానితనం అన్నారు!
నేనేం చేయను తను ఎవ్వర్నో ప్రేమించిందట వాడిలో ఏమి చూసి వెళ్ళివుంటుంది తన కోరిక ఏనాడు కాదనలేదు కొండమీది కోతిని కూడ క్షణాల్లో తెచ్చిపెట్టాను అడిగందంతా కొనిపించాను ఇప్పటికి తను వెళ్ళిపోవడానికి కారణం తెలియడం లేదు!
ప్రేమ గుడ్డిదే కాదు దానికి ఏ అంగాలు లేవని ఈ క్షణమే తెలిసింది!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment