Monday, December 17, 2007

మమ్మల్ని చంపకండి...

మమ్మల్ని చంపకండి...
మా మొహాల మీదా యాసిడ్ పోయకండి
మొండెం నుండి తలను వేరు చేయకండి
ఇపుడిపుడే నడకలు నేర్చుకుంటున్నాం
తరతరాలుగా భానిసత్వం చేసిన మేము
వంటింటి కుందేలై బయటి ప్రపంచంలోకి
నెమ్మదిగా అడుగులు వేస్తున్నాం
నాలుగక్షరాలు వంట బట్టించుకొని
మా కాళ్ళపై మేము నిలబడాలనుకుంటే
143 పార్ములాను బలవంతంగా మాపై
ప్రయోగించకండి!


తల్లిదండ్రులు రక్తపు చెమటతో
రూపాయి రుపాయి కూడబెట్టి
మమ్మల్ని సాదుతున్నారు
బుక్కెడు బువ్వకు కరువైన మాకు
చదువు ద్వారా కడుపునిండా తినాలనుకున్నాం
ఎన్నో ఆశలతో కళాశాలల్లో అడుగుపెడితే
అటెండర్ నుండి ఉపాధ్యాయుల వరకు
నిరంతరం ఆకలి చూపులతో
మమ్మల్ని దహించివేస్తున్నారు
ప్రేమ పేరుతో ఒకడు,స్నేహం పేరుతో ఒకడు
మృత్యుకుహారం లోకి నెడుతున్నారు!


ప్లీజ్!దయచేసి మమ్మల్ని ఎదగనివ్వండి
చెప్పుకోలేని అవసరానికి కూడ చేయి చాచడం
ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకేం తెలుసు ?
మా తల్లిదండ్రుల ఋణం తీర్చడానికే
మేము చదువుకుంటున్నాం
ఒళ్ళు కొవ్వెక్కి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి కాదు
మమ్మల్ని చంపకండి
విద్యను మా మదిలో కొద్దిగానైన
నాటండి!

(ఇటీవల వరుసగా ప్రేమ పేరుతో యువతులను హింసించడం చూసి...)

3 comments:

పద్మనాభం దూర్వాసుల said...

పోలీసు వ్యవస్త రాజకీయ రగడతొ గూండాల కొమ్ము కాస్తోంది.
న్యాయ వ్యవస్త నిర్వీర్యమైపోయింది.
ఈ ప్రేమ రాబందుల ఆట కట్టించే రోజు ఎన్నడో?
దూర్వాసుల పద్మనాభం

రాధిక said...

ఏమీ అనుకోకపోతే....ఇది నేను ఎక్కడో చదివానండి.ఇంతకు ముందు ఎక్కడన్నా ప్రచురించారా మీరు?

వెంకట్ said...

radhika gaaru,
inthaku mundu andra jyothi lo ee
kavithanu nenu raasaanu.



venkatesh E
m.a(telugu) student
hyderabad central university.

cell:9290226180
e-mail:venkat9venkat9@gmail.com