Monday, November 5, 2007

పోరాటం మాకు కొత్త కాదు...

పోరాటం మాకు కొత్త కాదు
అది మా రక్తంతో పాటు పుట్టింది
అణువణువులో అది జ్వాలై అమరులు
అయ్యే వరకు మాతో నడిచింది!


మా కన్న తల్లిని దోచుకుని
మీరు కడుపులు నింపుకున్నారు
పాలు తాగాక రొమ్ములు గుద్దారు
నా తల్లిప్పుడు కళా విహీన ముఖముతో
అంపశయ్యపై పడుకుంది!


మాకు కావలసింది వాగ్దానాల
నీటిమూటలు డబ్బుసంచులు కాదు
మా అక్షరాలు ఆత్మవిశ్వాసంతో
తల ఎత్తుక తిరుగాలి
చీము నెత్తురు కలిసి సజీవమై
అన్యాయాన్ని ప్రశ్నించాలి!


నా భాషను విధూషకున్ని చేసి
వీధిలో నగుబాట్ల పాలు చెశారు
నా సహనం చచ్చింది
నేను ఇక ఊరుకోను
సమరశంఖం పూరిస్తున్నా...


ఇక నా తెలంగాణలో ...
విప్లవ వీరుల పురిటి గడ్డపై
రక్తపు టేరుల రహదారిపై
మృతవీరుల కళేభరాలపై
తెలంగాణ తల్లిని ప్రతిస్థాపిస్తాం
ఆధిక్యాన్ని భూస్థాపితం చేస్తాం!

3 comments:

rākeśvara said...

జై తెలంగాణ !
జై గోదావరి రాష్ట్రం ! (ఉబయ గోదావరి జిల్లాలు మాత్రమే, యానాం రాజధాని)

Administrative Science చదివిన ఎవరినడిగినా చెబుతారు చిన్న రాష్ట్రాలు ప్రగతి ఎక్కువ సాధిస్తాయని.
ఉదా- గోవా, కేరళ, త్రిపురా, మేఘాలయం, హిమాచలం, కనక్టికట్టు వగైరా ...
ఎందుకంటే వాటిలో అకౌంటబిలిటి, రెస్పాన్సిబిలిటి వుంటాయి. పరస్పర నింద వుండదు.

netizen నెటిజన్ said...

జై రెడ్డి రాజ్యమ్!
జై కమ్మ ప్రభుత్వం!
జై కాపు నాడు!

తోటి బ్లాగర్లు విరివిగా తమ "నాడుల" అకాంక్షలను ఈ బ్లాగు "వాఖ్య"ల నందు పొదగమని ప్రార్ధన!

Nrahamthulla said...

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.