Monday, November 5, 2007

పోరాటం మాకు కొత్త కాదు...

పోరాటం మాకు కొత్త కాదు
అది మా రక్తంతో పాటు పుట్టింది
అణువణువులో అది జ్వాలై అమరులు
అయ్యే వరకు మాతో నడిచింది!


మా కన్న తల్లిని దోచుకుని
మీరు కడుపులు నింపుకున్నారు
పాలు తాగాక రొమ్ములు గుద్దారు
నా తల్లిప్పుడు కళా విహీన ముఖముతో
అంపశయ్యపై పడుకుంది!


మాకు కావలసింది వాగ్దానాల
నీటిమూటలు డబ్బుసంచులు కాదు
మా అక్షరాలు ఆత్మవిశ్వాసంతో
తల ఎత్తుక తిరుగాలి
చీము నెత్తురు కలిసి సజీవమై
అన్యాయాన్ని ప్రశ్నించాలి!


నా భాషను విధూషకున్ని చేసి
వీధిలో నగుబాట్ల పాలు చెశారు
నా సహనం చచ్చింది
నేను ఇక ఊరుకోను
సమరశంఖం పూరిస్తున్నా...


ఇక నా తెలంగాణలో ...
విప్లవ వీరుల పురిటి గడ్డపై
రక్తపు టేరుల రహదారిపై
మృతవీరుల కళేభరాలపై
తెలంగాణ తల్లిని ప్రతిస్థాపిస్తాం
ఆధిక్యాన్ని భూస్థాపితం చేస్తాం!

2 comments:

రాకేశ్వర రావు said...

జై తెలంగాణ !
జై గోదావరి రాష్ట్రం ! (ఉబయ గోదావరి జిల్లాలు మాత్రమే, యానాం రాజధాని)

Administrative Science చదివిన ఎవరినడిగినా చెబుతారు చిన్న రాష్ట్రాలు ప్రగతి ఎక్కువ సాధిస్తాయని.
ఉదా- గోవా, కేరళ, త్రిపురా, మేఘాలయం, హిమాచలం, కనక్టికట్టు వగైరా ...
ఎందుకంటే వాటిలో అకౌంటబిలిటి, రెస్పాన్సిబిలిటి వుంటాయి. పరస్పర నింద వుండదు.

netizen said...

జై రెడ్డి రాజ్యమ్!
జై కమ్మ ప్రభుత్వం!
జై కాపు నాడు!

తోటి బ్లాగర్లు విరివిగా తమ "నాడుల" అకాంక్షలను ఈ బ్లాగు "వాఖ్య"ల నందు పొదగమని ప్రార్ధన!