దృశ్య శకలాలు వెంటాడుతున్నాయి...
పారిపోదామని ప్రయత్నిస్తూ
మళ్ళి పంజరం లోకే వెళ్తున్నాను!
జీవితం లోని గత స్పృతులన్ని
పదునైన శూలాల్ల హృదయాన్ని
గాయం చేస్తూ నెత్తుటి ప్రశ్నలు వేస్తున్నాయి!
ఇంద్రియాలు ఉన్న
జంతువుని అని మాత్రమే
నేను చదివిన పాఠ్యపుస్తకాలు
నన్ను తీర్చిదిద్దాయి!
నీజాయితిగా ఉండడం
నేతి బీరకాయలో నేతి
ఉన్నంత నిజం!
కృత్రిమ బ్రతుకులె
ప్లాస్టిక్ నవ్వులే నేటి
తరానికి శరణ్యం !
నా మనస్సు నా నుంచి
విడాకులు తీసుకుంది
శరీరం అంతా "విదేశిబ్రాండ్" లతో నిండి
నాలోని అమ్మతనం అమ్ముడుపోయింది !
నాకు రెండు రక్తపు బొట్లను ఇవ్వండి
మీ జీవితాలను సస్యశ్యామలంగా మార్చి
నూతన సమాజ సృష్టికి అంకురార్పణ చేసి
అక్షరాలను ఆయుధంగా మార్చి దుర్మార్గాన్ని
సంహరిస్తాను!
ప్రపంచీకరణ నా సర్వస్వం
దోచుకుంది మిగిలింది
కేవలం నా కళేభరాలు మాత్రమే!
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
seethis
http;//nijamga-nijam.blogspot.com
Post a Comment