రక్ష
భావిని చూసి...
ఎంతపెద్ద మినరల్ బాటిలో
అని నివ్వెర పోవడం నుంచి,
దారి కిరుపక్కలా
చెట్లను చూసి
ఈ తరహా డిజైన్
ఆక్షిజన్ సిలిండర్లు
ఎంత బావున్నయో కదా
అని ముక్కున వేలేసుకోవడం నుంచి,
సెల్ ఫోన్
రింగ్ టోన్ గా
కోకిల గొంతు విని
ఈ కంపోజిషన్ ఏదో భలేగా వుందే
అని ముచ్చట పోవడం నుంచి,
అచ్చు పుస్తకాన్ని చూసి
కంప్యూటర్ పైలునంతా
ఇలా ప్రింటవుట్లు తీయడమేమిటి
ఔట్ డేటెడ్ గా
అని విసుక్కోవడం నుంచి
భావితరాన్ని రక్షించుకోవడం అంటే
ఇవాళ
పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే!
నీటిని,గాలిని,ధ్వనిని
క్షరము కాని అక్షరంగా సహజసిద్దంగా
స్వచ్చంగా నిలుపుకుంటే చాలు,
మహిని, మనిషిని కూడా
రక్షించుకున్నట్టే.
(ఈ కవితను సుధామ రాసినది.నాకు నచ్చిన కవితల్లో "ద బెస్ట్" అనదగ్గా కవిత)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment