దూరమవడం ఎప్పుడూ
మరణ సదృశ్యమే...
మెరుపుల వచ్చి
కలల అలలపై
ఓల లాడించి
వలపును ఒడుపుతో
మనసులో గుప్పించి
మౌనంగా మాట్లాడి
కళ్ళతో మమకారాన్ని నింపి
సుదూర తీరాలలో
ఎవరికి అందని ప్రేమను
శరీరం అంతా నింపేసి
అణువణువులో నీ నామాన్ని
అతికించి...
ఇపుడు దూరమవడం
నరకయాతనే!
గంటల తరబడి మాట్లాడిన
ఊసులన్ని ఇపుడు వ్యర్థమేనా
నిరీక్షణలో...
నీ రూప దర్శనముకై
పడిన వేదన అంతా శూన్యమేనా
ఆకాశంపై ఆశపడడం
ఆడియాశే అవుతుంది
అందుకే మళ్ళీ మళ్ళీ
చెబుతున్నా దూరమవడం
ఎప్పుడూ మరణ సదృశ్యమే!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment