ట్రింగ్...ట్రింగ్...ట్రింగ్
హలో హలో...
మీ సినిమా థియేటర్ లో
బాంబ్ పెట్టాము...
అది మరికొద్ది క్షణాల్లో
పేలిపోతుంది!
ప్రాణం పై ఆశ ఉన్నవాళ్ళు
పారిపోవచ్చు
పరిగెత్తరానివారు తోపులాటల్లో పడి చావచ్చు!
సరదాకి కూడ
నగరంలోకి వెళ్ళితే
అనుకోని అతిథిలా
మరణం మిమ్మల్ని
ఆహ్హానిస్తుంది!
వాన రాకడ ప్రాణం పోకడ
ఇపుడు బట్టలు మార్చి నంత సులువు
ప్రభువా వీళ్ళను క్షమించు
వీరేమి చేసున్నారో వారికి తెలియదు!
సెల్ ఫొన్ బాంబ్ లతో
క్షణంలో మీ శరీరం శకలాలుగా
మిగులుతుంది!
కాబట్టి తస్మాత్ జాగ్రత్త
బ్రతకాలంటే ఇప్పుడు నాలుగు
కళ్ళు ఉండాల్సిందే!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment