Thursday, September 13, 2007

లజ్జ నవల -సమగ్ర పరిశీలన

లజ్జ నవల -సమగ్ర పరిశీలన




ప్రపంచ నవల సాహిత్యంలో అత్యంత సంచలనం సృష్టించిన నవల "లజ్జ".దీనిని తస్లీమా నస్రిన్ 1993 లో రాశారు.మత చాందసత్వం యొక్క వికృత రూపం మానవత్వాన్ని ఎలా మంట గలుపుతుందో ఈ నవలలో రచయిత్రి వివరించారు.పదమూడు రోజుల్లో జరిగిన అనేక సంఘటనల సమహార రూపం ఈ నవల.ఇది రాసినందుకే ముస్లిం మతచాందసవాదులు తస్లీమా నస్రిన్ కు మరణ దండన విదిస్తూ "పత్వా" జారిచేశారు. ఇంతకు లజ్జలో ఏముంది?నిషేదించవలసిన అవసరం ఏముంది.తస్లీమా నస్రిన్ పై బషీరాబాగ్ లో జరిగిన దాడి అనంతరం చర్చించడం అవసరం.1992 లో డిసెంబర్ 6 న అయోద్యలో బాబ్రీమసీదు విద్వంసం తరువాత జరిగిన తదనంతర పరిణామాలే ఈ నవల ఇతివృత్తం.ఈ నవలలో ప్రదానంగా నాలుగు ముఖ్యమైన పాత్రలు కనిపిస్తాయి. 1.సురందం దత్త 2.సురంజన్ 3.మాయ 4.సురందం దత్త బార్య. ఈ నాలుగు పాత్రలతో నవల మొత్తం నడుస్తుంది.భారత దేశంలో హిందువులు అదిక సంఖ్యాకులు మత చాందసత్వం తో భారత దేశ హిందువులు మైనారిటీలపై దాడి జరిపితే బంగ్లాదేష్ లో అల్పసంఖ్యాకులైన హిందువులపై దీని ప్రభావం పడుతున్నది.1992 తరువాత బంగ్లాదేష్ లో జరిగిన విద్యంసమే ఈ నవలలో కనిపిస్తుంది.సురందందత్త దేశప్రేమికుడు బంగ్లాదెష్ స్వాతంత్ర పోరటంలో పాల్గొన్నవాడు.పాకిస్తాన్ నుండి స్వాతంత్రం పొందేవరకు ఎడతెరిపి పోరాటం చేసిన వాడు.పాకిస్తాను లోని తూర్పు పాకిస్తాన్ ని బంగ్లాదెష్ గా మారె వరకు మనకు ఆయన పోరాటం కనిపిస్తుంది. సురందందత్త వృత్తిరిత్యా వైద్యుడు.చుట్టు పక్కల వారికి ఏ వ్యాది వచ్చిన ఉచితంగా వైద్యం చేస్తాడు.ఇతని బార్య కూడ ఆయన అడుగుజాడల లోనె నడిచేది.మైమెన్సింగ్ ప్రాంతంలో వారికి విశాలమైన ఇల్లు ఉండేది.అందులో రకరకాల పండ్లు ఉండేవి.వాటిని సురంజన్ మరియు మాయ వారి మిత్రులైన ముస్లిములు సోదరులు కలిసి తిని ఆడుకొనేవారు.విశాలమైన సురందం ఇల్లు చూసి పక్కనున్న ముస్లిములు ఆ స్తలం తమకు అమ్మాలని లేకపోతె తీవ్ర పరిణామలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తారు. తన కూతురైన మాయను నదిరొడ్డులో అవమానిస్తారు. దాంతో సురందం కు ఇల్లు మారక తప్పదు వచ్చిన కాడికి ఇల్లుని అమ్మేసి బంగ్లాదేష్ లోని వేరె ప్రాంతానికి వెళతాడు.








(మిగిలిన భాగం మూడురోజులు దశలు దశలుగా రాస్తాను)

1 comment:

రానారె said...

రాయండి. థాంక్యూ.