Friday, September 14, 2007

గుక్క పట్టిన బాల్యం...

గుక్క పట్టిన బాల్యం
సగం నరికిన చెట్టు
రోదిస్తున్న అక్షరాలు!



పుస్తకాల బరువు మోసి
నా వీపు కందిపోయింది
తలకెక్కింది పుస్తకాల
బరువు మాత్రమే!



అర్దరాత్రి లేచాను
నా శరీరం మాయమైంది
మిగిలినవి కటిక చీకటిలో
కన్నీటి భిందువులు!



కిటికి పక్క సీటు
వేగంగా పరిగెడుతున్న చెట్లు
తొందరగా ఇంటికి చేరాలన్న
ఆత్రంగా ఉన్నాయి!



రోడ్డుపై నడవండి
ప్లై ఓవర్ లు కూలి
క్షణంలో పైకి పోతారు
ఎవరు అందుకోలేనంత దూరంగా!



గదినిండా నిశ్శబ్దం
నేను బందినై పోయాను
దయచేసి శబ్దం చేయండి
ఎవరన్నా మాట్లాడండి!



కవిత్వానికి అలంకారాలు
తీసేసి నగ్నంగా
నడివీదిలో తిప్పుతాను!



కాలాన్ని బందించి
పేపరును ప్రేమలో ముంచి
అక్షరాలకు అంజలి ఘటిస్తాను!

No comments: