Monday, September 17, 2007

ఎక్కడో...

ఎక్కడో
మూలమలపున
రెండు చేతులు
దీనంగా కిందికి పైకి
ఊగుతున్నాయి!


చింపిరి మొహం
తైల సంస్కారం లేని
జుత్తు ఒళ్ళంతా కమురు వాసన


కడుపు వెన్నుకు
ఆనుకు పొయింది
ఆ కనులు వికృత
సమజాన్ని ప్రశ్నిస్తున్నాయి!

No comments: