ఓ నా ఉద్యమ కెరటమా
అలుపెరుగని పోరాటా యోధుడా
నిత్య చైతన్య శీలుడా
నిరంతరం నేను
ఉన్నానంటూ చేతలతో
సమాధానం చెప్పెవాడా!
అంబేద్కరిజాన్ని
శరీరం లోని
అణువణువున ఒంపేసుకొన్నవాడ
నీ గుండె లబ్ డబ్ బదులు
"దలిత్" "దలిత్" అని
కొట్టుకొంటున్నది!
ఏలాంటి సమస్య కైన
ప్రాణాలకు తెగించి పోరాడెవాడ
నిన్ను చూసి దైర్యం సిగ్గు పడింది
ఎర్రటి సూర్యుడికి మల్లె
నీవు ఆకాశాన్ని వెలిగించగలవు!
నీవు పడ్డ కష్టాలు
నా సోదరులు అనుభవించరాదని
రాత్రనక పగలనక
శ్రమించినవాడ!
అన్నా అని పిలిస్తే
నేనున్ననంటు ఆపన్నహస్తం
అందించే వాడా
మా కష్టాలను తొలిగించడానికి
మరో అంబేద్కర్ లా
పునర్జన్మ ఎత్తిన వాడ!
అందుకే కృష్ణన్న
అందుకో మా దళిత వందనాలు !
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
మీ రచనలన్నీ ఒక మారు చదివాను. మీకు మంచి ఆలోచనలున్నాయి గానీ ఆవేశం ఒకటే సరిపోదు కవిత్వానికి. విస్తృతంగా చదవండి. మీకు నచ్చిన కవుల రచనల్ని అధ్యయనం చెయ్యండి. సమర్ధవంతమైన, మీ సొంతమైన భావ వ్యక్తీకరణని అలవరచుకోండి. శుభాకాంక్షలతో ..
Post a Comment