Tuesday, September 4, 2007

బిడ్డా పాకిస్తాను...

బిడ్డా పాకిస్తాను
ఎలా ఉన్నావు?
నీ కన్న తల్లిని మర్చిపోయావా!


తల్లి తన బిడ్డలు
చిన్న చిన్న కారణాలకు పోట్లాడితే
ఊరుకోగలదా!


ఎంతయిన నా రక్తమే కదా
తప్పుటడుగులు వేయడం
దాని నైజం!



అలాగని పేగుబంధాన్ని
ఏ తల్లి అయినా
తెంచుకుంటుందా!


వాడు అమాయకుడు
వాడి స్నేహితులు
తన తల్లిని దూషించేలా
తయారు చేశారు!


మన ఇద్దరి మధ్య
మనస్పర్తలు పెంచి
గోడ మీది పిల్లిలా
వికృతంగా నవ్వుతున్నారు!


నువ్వొక మట్టిబుర్రవి
వట్టి అమాయకుడివి
అందరిని నమ్ముతావు
సొంత రక్తాన్నే కళ్ళజూస్తావు!


నీ కోసమే మా బెంగ
అన్నం బదులు
అణ్వాస్త్రాలు తయారు చేస్తున్నావు!


తల్లి పాలు తాగి
రొమ్ములు గుద్దే
పద్దతిని ఇప్పటికైన
మార్చుకో!


ఎప్పటి కైన నీ మనసు
మారుతుందని
క్షణం క్షణం
ఎదురుచూసే
నీ తల్లి !


ఒరేయ్!బుద్దితెచ్చుకోరా
నీ పక్క స్నేహితులు చూడు
ఎలా పైకి వస్తున్నారో!


జరిగిందేదొ జరిగిపొయింది
ఇప్పటి కైన నా దగ్గరకు రా
నిన్ను నా హృదయానికి
హత్తుకోవాలని
ఆశగా ఉంది!


ఇట్లు
నీ తల్లి(భారత దేశం)

1 comment:

Burri said...

వెంకట్,
చాలా బాగుంది. బిడ్డలను మర్చాలి లేదా మదర్ ఇండియా సినిమా లో మదర్ తన దుష్ట కొడుకును చేసినట్లు చేయాలి.

..మరమరాలు
http://maramaraalu.blogspot.com/