Saturday, September 1, 2007

గడియారం వంకా చూస్తున్నాను

గడియారం వంకా చూస్తున్నాను
సమయం సరిగ్గా 12 గంటలు
అది రాత్రో పగలో తెలియదు
సమయం మాత్రం గడుస్తూనే ఉంది!


ఏ మాత్రం విసుగు విరామం లేకుండ
తన పని తాను చాలా సిన్సియర్ గా
చేస్తూ వెళ్ళిపోతున్నది!


గడుస్తున్న క్షణాలు మృత్యు ఘడియల్ల
తోస్తున్నాయి!గడిచె ప్రతిక్షణం
నాలో భయాన్ని కల్గిస్తున్నది!


లోకం బాధ ఏ మాత్రం పట్టని ఓ యంత్రమా
పేదల కన్నీళ్ళు,కష్టాలు, ఆకలిదప్పులు
పట్టించుకోవా ?అయినా నీకు అంత
తీరిక ఎక్కడిదిలే!


మనుషులు మారిన మనస్తత్వాలు మారిన
నీవు మాత్రం గోడకు ఆనుకొని
నవ్వుతూ వేదాంతం వల్లిస్తావు
ఎవరిగోడు పట్టించుకోవు!


కానీ నీవంటే నాకు ద్వేషం
నువంటె నాకు అసహ్యం
ఎందుకంటే గడిచిన ప్రతిక్షణం
నా జీవితం తగ్గి పోతుందనే కోపం!


అందుకే నాకు సమయం అన్నా
గడియారం అన్నా
నాకు ఎడారిలో చిక్కుకున్న భావన!


నీవు మాత్రం సిన్సియర్ గా
నీ డ్యూటి చేస్తూనే ఉంటావు
ఓ గడియారమా
నీ అంకితభావనికి నా థాంక్స్!

No comments: