జీవితాన్ని కూల్చడం ఇప్పుడు మరింత సులువు...
గ్లోబలైజేషన్ మనకు తెలియకుండా మనను
మార్చుతున్నంత సులువు!
ఆనాది నుండి నేటి ఆధునిక టెక్నాలజి వరకు
బలవంతుడికే ప్రాణాలు తీసె హక్కు
ఒక్క తూటకు చిటికెలో పనైపోతుంది.
భూమి కోసం...
ఇక్కడ భూమి అంటే కేవలం నేల కాదు
నా కన్న తల్లితో సమానం
తల్లి జన్మ నిస్తే భూమి కడుపు నింపింది
ఆలాంటి తల్లి నాకు అంగట్లొ సరుకై పోతున్నది
అమ్మ ఇప్పుడు నా చేతులు దాటి అకాశం వైపు బిత్తర
చూపులు చూస్తున్నది ...
ఇప్పటి నా తల్లి పసుపు కుంకుమ పొగొట్టుకొన్న
విధవ రాలిలా కళ విహీనమైన మొహంతో ఉంది .
నా తల్లిని ఎల కాపాడు కోవాలి
బుక్కెడు బువ్వ పెట్టే అమ్మ కోసం
సంతొషంగా మా ప్రాణాలు తిసుకొండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment