...నమస్తే
భారత ప్రజాస్వామ్యానికి
చూస్తుండే గానే ఎంత ఎదిగిపోయింది?
నిన్న మొన్నటి వరకు పాలు తాగే
పసి పిల్లలా అల్లరి చేస్తూ అందరిని నవ్విస్తూ
కవ్వించేది!
ప్రజల కొరకు,ప్రజల చేత,ప్రజలకై
అని ప్రజాస్వామ్యానికి అమాయకులు
ఎంత పెద్ద నిర్వచనం ఇచ్చారు
ఇప్పుడంతా ప్రజల రక్తం,
ప్రజల మాంసం,
ప్రజల శీలం,
నూతన ప్రజాస్వామ్యానికి సరైన అర్తం.
అరవై సంవత్వరాల స్వాతంత్ర భారతంలో
పేదల రక్తం ఏరులై పారని దెప్పుడు ?
మూడు వర్ణాల జాతీయ జెండా
మూడు ముక్కలుగ మారి
వీధి కుక్కల పొట్లాటల్లో చింపిరి గుడ్డలుగా
మారిపోయింది!
ప్రభుత్వ కార్యాలయాల్లో ...
ఉన్నత విద్యాలాయాల్లో ...
హైకొర్టు,సుప్రీం కోర్టు,ఇలా ఏ ఉన్నత
కార్యలయాలలో ఆ జెండాను చూస్తే
కనీసం అక్కడ ఐన సగర్వంగా ఉందని
సంబర మేసేది!
కాని సామాన్య ప్రజల మైన మేము
తలదించుకోవడం నేర్చుకొన్నాము
మేము తలెత్తేది కేవలం పంద్రాగష్టు నాడె
మువ్వన్నెల జెండా లోని ఇరవై నాలుగు రేకులు
మేము పడుతున్న కష్టాలకు సజీవ సాక్షాలు!
జనగణమన పాడితే
రాజ్యం మావోహిష్టు అంటున్నది
ఉండడానికి కనీస భూమి అడిగితే
ఆరు అడుగుల్లో మట్టిని తవ్వి అందులో
కప్పి పెడుతున్నది.
భావ వ్యక్తీకరణకు సంకెల్లు వేసి
"లజ్జ" లేకుండా ప్రజస్వామ్యానికి తూట్లు
పొడుస్తున్నది. ఓ నా సిగ్గు లేని ప్రభుత్వమా
ముందుగా నీవు నీలోని చీకటిని తరిమికొట్టు !
రౌడీలు ముదిరితే రాజకీయ నాయకులు
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు
ఇపుడు సర్కారు అంటేనే రౌడీలు కదా
ముదిగొండ కాల్పుల్లో ఏరులై పారిన ఒక్కొక్క
రక్తపు చుక్క ఇప్పుడు ఎర్రటి సూర్యుడికి మల్లే
మిమ్ము వడదెబ్బతో చంపుతుంది!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment