Thursday, April 5, 2007

చీకటి...

చీకటి...
ఎటుచూసిన కటిక చీకటి
వేలాడే రెండు కన్నులలో
దాచుకున్న చిక్కటి చీకటి
ఏమి కనిపించడం లేదు
శూన్యాన్ని మనసులో
కప్పిపెట్టి వెలుగు కోసం
వెతకడం వృధా ప్రయాస
ఉదయం వచ్చిన కలకు
జీవితానికి లంకె కుదరదు
అప్పుడెపుడో వాడిన నా
దేహం మళ్ళి మొలకెత్తడం
ప్రారంభించింది!
* * * * *

No comments: