Thursday, March 29, 2007

అక్కా స్వరూపక్కా...

అక్కా స్వరూపక్కా...
అప్పటి నీ నవ్వు
చూడాలని వుంది
పది సంవత్సరాల ప్రాయంలో
పశుల వెంట నీడల తిరిగే హద్దులు లేని నీ ప్రేమను
చూడాలని ఉంది!
ఆ రోజు మనూల్లోకి వచ్చిన
అన్నలని చూసి నేను మీ వెంట
వస్తానన్నా నీ దైర్యాన్ని
చూడాలని ఉంది!
అక్కా...
తినడానికి తిండి లేని నీవు
యితరుల ఆకలి గురిచి
ఆలోచిస్తుంటే ప్రాణం తరుక్క పోత ఉంది.
అడవుల వెంట తిరుగుతూ
పేదవాడికి పెన్నిదిలా
ప్రభుత్వానికి సహలుగ
దనవంతుల గుండెల్లో నిదుర పోయిన
నీ మనవత్వాన్ని చూడాలని ఉంది
అలాంటి నీవు ఒక పోలీసు చేతిలో
ఎలా మోసపోయావక్కా!
ఆ పోలీసు కుక్కలను ఎలా
నమ్మవక్కా?
ఇపుడు నిన్ను చూడాలని ఉంది
కనీసం నీ శవం కూడ చూడడానికి
అవకాశం లేకుండ చేసారు
నాకు తెలుసు నీవు మళ్ళి
విప్లవ సుర్యునిలా
ఉదయిస్తావని...

(యిటివల పోలీసుల చేతిలో మోసపొయినా స్వరూపక్కను గుర్తుచేసుకుంటూ)

No comments: