నేలతల్లి సాచ్చిగా...
బీడుబడ్డ నా జీవితం
గడిలో కెంచి వస్తుంటే
వెంటబడిన మునుపటి బతుకు
ఒక్కప్పుడు రాజులా బ్రతికిన తను
గదేదో పెద్దరాజ్యం పన్నిన దుష్టపన్నాగాలకు
పది మందికి బువ్వ బెట్టిన తనకే
గిపుడు తినడానికి మెతుకు లేదు
నెత్తి పైకెత్తి చూస్తె వెక్కిరిస్తున్న మబ్బులు
అడుగు దీసి అడుగు వేయటం
ఇపుడు ఏకంగా చావడానికె
తన పెళ్ళాం పిల్లలకు గింత
తోవ జూపి వాల్లకు పరెషాన్ లేకుండా జేయాలి
పురుగుల మందు గూడ గిపుడు నకిలిది వస్తున్నది
మొన్న అది తాగిన నారిగాడు చావలేదు ఉల్ట పైసలు దవకానలొ బెట్టిండు
గాబట్టి చావడానికి అలకైనది ఉరి
ఎందుకంటే దీనికి పెట్టుబడి అవసరం లేదు
గీసొంటి దినం ఎవరికి రాకూడదు
సర్కారొల్లు ఉరి ఏసుకొన్నొల్లకు పైసలిస్తదంట
గా పైసలా తోని నా పెల్లం పిల్లలు
మంచిగా ఉంటారు ఇక బోత మల్ల
టైం లేదు గాడ సావడానికి లైన్ గట్టాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment