ఒక దీర్గ నిద్రలో అస్పస్ట ఆవేశం...
మనసు ఒంటరిగా మేలుకొంటున్నది
ఒకనొక కలలో భూమిని నగ్నంగా చూస్తూన్నాను!
పుస్తకాల వంకా చూస్తే
నా కెప్పెడు చిన్నప్పుడు అమ్మ చూపినా
భుచాడు కనిపిస్తాడు
భయం వేసి పారిపోతాను.
నేను చూసాను గాలిని
మలయమారుతపు అందాన్ని
చెట్లు మనుషుల కల్మషం చూసి
నీడ నివ్వడం మానలేదు.
హ్రుదయపు అంచులలో బావాన్ని
రంగరించి అర్తానికి కొత్త
రూపు ఇస్తాను.
కవిత్వానికి చంధస్సు,అలంకారాలు
తీసేసి నగ్నంగా
నడివీదిలో తిప్పుతాను.
సామాన్య ప్రజల
ఆకలి కేకలను
కడుపు నిండని అర్దాకలిని
నేను కవిత్వమై ఊరట నిస్తాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment