నిదుర రాదు...
కళ్ళలో నిదురకుక్కుకున్నా నిదురరాదు
తరతరాల అవమానాలకు సమాదానం చెప్పనిదే
నిదురరాదు!
ఒకట రెండా పుట్టినప్పటి నుండి చచ్చేవరకు
నిరంతరం భానిసలుగా మార్చిన
ఈ కులవ్యవస్త మారెవరకు
ఎంత ఎదిగిన అనుమానపు చూపులకు సమాదానం
దొరికె వరకు నిదురరాదు.
అర్దరాత్రి మెలకువలో ఎవరో
గేలిచేస్తున్న పెద్దమనుషులు
నా జీవితాన్ని సర్కస్ ఆడిస్తున్న
నా పుట్టుకకు ప్రమేయం లేని
ఈ కులం నా కొద్దు!
నేను చదివిన పుస్తకాల్లొ ఎప్పుడూ
నా కులం గురించి చెడుమాటలే
బ్రహ్మ పాదాల నుంచి వచ్చిన వాన్ని
ఆ పాదాలె లేకుంటె బ్రహ్మ ఎల నిలబడ గలడు
ఓ!ఉత్తములారా మా చెయి పడితేనె కదా
మీ జన్మ పవిత్రం అయ్యేది!
నేను అంటరానివాన్ని ఐనప్పుడు
నన్ను సృస్టించిన అంటరాని
దేవుడెవరు!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment