నాకో ఉత్తరం కావాలి...
తోక లేని పిట్ట నా ఇంటిలో
వాలాలి.
భాగా గుర్తు చిన్నప్పుడు
వచ్చే ఉత్తరాలు.
నడి వేసవిలో చిరుగాలిలా
జీవితానికి భరోసాల
ఏదొ మరిచిపోని సంగతిలా
ఇంకా వెంటడుతూనే ఉంటుంది.
మేల్స్ వచ్చిన తర్వాత
అక్షరాలు నా మొహం చూడటం లేదు.
వాటికి ఏమి మహిమ ఉందో కాని
ప్రేమ బందంతో కట్టి
బాదల్లో వెన్నంటే స్నేహితుడిలా
నిరంతరం మనకు కొత్త లోకాన్ని
చూపించే మాంత్రికుడిలా మాయ... ఒక అందమైన కల్పన.
ఉత్తరం రాయడం ఒక కళ
చదవటం ఒక అనుభూతి
ఇప్పుడు ఉత్తరం ఉత్తరం దిక్కుకు
ఎగిరి పొహింది.
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment