Thursday, March 8, 2007

ప్రియా...

ప్రియా...
ఏమని వ్రాయను
హృదయంలో శూన్యపు చూపులు
మదినిండ కలవరింతలు
శరీరంలో వేడిగాలులు
మొత్తానికి నన్ను నేను ఎప్పుడో
మరిచి పొయాను...
నీకొసం గాలితో గొడవపడ్డాను
పూవులు గర్వం వణచడానికి
నీవు వెంటనే వాటికి నీ అందం
చూపించాలి.
ప్రేమ తో నీవు చాపిన
కరచాలనం నా మనసులో
ఎప్పటికి ఉంటుంది.
నీ అధరాలు
పున్నమి వెన్నెలలు
పులకింతల లోగిల్లు...
నీ చూపులు
నిత్యకళ్యాణ పూదొటలు
నవచైతన్య నవనీతాలు...
నీ మాటలు
గారడి చేసె మంత్రాలు
బురిడి కొట్టించే అద్బుతాలు...
నీ ప్రేమ
మన్మధునికి సైతం ఈర్ష పుట్టిస్తుంది
మానవుడి నైన నేనెంత...
అందుకో ఈ ప్రేమ సందేశాన్ని
అనంత విశ్వ సాక్షిగా...

No comments: