అగాధ లోకంలో...
కనులు తెరిచి
కలలు కంటున్నా!
అస్పస్ట రూపాలేవో
రమ్మని చేతులు ఊపుతూ
తొందర పెడుతున్న వింత మనుషులు
నాకు కొద్దిగా మానవత్వం
కావాలి.
ఎక్కడికి పోయాడు మనిషి
నాకు కనిపించడం లేదు.
మీలో ఎవరైన మనిషి జాడ
చెప్పండి.
వస్తువ్యామోహానికి బలై
అవసరం లేనిది కొనిపించే
గ్లోబల్ ప్రపంచం!
యమదూతల్ల వెంటపడే
మార్కేట్ మాయాజాలం.
నాకు కాసింత ప్రేమ
కావాలి.
మర్కేట్ నరకంలోంచి
నా ఊరి మట్టివాసన
దిశగా అడుగులు వేయాలి.
తొలకరి చిరుజల్లులా
పండువేసవిలో మలయ మారుతంలా
చింత చెట్టులోని చిగురాకులా
గాలిలొ ఎగిరే పక్షిలా
మార్కెట్ భూతం నుండి
నేను ఎగిరి పోవాలి!
--~--~---------~--~----~------------~-------~--~----~
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకీ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి: Google గుంపుల వారి "తెలుగు సాహిత్య వేదిక" గుంపు.
ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: syak_13july@googlegroups.com
ఈ గుంపు నుండి విరమించుకునేందుకు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment