Wednesday, March 7, 2007

కలల కన్య ...

కలల కన్య
ప్రసవ వేధన పడి
శూన్యాన్ని కంటున్నది.

కాలాన్ని బంధించి
రాజ్యాంగంలోని సెక్షన్లను వెతికి
కఠినంగా శిక్షిస్తాను!

పుస్తకాల మధ్య దాక్కొన్న
అక్షరాలు ధాస్యాన్ని విడవమని
కన్నీరుగా ప్రవహిస్తున్నవి!

విప్పరిత నేత్రాలలో
అస్పష్టపు చూపుల తడి
సౌంధర్యాన్ని చూడనివ్వడం లేదు!

ఇపుడు కొత్తగా రాయడానికి ఏమిలేదు
అందరూ చీకి పారేసిన
భావాలు తప్పా!

No comments: