Thursday, March 8, 2007

మట్టి అంటే...

మట్టి అంటే...
బుక్కెడు బువ్వే కదా!
నా మట్టి నాకు కాకుండా
పోతుంది.
నిలబడడానికి కాసింత
భూమి లేకుండా పోతుంది.
ప్రపంచీకరణ విషఫలాలు
నా మట్టికి ధరను నిర్ణయించింది.
ఒకప్పుడు నా ఊరి మట్టివాసన
బ్రతక డానికి దోహదపడేవి
ఇపుడు నేను ప్రభుత్వ అబివృద్దికి
నా తల్లి లాంటి మట్టిని
అమ్మకానికి పెట్టాను!
అవును నేను నా మట్టి తల్లికి
ద్రోహం చేసి పచ్చని నోట్లతో
నిర్దయగా మట్టిని
తన్నుకొంటూ వెళుతున్నాను!

No comments: