Thursday, March 8, 2007

నేను చూసాను...

నేను చూసాను...
నగ్న చిత్రాన్ని
కల్లోళిత మనసుతో!
దేహం అంగడి సరుకైనప్పుడు
అంగుళానికి ఒక రేటు
నా మనస్సుతో పని లేకుండా
నిరంతరం పాకే విష జంతువులు
నా ఆకలి నాకు నా దేహం చూపించింది.
మలినమైన లోకంలో
మానవత్వాన్ని విడిచి
మెహింది బజారులో నిలబడ్డ నా విష యంత్రం
సూట్,బూట్ లతో వచ్చే వారికి
నా దేహం ఒక వస్తువు...
పచ్చని నోట్ట్లతో వచ్చె వారికి
మనసు మరిచి బిస్తర్ వేస్తాము
అవును నేను వెశ్యనే!
బ్రతుకు భారం
ఐనప్పుడు ఆ బరువును
దించుకోవడం
నేరంకాదు...

No comments: