రాత్రి పగలు
విడాకులు తీసుకున్నాయి
ఒకరి మొహం ఒకరు
చూడలేక!
వధువు తలొంచుకొంది
సిగ్గుతొ కాదు
నా అనకారి తనాన్ని
చూడలేక!
గడియారం వంకా
చూస్తే నాకెప్పుడు
భయం వెస్తుంది
తగ్గి పోతున్న నా వయస్సు గుర్తొచ్చి!
ప్రియురాలు
ఎప్పుడూ నా జేబు వంక
చూస్తుంది
నేను ఆమె మొహం లోకి
చూస్తాను!
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment