ఆకాశం నుండి జారిన వానచినుకులా
జీవితం నుండి ప్రేమ జారిపొహింది!
ఇపుడు కాగితపు పడవలతో
జీవితాన్ని ఎలా ఈదడం.
నేను చంద్రునిడై చల్లని వెన్నెలను
భూమాతపై వర్షిస్తాను
గాలినై గట్టిగా హత్తుకుంటాను
చిరుదివ్వెనై ప్రపంచ అంధకారాన్ని
నిర్దాక్షిణ్యంగా వెడలగొడతాను.
ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని
ఎవరికి అందకుండా సొంతం చేసుకుంటాను.
విశ్వ మానవున్ని
నా హౄదయపు లోతును కొలవడం
మానవులకు అసాధ్యం
కౄతిమ బ్రతుకులకు చిరునవ్వుల సహజత్వాన్ని
దానం చేస్తాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment