Wednesday, March 17, 2010


బాల రసాల...
బాలరసాలపుష్ప నవపల్లవ కోమల కావ్య కన్యకన్గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్హాలికులైననేమి మరి యంతకు నాయతి లేనినాడు కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమైఏవిటి, ఇది పోతన పద్యంలా అనిపిస్తోంది కాని కాదు అని ఆలోచిస్తున్నారా? అవును ఇది పోతన పద్యం కాదు. ఇది మంచన రచించిన కేయూరబాహు చరిత్ర కావ్యంలోని పద్యం. ఈ మంచన కవి క్రీ.శ. 1300 ప్రాంతం వాడని పరిశోధకుల అభిప్రాయం. పోతనకన్నా ముందరివాడు. ఇక్కడ "కూళలు" అంటే క్రూరుడు, మూఢుడు అనే అర్థం. అటువంటి వారికి సుకుమారమైన కావ్య కన్యకని ఇచ్చి ఆ పడుపుకూడు తినడం కన్నా పొట్టపోసుకోడానికి కవులు హాలికులగా మారి పొలం దున్నుకోడం మంచిది. అదికూడా లేదూ అంటే "కౌద్దాలికులు" అయినా పరవాలేదు అని దీని భావం. "కుద్దాలము" అంటే ఒక రకమైన గడ్డపార. కౌద్దాలికులంటే గడ్డపార పట్టుకొని కందమూలాలు తవ్వి తీసుకొని తినేవాళ్ళు అని అర్థం చెప్పుకోవచ్చు. నిజానికి మంచన తన కేయూరబాహు చరిత్రని నండూరి గుండనమంత్రికి అంకితం ఇచ్చాడు. అంచేత ఇక్కడ అతని ఉద్దేశం కావ్యాన్ని కూళలకి అంకితమివ్వకూడనే కాని నరులెవ్వరికీ అంకితమివ్వకూడదని కాదు.మనకి చాటుపద్యాల సంప్రదాయం ఉండేది. సామాన్య ప్రజల నాలుకల మీదగా చాటువులు ప్రచారం పొందేవి. చాలాసార్లు అసలు వీటిని రాసినదెవరో కూడా తెలియదు. కొన్ని చాటువులు కొందరు కవుల పేర్ల మీద చెలామణీ అవుతూ ఉండేవి. కొన్ని కావ్యాలలోని పద్యాలు కూడా ఇలా చాటువులుగా మారిన సందర్భాలున్నాయి. అదిగో అలా మారిన ఒక చాటువు యీ పద్యం. ఈ చాటువులు మార్పులు చెందుతూ ఉండడం కూడా సాధారణంగా జరిగేదే. అలా కొన్ని మార్పులు చెంది తర్వాత కాలంలో ప్రసిద్ధి పొందిన పద్యం ఇది:బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్హాలికులైననేమి గహనాంతరసీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమైఈ మార్పులు పద్యానికి మరింత అందాన్నిచ్చాయి. "బాలరసాలపుష్ప" అనడం కన్నా "బాలరసాలసాల" అనడం సొగసుగా లేదూ! "సాలము" అంటే చెట్టు. లేతమావిడి చెట్టుకి పూసిన కొత్తచిగురంత కోమలమైన కావ్య కన్యక అని అర్థం. అలాగే "గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులు" అనడంలో పద్యానికి బిగువు వచ్చింది. "గహనము" అంటే అడవి అని అర్థం. అడవిలోపల కందమూలాలు తవ్వుకుంటూ బతుకు సాగించినా మంచిదే అని అర్థం.చాటు సంప్రదాయంలో ఇక్కడ జరిగిన మరో గమ్మత్తు, ఈ పద్యం పోతనగారిదని ప్రచారంలోకి రావడం. పోతనగారు నరునికి తన కావ్యాన్ని అంకితమివ్వనన్న విషయం ప్రసిద్ధమే. పోతన రైతు జీవితం గడిపాడన్న విషయం కూడా ప్రచారంలో ఉన్నదే. అంచేత ఊహశాలులెవరో, ఇందులో కూళలు అంటే మూఢులైన మనుషులు అని అర్థం చెప్పి దీన్ని పోతనగారికి అంటగట్టారు. పైగా "హాలికులైననేమి" అని ప్రతిజ్ఞ చేసి రైతుగా జీవితాన్ని కొనసాగించాడని అన్నారు. భలేగా ముడిపెట్టారు కదా! అన్నీ చక్కగా అమరిపోయాయి! అంచేత అది బహుళ ప్రచారంలోకి వచ్చింది.ఇదీ ఈ పద్యం కథ. ఏది ఏమైనా ఈ పద్యం పోతన నోటినుండి వచ్చిందని ఊహించుకోడమే తెలుగువాళ్ళకి ఇష్టం. ఈ పద్యం చదివినప్పుడల్లా మనకి పోతనే గుర్తుకువస్తాడు. అంచేత ఇది పోతన పద్యమే!
  1. తెలంగాణ జాడ
    అంతరాత్మ లేని వాడి పాదయాత్రకువెనక్కి తిరిగిన పాదాల గుర్తులే తప్ప అడుగుజాడలుండవుతెలుగుతల్లి మా సవతి తల్లేనని తెల్లవారేసరికి నాయకులుతేటతెల్లం చేసిన తర్వాతఇక మిగిలింది భాష అనే అర్థ సత్యమే కదా!వాదించటానికి నిజాలు లేనప్పుడుఅబద్ధాలు ఆకాశం అంటుతాయిభాష ఆకలి కడుపులు నింపలేదుబీళ్ళవైపు దప్పిగొన్న నోళ్ళవైపు నీళ్ళను మళ్ళించలేదుప్రాంతాన్నే ఫ్రీజోన్‌ చేసి దురాక్రమించుకున్నఉద్యోగాలు తిరిగి ఇవ్వలేదుపెట్టుబడిదారుకు తాకట్టయిన భూములు విడిపించలేదుచరిత్ర తవ్వకాల్లో దగాపడ్డ తమ్ముడి శవంతో పాటు వెన్నుపోటు పొడిచిన బాకు కూడా బయటపడుతుందిరాష్ట్రం- బుల్స్‌ఐ- రాజధాని నిండా ఉల్లంఘనల తూట్లుసంస్కృతి తెలియదు సంక్రాంతితెలియదనే వాణ్ణి చూసిచుక్కలను మించిన గాలిపటాలుపక్కున నవ్వుకుంటాయిద్వేష భాషను వినీ వినీ కృష్ణా గోదావరులు మురుక్కాల్వలవుతాయిపంచప్రాణాలవంచనా శిల్పం తెలిసినవాడే విగ్రహానికేదో జరిగిందని ఆగ్రహం ప్రకటిస్తాడువేల వేల కాళ రాత్రుల తర్వాతఒక అర్థరాత్రి ఉదయ సంకేతం వెలువడగానేప్రమాణం చేసి ప్రజా పీఠం ఎక్కినవాడు కూడాపట్టపగటి కుట్రలకు పాలికాపవుతాడుఏ ప్రాంతంలోనైనాచరిత్రలో అణచివేయబడే వాళ్ళనే ప్రజలంటారుబలైపోయిన తర్వాత బతికే వాళ్ళనే అమరులంటారుకాని ట్రిగ్గర్‌ మీద వేలుపెట్టి ‘కలిసుంటా’ అని బెదిరించే నాయకులనుఏమనాలో నిఘంటువులు వెతకాలి.

Friday, March 12, 2010

అవును మేము రిజర్వేషన్ గాళ్ళమే!
-ఇ. వెంకటేశ్
మా ప్రతిభను కొలవడానికి మీరు పారేసే భిక్షపు మార్కులు మా కక్కరలేదు చిలుక పలుకులు,బట్టీలు పట్టడం మాకు చాతకాదు! సృజనాత్మకత మా పుట్టుకలోనే ఉంది నా తండ్రి వ్యవసాయ పనిముట్లు తయారు చేయడంలో ఉంది. నా తల్లి పంట నూర్పిడిలో ఉంది మీకు చేతనైతే ఒక అక్షరాన్ని అందంగా చెక్కండి వ్యాక్యాన్ని నల్లని దళిత సౌందర్యవతిలా మార్చండి ! కాలం మారిన కొద్ది కులం రూపు మారిపోతుందనుకున్నాను కాని... ఉన్నత విశ్వ విద్యాలయాల్లో కాల నాగై కాటేస్తుందనుకోలేదు! మా ప్రతిభను కొలవడానికి మీకున్న ప్రస్తుత కొలమానాలు సరిపోవు అనంతమైన నా తెలివిని మీ మోకాళ్ళతో కొలువలేరు!
(విశ్వవిద్యాలయాల్లో కులవ్యవస్థ వికృత స్వరూపం చూసి...)
--- E.Venkatesh, M.A., Lecturer in Telugu,
Sravanthi Junior College, Zaheerabad, Medak Dist.
Ph: 9912950309, mail: venkat9venkat9@gmail.com
Home Page: www.venkateshuoh.blogspot.com

Thursday, March 11, 2010

మౌనం మాట్లాడుతోంది
మౌనం మాట్లాడుతోంది మానవత్వం మట్టి కలిసినపుడుమనిషితో మనిషి కరచాలనంగత కాలపు వైభవం మాత్రమే!రెండు రక్తపు చుక్కలుచిందించి ఎంతమందినల్లవాళ్ళు వారి శరీరాన్ని కళేబరాల్ని చేసుకున్నారో!నా అస్తిత్వం మాయమై ఆకాశం వరకు చిమ్మిన చెమట చుక్కలు ఇపుడు వర్షమై మీ దాహాన్ని తీర్చుతున్నాయి!చిన్నప్పుడు చెప్పిన చందమామ కథ పగిలిన గాజు పెంకుల్లా చెల్ల చెదురుగ పడిన శకలాల్ల తోస్తున్నాయి!చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతుంది ఒంటరి సమూహంలో ఉన్నప్పుడు రాత్రుళ్ళు పేలిన బాంబుల శబ్దాల్లా!అనుమానపు చూపులతో దేహాలను ఎక్స్‌రే తీస్తున్నారు రక్త మాంసాలతో పాటు కాసింత మానవత్వపు రేఖలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి! ఆకాశమే హద్దుగా కంఠమెత్తి విలపిస్తున్నా మారణ హోమానికి వ్యతిరేకంగా!చివ్వున చిందిన నెత్తురు మరకలసాక్షిగా మీ నీత్తురు వృధాపోదని అభయ హస్తం ఇస్తున్నా!
- ఇ. వెంకటేశ్‌ (పూణేలో జరిగిన మారణకాండకు స్పందిస్తూ...)

Thursday, March 4, 2010

  • పల్లె కన్నీరు పెడుతోంది...బీడైపోయిన నేలను చూసి'సెజ్'ల పాలైన పంటచేలను చూసికబేళాలపాలైన గోమాతలను తలచిఅప్పులపాలైన అన్నదాతను చూసిఉరికొయ్యలపాలైన నేత కార్మికులను తలచివలసపోయిన జనాలను తలచిబోసిపోయిన ఉమ్మడింటిని చూసిమమ్మీ డాడీలైపోయిన అమ్మానాన్నలను తలచిపాడిపంటలతో,పసిడిరాశులతోఉమ్మడికుటుంబాలతో,ముంగిటముగ్గులతో ఆత్మీయత నిండిన పలకరింపులతో అలరారిన తన గత వైభవాన్ని తలచిభవిష్యత్తు మీద బెంగతో పల్లె కుమిలి కుమిలి కన్నీరు పెడుతోంది

కవిత్వ విమర్శ కంటే కథా సాహిత్య విమర్శ సమకాలీన యుగంలో విస్తృతంగా వస్తున్నది. కథను గురించి లోతైన విశ్లేషణలు, ఆలోచనలు విరివిగా వస్తున్నాయి. ఒక సంవత్సర కాలంలో వెయ్యి కథలు వస్తే సుమారు పది పదిహేను కథా విమర్శన పుస్తకాలు, విరివిగా వ్యాసాలు వస్తున్నాయి. సమాజంలోని వ్యక్తులు ఆవేశాంతరంగం కంటే ఆలోచనాంతరంగం వైపు ఈనాడు దృష్టి సారిస్తున్నారు. అందువల్ల ఆవేశ, ఉద్వేగ, అనుభూతి చైతన్యమైన కవిత్వం కంటే ఆలోచనా చైతన్యమైన కథ ఎక్కువ ఆకర్షిస్తున్నది. అది సాహిత్య విమర్శలో కూడా ప్రతిబింబిస్తున్నదన్న విషయం ఇటీవలి కధా సాహిత్య విమర్శను చూసినప్పుడు స్పష్టమవుతున్నది. అలా గత పది పదకొండు సంవత్సరాలుగా కథాసాహిత్యాన్ని లోచూపు తో అవలోకిస్తూ వస్తున్న విమర్శకుడు కె.పి అశోక్ కుమార్. సమీక్షకునిగా నిరంతరం సాహిత్య పత్రకలలొ విహరిస్తున్న కె.పి అశోక్ కుమార్ కథావలోకనం తో కథా సాహిత్య విమర్శ రంగానికి దోహదం చేస్తున్నారు. ఈ రచన సమకాలీన కథా విమర్శకు నిలువటద్దంగా కనిపిస్తుంది.
మొత్తం ఇరవై మూడు వ్యాసాలున్న ఈ పుస్తకంలో పది సమీక్షలు కాగా, మిగిలినవి కథా సాహిత్యంలోని వివిధ పార్శ్యాలను, ధోరణులను కథకుల విశిష్టతను తెలిపేది. ఈ పుస్తకానికి కె.కె.ఆర్ పీఠిక వ్రాస్తూ అశోక్ కుమార్ ది మౌఖిక శైలి అనడం సబబే అనిపిస్తుంది. వ్యాసాన్ని మనకెదురుగా నిలబడి మాట్లాడుతున్నట్లు రాయడం కె.పి వ్యాస రచనా శైలిగా చెప్పవచ్చు. హాలీవుడ్ చిత్రాల సమీక్షల్లో చిత్రం చూడనివారికి కథ చెప్పాల్సినస్థితి ఉంటుంది. ఆ శైలి ఈ విమర్శ వ్యాసాల్లోకి చేరంది. కె.పి అశోక కుమార్ శైలిలో మౌఖికతకు కారణం పాఠకునిగా తనకు ఒక కథ కలిగించిన అనుభవాన్ని తనలో రేకెత్తించిన ఆలోచనలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వలన వచ్చిందనిపిస్తుంది. ఇది పాఠక ప్రతిక్రియ విమర్శకు దగ్గరగా ఉంటుంది. ఈ శైలిని అల్లం రాజయ్య చెమట చుక్క కలలు రెండు కథలు వంటి వ్యాసాల్లో ప్రత్యక్షంగా చూడవచ్చు.
సమకాలీనకథ వస్తు, రూప పరిణామం, తెలుగుకథా సాహిత్యంలో హిందూ ముస్లిం సమైక్యత ధోరణులు, తెలుగు కథల్లో చైతన్య స్రవంతి వ్యాసాలు పరిశోధనాత్మక కలిగిన విమర్శన వ్యాసాలు. 1991 లోవచ్చిన కథలను నేపధ్యంగా చేసుకుని విశ్లేషించిన ఈ వ్యాసంలో సమకాలీన వస్తు పరిణామంలో ఆనాడు వస్తున్న కథలను పదకొండు రకాలుగా విభజించారు. ఈ వ్యాసంలో నామిని సుబ్రమణ్యం నాయుడు కథలను గురించి చెప్పిన విషయం కె.పి నిశిత దృష్టికి నిదర్శనం (పు.28) బాల్య, కౌమార, యవ్వన దశలను ప్రతిబింబిస్తూ పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కథలు మిట్టూరోడి కథలు వచ్చాయని చెప్పడం మంచి విశ్లేషణ. ఈ కాలంలో రూపంలో స్కెచ్, చిన్నకథ, కార్డు కథ, పేజీ కథ, కాలమ్ దాటని కథల వంటివి వచ్చినా అవి స్పేస్ ఫిల్లర్స్ గానే ఉన్నాయని భావించారు. తెలుగు కథల్లో చైతన్య స్రవంతితోని చర్చించిన వ్యాసంలో శ్రీశ్రీ చైతన్య స్రవంతి ధోరణిలో వ్రాసిన తొలికథకుడిగా కె.పి.భావించారు . శ్రీ శ్రీ అబ్సర్డ్ కథాకథన పద్ధతిని చైతన్య స్రవంతిని కొనసాగించాడన్నారు గానీ అంటే ఏమిటో చెప్పలేదు. త్రిపుర కథల్లో భగవంతంకోసం, రాబందులరెక్కల చప్పుడు ,సఫర్ కథలను చైతన్య స్రవంతిని చెబుతూ “ఈ మూడు కథల్లో చైతన్య స్రవంతి ధోరణిని డిఫరెంట్ గా ఉపయోగించుకోవడం అన్నారు (పు.78) ఆ డిఫరెంట్ ఏమిటో చెప్పలేదు. జ్వరం మీద కవిత్వం వచ్చినట్లుగానే ‘కథకుని జ్వరం’పేరుతో పి.యస్. శాస్త్రి రచించిన కథను పేర్కొన్నారు వల్లంపాటి వెంకట సుబ్బయ్య’ రానున్న శిఖరం ‘ చైతన్య స్రవంతి కథకాదన్నారు. అయితే చైతన్యస్రవంతి కథేమో అన్న భ్రమ కలిగించే కథకు నిజమని చైతన్య స్రవంతి కథకు మధ్య ఉన్న విభజన రేఖ గురించి చెప్పి ఉంటే బాగుండేది. ఈ వ్యాసంలో శ్రీశ్రీ తో అధివాస్తవికత , బైరాగిలో ప్రతీకవాదం ఆర్ .యస్. సుదర్శనంలో అస్తిత్వవాదం, నవీన్ లో శిల్పంలో కనిపిస్తాయని ప్రతిపాదించారు. తెలుగు కథాసాహిత్యంలో హిందూ ముస్లిం సమైక్యతా ధోరణులన్న వ్యాసంలో ప్రజాస్వామ్య లౌకిక భావనలను తెలిపే కథలను విశ్లేషించారు.
కథకుడుగా బైరాగి, కథకునిగా కాళన్నలను విశ్లేషించే వ్యాసల్లో కవులుగా ప్రసిధ్ధులైన ఈ ఇద్దరి కథలను విమర్శించారు. కథకునిగా వైరాగి వ్యాసంలో బైరాగి రాసిన కథల్లో ఆయన జీవితం ఉందని భావించారు. ఆయన కథలలో ఉన్న హీరో, వారు కోరుకునే ఒంటరితనం, భావుకత నిర్లిప్తత అన్నీ బైరాగివే (పు.10) అనడం ద్వారా ఆయన కథలు ఆత్మ కథనాత్మకం మన్న స్ఫురణ కనిపిస్తుంది.కాళోజీ కథలను గురించిన వ్యాసంలో కాళోజీ కథలు పతనమైపోతున్న రాజకీయ వ్యవస్థను ఎండగడతాయనీ, అవకాశవాదాన్ని విమర్శిస్తాయనీ, 1940-50 నాటి సామాజిక రాజకీయ స్థితులను ప్రతిబింబిస్తూ తెలంగాణ నేటివిటీ తో కూడుకొని ఉన్నాయని భావించారు.
కె.పి.అశోక కుమార్ తన వ్యాసాలలో వ్రాస్తున్న విషయాన్ని బట్టీ ప్రాంతీయ అస్తిత్వ ముద్ర ఉన్న విమర్శకుడిగా కనిపించడు కానీ ఆయన వాసిన 23 వ్యాసాలలో సుమారు 16 వరకు తెలంగాణా కథకుల కథలనే చర్చించింది. శ్రీశ్రీ కథల్లో చైతన్య స్రవంతి ధోరణులు వ్యాసంలో అబ్సర్డిటీ, సర్రియలిజం లక్షణాలుంటాయని భావించారు. అల్లం శేషగిరి రావు అడివి విస్తృతమైనదీ భయంకరమైనదీ ( పు.13) అంటూ ఇద్దరు రచయితలు ఒక అంశం మీద రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ తులనాత్మక వివేచన చేసారు కె.పి ఇది చాలా చోట్ల ఈ సంపుటిలో విషయాన్ని గుర్తు చేస్తూ తులనాత్మక వివేచనలో ప్రభావాన్ని గుర్తించడం కూడా ఒక భాగం “కథకుని జ్వరం రాసిన శాస్త్రి గారిపై బుచ్చిబాబు ప్రభావం, నరకంలో నలభై ఐదు నిమిషాలు రాసిన రామకృష్ణారావు గారిపై నవీన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది”_ (పు.81) వంటి విశ్లేషణ కె.పి నిశితదృష్టిని సూచిస్తాయి. గూడూరు సీతారాం గల్పికలపై చలం , ధనికొండ హనుమంతరావు, రావూరి భరద్వాజ ల ముద్రను గుర్తించడం (పు.89) ఆడెపుల లక్ష్మీపతి అశ్యాపదేశం కథ వ్యాసంగా మొదలై కథగా మారుతుంది ఇది లాటిన్ అమెరికన్ కథకుడు బోర్గ్స్ పద్ధతి వంటి వాటిని గుర్తించడం (పు.49) వంటివి కె.పి తులనాత్మక దృష్టి సంకేతాలు ఇటువంటిదే కలలు – రెండు కథలు వ్యాసం.
ఆడెపు లక్ష్మీపతి గురించి వ్రాసిన వ్యాసం కె.పి. విశ్లేషణాత్మక దృష్టికి సంకేతంగా నిలుస్తుంది. ఆడెపు లక్ష్మీపతి కథల్లో దృశ్యకథనపద్ధతి నాటకీయ పద్ధతి , స్వీయ సంబోధనాత్మక కథనం , వంటి కథన పద్ధతులున్నట్లు కె.పి భావించారు. సీతాదేవి , అల్లంరాజయ్య ,కాలువమల్లయ్య, గీతాంజలి సలీం,పెద్దింటి అశోక్ కుమార్ , జూకంటి జగన్నాధం వంటి కథకులపై వ్రాసిన వ్యాసాలలో మౌలికమైన వివేచన కనిపిస్తుంది.
కథానిక వాస్తవికత దగ్గరగా ఉండాలనీ, వాస్తవజీవితాన్ని ప్రతిఫలించాలనీ కె.పి. అభిప్రాయంగా కనిపిస్తుంది.అందుకే ఆయన ఈ పుస్తకంలోని చాలా వ్యాసాలలో’ అతి నాటకీయత’ను , వాస్తవికతను డాక్యుమెంటరీ పద్ధతిలో కథను నిర్వహించడాన్ని నిరసించారు. ఇదే విధంగా కొన్ని ప్రతిపాదనలు కూడా కనిపిస్తాయి. ఫోటోగ్రఫీ నేపధ్యంగా వస్తువుగా వచ్చిన తెలుగుకథగా దీన్ని (నిశ్చలన చిత్రం) చెప్పుకో వచ్చు (పు . 44)” నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన చైతన్య స్రవంతి కథలలోకెల్ల శిల్పపరంగా ఆంగ్లంతో దీటుగా నిలబడగలిగింది ఒక్క బుచ్చిబాబుగారి కథే (పు 78) వంటివి కనిపిస్తాయి.కథలను గురించిన వ్యాసాలలో కొన్ని చోట్ల నేపధ్య వివరణ ఎక్కువుగానే చేసారు కె.పి. కథల్లో హిందూ ముస్లిముల సమైక్యత ధోరణుల గురించిన వ్యాసంలో మొదట రెండు పేజీలు నేపధ్యమే ఉంది. ఇదే పద్ధతి మరో రెండు మూడు వ్యాసాల్లో ఉంది. బహుశా దీనికి కారణం ఆయన కె.కె.ఆర్ నడిపిన సారస్వత వేదిక, సమాంతరల నుంచీ ఆలోచనలను విస్తృతి చేసుకున్న వారు కావడమేమో ? అనిపిస్తుంది. ఈ పుస్తకంలోని చివరి వ్యాసం రచయితలు ఇలా కూడా ఉంటారా ? లో టి. శ్రీరంగస్వామి కథల సమీక్ష చేస్తూ రచయితల వ్యక్తిగత జీవితాలను గురించి తన అభిప్రాయాలను చెప్పారు. నిజానికి రచయితకు ప్రాధాన్యమివ్వడం ఆధునిక పద్ధతి. సాహిత్యానికి రచయిత ప్రధానం కాదు. రచన ప్రధానం. రచన ఇచ్చే అనుభవం అనుభూతి, అది చెప్పే తత్వం ప్రధానమని గుర్తించినప్పుడు ఈ భ్రమలకు ఆస్కారం ఉండదు. అయితే రచయిత మరో పార్శాన్ని ఈ రచయిత మరో పార్శాన్ని ఈ కథలు వ్యక్తం చేస్తామనడంలో సందేహం లేదు.
గత పది పదిహేనేళ్ళుగా కథా సాహిత్యాన్ని లోతుగా పరిశీలిస్తున్న కె.పి.అశోక్ కుమార్ ‘కథావలోకనం’ చేశారనడం కంటే కథానుశీలనం చేశారనడం సబబనిపిస్తుంది. గత యాబై సంవత్సరాలలో తెలుగుకథ పోయిన పోకడలను తెలుసుకోవాలనుకున్న వారికి ఈ ‘కథావలోకనం’ తప్పక చదవవలసినస్న పుస్తకం.
“మన నేల ఒకటే
మన జాతి ఒకటే
అయితే
బతుకులొక్క తీర్గ
ఎందుకు లెవ్వురా అయ్య’’''అంటూ తెలుగు కవిత్వం నేడు ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంతో ముందుకొస్తుంది. "ప్రాంతీయ' భావనను శాస్త్రీయంగా అవగాహన చేసుకోలేని వాళ్ళు లేదా ఇష్టపడని వాళ్ళు దాన్ని ఒక "వేర్పాటు వాదం' గానే పరిగణిస్తుంటారు.
"ప్రాంతీయ' భావన అనేది నిజానికి తమకు జరిగే వివక్షను గుర్తించి దాన్ని కొనసాగించడం సరైంది కాదని చెప్పడానికి ప్రశ్నించడం, నిరసించడం, ధిక్కరించడం, చివరికి స్వీయ అస్తిత్త్వాన్ని కోరుకోవడం వంటి రూపాల్ని తీసుకొంటుంది. ఇలాంటి ప్రాంతీయ భావన ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది.
ఒక ప్రాంతంలో పుట్టి, పెరిగి, ఆ భౌగోళిక ప్రాంతాన్నే నమ్ముకుని జీవిస్తున్న ప్రజలపై, ఆ ప్రాంతానికి వివిధ కారణాల వల్ల వలస వచ్చి, క్రమేపీ అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న వాళ్ళు స్థానికులపై ఆధిపత్యం చెలాయించడంతో "స్థానీయ' భావన నుండి " ప్రాంతీయ' భావన పుట్టుకొస్తుంది. అది ఉద్యమ రూపం పొందిన తర్వాత "ప్రాంతీయ వాదం'గా తీవ్రమవుతుంది. దీన్ని ఒక ప్రాంతంలోని ప్రజలు ఏవో కొన్ని కారణాల రీత్యా తమ కంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని, గుర్తింపుని కోరుకుంటే అటువంటి ఆకాంక్షను ప్రాంతీయ వాదం అంటారు' అని సామాజిక శాస్త్రవేత్తలు నిర్వచించారు. ఈ సామాజిక సమస్యల్ని తీసుకొని రాసే సాహిత్యాన్ని ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యం అంటారు.
"స్థానీయ' భావన కంటే ముందే కుటుంబం నుండి మొదలయ్యే గుర్తింపు కోసం పడే సంఘర్షణ, వ్యష్ఠి నుండి సమష్ఠికి పరిణామం చెంది రకరకాల అస్తిత్త్వాల కోసం పడే వేదన, తపన, ఘర్షణలన్నీ అస్తిత్త్వ ఉద్యమాలుగా బయటపడుతుంటాయి. అందుకనే ప్రాంతీయ వాదం, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం వంటి పారిభాషిక పదాల్లో లోతైన తాత్త్వికత ఉంది. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే అంతర్భాగంగా ఒక వాదం కొనసాగుతూనే, బయట మరో ముఖ్యమని భావించే వాదం సమష్ఠిగా బహిర్గతమవుతుంటుంది. దీన్ని తెలుగు సాహిత్యంలోనే గమనించినా చాలా స్పష్టంగా వివరించుకొనే అవకాశం ఉంది.
మొదట్లో ఒక ప్రాంత జీవన స్థితిగతుల్ని ప్రతిఫలించే దిశగా తెలుగులో ప్రాంతీయ సాహిత్యం వచ్చింది. దానిలో అస్తిత్వ చైతన్య ధోరణి ఉందని చెప్పలేం. కానీ, ప్రాంతీయ వేదనలు ఉన్నాయని మాత్రం చెప్పగలం. ఒక సామాజిక చైతన్యంతో వచ్చే సాహిత్యం అస్తిత్వ సాహిత్యం.తెలుగులో చాసో తీసుకొచ్చిన " కళింగాంధ్ర కథలు' సంకలనం తొలిసారిగా ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని ఒక చోటికి తెచ్చిందని విమర్శకులన్నారు. ఆ తర్వాత "సీమ కథలు' వచ్చాయి. అంతకు ముందు తెలంగాణ ప్రాంతంలో గోల్కొండ కవుల ప్రత్యేక సంచిక' వచ్చింది.
తెలుగు భాష మాట్లాడే వాళ్ళంతా స్వాతంత్ర్యానంతరం రెండు కారణాలతో ప్రాంతీయ స్పృహను ప్రదర్శించారు. అవి ప్రత్యేక భాష, ప్రత్యేక భౌగోళిక ప్రాంతాన్ని ఒక ఆధారంగా చేసుకొనిన ప్రత్యేక రాష్ట్రంగా మారాలని కోరుకోవడంగా చెప్పుకోవచ్చు. దాశరధి, సోమసుందర్‌, ఆరుద్ర వంటి వాళ్ళంతా రాసిన సాహిత్యంలో ఈ ప్రాంతీయ స్పృహ బలంగానే కనిపిస్తుంది. అందుకనే
"కోటి తమ్ములకడ రెండు కోట్ల తెల్గు
టన్నలను గూర్చి వృత్తాంమందజేసి
మూడుకోటుల నొక్కటే ముడిబిగించి
పాడినాను మహాంధ్ర సౌభాగ్య గీతి'అని తెలంగాణ ప్రాంతం నుండీ ఆనాడు తెలుగు వాళ్ళంతా ఏకం కావాలనే ఆశను వ్యక్తంచేశారు. పాలకులపై ఉండే సహజ వ్యతిరేకతతో పాటు, సాంస్కృతిక ఆధిపత్య నిరాకరణ అప్పటికి నిజాము ఒక పిశాచంగా భావించడం ఒక ప్రధాన కారణం. అదే నిజామ్‌ వంశ పాలను ఇప్పుడు కొంతమంది ప్రశంసిస్తున్నారు. నేటికి ప్రాంతీయ వాదం తీవ్రస్థాయికి చేరుకోవడమే దీనికి ముఖ్యకారణం కావచ్చు. అందుకనే నేడు కవుల గళాల్లో ప్రత్యేక అస్తిత్వ స్వర తీవ్రత పెరిగింది.
ప్రాంతీయ వాదం కొంతమంది సృష్టి వల్లనో, కొంతమంది స్వలాభం కోసమో వస్తే అదిఅనేక సంవత్సరాల పాటు ఉద్యమంగా కొనసాగలేదు. నాయకులు మారవచ్చు. నాయకత్వం మోసం కూడా చేయవచ్చు. అయినా ప్రజల కాంక్ష మరో నాయకుడితోనైనా ముందుకెళ్తుంది. అదిప్పటికే తెలంగాణలో జరుగుతూనే ఉంది. అనేక అనుభవాల్ని మూటకట్టుకొని ముందుకెళ్తుంది. దాన్ని కవులు ఇలా వర్ణిస్తున్నారు.
''మా కెవ్వల సొమ్ము అక్కర్లేదు
మాయి మాకు దక్కితే సాలు
మా ఆరాటంలో అలజడి ఉన్నది
అన్నాలమై పోయిన మొత్తుకోలున్నది
బొండిగల నిండా బాధలున్నాయి
నడిమిట్ల పెత్తనం దొరికిచ్చుకొని చెలాయించేటోల్లకాడ
అనిగి మనిగి పడ్డది సాలు
మాకు సోయి లేదనుకోకండ్రి
అనుభవాలు మాకు అన్నినేర్పినయి''అని ఆ అనుభవాలతోనే కవులు కూడా ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ఇది ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలోనే తీవ్రస్థాయిలో కనిపిస్తుంది. అందువల్ల ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యం అనగానే తెలంగాణ సాహిత్యం అనే స్థితికి చేరుకుంది.
సర్వసాధారణంగా అస్తిత్వ సాహిత్య స్వరూప స్వభావాల్లో కొన్ని ముఖ్యాంశాలను గమనించవచ్చు. తమను నిర్లక్ష్యానికి గురిచేయడాన్ని గుర్తుచేస్తారు. దాన్ని సరిచేసుకోలేదనిపించినప్పుడు ప్రశ్నిస్తారు. అప్పటికీ మార్పు కనిపించనప్పుడు నిరసిస్తారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రతిదాన్నీ ధిక్కరించడం మొదలవుతుంది. దీనితో అన్నీ దాని కేంద్రంగానే చూస్తారు.
ప్రస్తుతం తెలంగాణ సాహిత్య కారులు ఆది కావ్యాన్ని, ఆదికవిని పునర్మూల్యల్యాంకనం చేస్తున్నారు. ఆది కావ్యంగా మహాభారతాన్నీ, ఆది కవిగా నన్నయను అంగీకరించట్లేదు. కవుల ప్రాంతాల్ని గుర్తించి సాంస్కృతిక వారసత్వాన్ని పునర్నిర్వచిస్తున్నారు. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం ఆ ప్రాంతకవులు ప్రచురించే కవితా సంకలనాల పేర్ల తో సహా ప్రతిబింబిస్తుంది. ఆ ప్రాంత కవులు సమష్ఠి గొంతుల్ని వినిపించేటట్లు అన్నట్లు పొంగిలి, మత్తడి కవితా సంకలనాలను, "తెలంగాణ తొలితరం కథల సంకలనం’ తీసుకొని రావడంతో పాటు గోల్కొండ కవుల ప్రత్యేక సంచిక' ను పునర్ముద్రించడం వంటి వన్నీ జరుగుతున్నాయి. మరో వైపు వివిధ కవితా సంకలనాలకు, సంపుటులకు రాస్తున్న ముందుమాటలు, ముద్దెర, ఇరుసు, ఇతివృత్తం వంటి విమర్శ పుస్తకాలు విస్తృతంగానే వస్తున్నాయి.
సాధారణంగా ప్రాంతీయ వాదం తీవ్రమవుతున్నప్పుడు సాహిత్యంలో కొన్నిప్రత్యేక అంశాలు కనిపిస్తుంటాయి.
*అన్నింటినీ పునర్మూల్యాంకనం చేస్తారు.
*తమ స్థితిని తలచుకొంటూ ఆ యా చారిత్రక, అర్ధిక, రాజకీయ కారణాల్ని అన్వేషిస్తుంటారు
*తమ అభివృద్ధికి ఇతర ప్రాంతాల వాళ్ళే ఆటంకమనే ఆరోపణలు చేసి, అవి నిజమని నిరూపించే ప్రయత్నంలో కొన్ని సాక్ష్యాధారాల్ని చూపిస్తుంటారు.
* తమ సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటే ప్రయత్నంలోఅప్పటికున్న ప్రమాణాలను తిరస్కరిస్తూనే కొత్త
ప్రమాణాల్ని తయారు చేస్తుంటారు.
*దైనందిన జీవితంలోని అనేక అంశాల్ని సాహిత్యీకరిస్తూ కొత్త సూత్రీకరణల్ని అందిస్తుంటారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తమ ప్రాంత రచయితలు కూడా ఇతర ప్రాంతాల వాళ్ళ ప్రభావం
వల్ల స్వీయ అస్తిత్వాన్ని కోల్పోతున్నారని ఆవేదన చెందుతుంటారు
అందుకే ఇప్పుడు తెలంగాణ కవులు
"ఇప్పుడు
నాకు నా నేల కావాలి
నాకు నా గాలి కావాలి
నాకు నా నీరు కావాలి
నాకు నా ఊరు కావాలి'' అని స్పష్టంగా నినదిస్తున్నారు. ఇలా నినదించడానికి కావలసినంత నేపథ్యాన్ని చూపిస్తున్నారు. వలస ఆధిపత్యం, సాంస్కృతికంగా జరుగుతున్న అవమానాల్ని, రాజకీయంగా జరుగుతున్న కుట్రల్నీ తీవ్రంగానే సాహిత్యీకరిస్తున్నారు. ఇది తెలుగులో రాయలసీమ, కళింగాంధ్ర ప్రాంతాల పరంగానూ కొనసాగుతున్నా, తెలంగాణ ప్రాంతంలో చైతన్యం ""ప్రాంతీయ అస్తిత్త్వ ఉద్యమం'' గా పరిణామం చెందింది. అందులో భాగంగానే తమ ప్రత్యేక అస్తిత్త్వాన్ని నిరూపించుకొనేదిశగా ప్రత్యేక ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలను సిద్ధం చేసుకుంటున్నారు. ముద్రణలో కనిపిస్తున్న కొన్ని సాహిత్యం పుస్తకాలను గమనిస్తే తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భాగంగా గుర్తించ నిరాకరించే ఉద్దేశం కనిపిస్తుంది. రాష్ట్రాన్ని తెలిపే చోట "" తెలంగాణ '' రాసుకోవడాన్ని ప్రాంతీయ అస్తిత్త్వ ఉద్యమంలో భాగంగానే గుర్తించాలనిపిస్తుంది.
"ప్రాంతం' ఒక సామాజిక వ్యవస్థకు సమష్ఠి రూపం. సామాజిక ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్రతిపత్తిని కోరుకోవడం, లేదా ప్రత్యేక దేశంగా, రాష్ట్రంగా, జిల్లాగా, మండలంగా జనసమూహం విడిపోవడం ద్వారా తమ ప్రయోజనాలు నెరవేరతాయని ఆశిస్తుంటారు. ఇది కొన్ని సార్లు ఒకే ప్రాంతంలో కూడా మళ్ళీ మళ్ళీ విడిగా ఉండాలనే ప్రత్యేక వాదాన్ని కొంత మంది ఉప-ప్రాంతీయ వాదం అంటున్నారు.
ఆసియా ఖండంలో భారతదేశం పరంగా చూసినపపుడు ఉప ఖండంగా పిలవబడుతూనే ప్రధాన ఖండంలో భాగంగా ఉంటుంది. అలాగే భారతదేశంలో వివిధ రాష్ట్రాలుగా విడిపోవడాన్ని కొంత మంది ప్రాంతీయ వాదంగానూ, మరి కొంతమంది భారత ఉప ప్రాంతీయ వాదం అనీ పిలుస్తున్నారు.
ఒకే రాష్ట్రం కూడా రెండు లేదా అంత కంటే ఎక్కువగా ప్రత్యేక రాష్ట్రాలుగా ఉండాలనుకోవడాన్ని కొంతమంది ఉప ప్రాంతీయ వాదం గానూ, మరికొంతమంది ప్రాంతీయ వాదంగానూ పిలుస్తున్నారు. ఇక్కడ ఉప విభాగాల ప్రస్తావన చాలా అవసరం. ఎందుకంటే, తెలుగు సాహిత్యంలోనూ ప్రాంతీయ వాదంలో కనిపించే భావనలతోనే అనేక విభజనల రూపంలో కనిపిస్తుంది.
సామాజిక సమస్యలే సాహిత్యంలోనూ ప్రతిఫలించాలని కోరుకోవడం సహజం. అలా అన్ని సమస్యలు, అన్ని ప్రాంతాల, వర్గాల, కులాల వారి ఆకాంక్షలు ఆ సాహిత్యంలో కనిపించనప్పుడు అస్తిత్త్వం కోసం వెతుకులాట మొదలవుతుంది. సాహిత్యం పునర్మూల్యాంకనానికి గురవుతుంది. కాల పరిస్థితులను కూడా పరిగణించకుండా తమ తమ మానసిక స్పందనల్ని వ్యక్తీకరిస్తుంటారు. తమని గౌరవ ప్రదంగా చిత్రించిన సాహిత్యం గురించి మాట్లాడరు. ఒక వేళ ప్రయత్న పూర్వకంగానో, అప్రయత్న పూర్వకంగానో ఆ వర్గాల్ని ఏ మాత్రం అవమానించినట్లు అనుమానించినా, నాటి సామాజిక పరిస్థితుల్ని కూడా పరిగణించకుండా తీవ్రంగా నిరసిస్తుంటారు. అప్పటి వరకూ ఉన్న నిర్ణయాల్నీ పరీక్షలకు పెడుతుంటారు.
ప్రతి సమస్యనీ ప్రాంతంతో ముడిపెట్టి చూడడం ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యంలో మరో ముఖ్యాంశం. కులం, మతం వంటి సమస్యలు తమని వెంటాడుతున్నప్పుటికీ, అవి ప్రాంతంతో ముడిపడినప్పుడు ఆ సమస్యల పరిష్కారం ద్వితీయమే అవుతుంది. తెలంగాణ ప్రాంతంలోని ముస్లిం వాదం ప్రాంతీయ వాద అస్తిత్వంతో ముడిపడి కొనసాగుతుంది. దళిత సాహిత్యంలో కనిపించే వర్గీకరణ విషయంలోనూ ప్రాంతీయ వాద ఉద్యమ ప్రభావం ఉన్నప్పటికీ, దానికింకా అంత తీవ్రత లేదు. కుల, మత అస్తిత్వ ఆరాటం తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదానికి ఉప
ప్రాంతీయవాదంగా మారలేదు. రాష్ట్రంలోని మిగతాప్రాంతాలైన రాయలసీమ, కళింగాంధ్ర, మధ్యాంధ్రలలో ఉన్న మాదిగలు వర్గీకరణ ఉద్యమాన్ని దళితుల సమానత్వాన్ని ఆకాంక్షించే దిశగానే కొనసాగిస్తున్నారు.
కళింగాంధ్ర ప్రాంతంలోనూ ప్రాంతీయవాద సూచనలు కనిపిస్తున్నా, అవి ప్రపంచీకరణలో భాగంగానే అత్యధిక మంది రచయితలు చూస్తున్నారు. కరువు, మూడవిశ్వాసాలు వంటి విషయాల్లో స్పందించే రాయల సీమ, కళింగాంధ్ర రచయితలు తమ సాంస్కృతిక అంశాల పట్ల దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. ఒకప్పుడు సినిమాల్లో, టి.వి.సీరియల్స్‌ లో బపూన్‌ , పనిమనిషి, విలన్‌ పాత్రల్లో వేష, భాషల్ని కించపరిచే దృశ్యాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. తెలంగాణ సాహితీ వేత్తల చైతన్యం ఆ ప్రాంతం వారి సాంస్కృతిక అంశాలను కించపరిచే చర్యలకు చాలా వరకూ అడ్డుకట్టవేసింది. వ్యాపార స్వభావులు తమకి అనుకూలంగా ఉన్న వాటిని సొమ్ము చేసుకోవడం సర్వసాధారణం. దాన్ని సాహితీవేత్తలు గుర్తించి వివిధ ప్రక్రియల రూపంలో సృజనీకరించి తమ మనోభావాల్ని వ్యక్తీకరించాలి. తూరుపు ( కళింగాంధ్ర కవిత్వం), రాయలసీమ కవులు ""వొరువు' కవితాసంకలనం వంటివి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి.
ప్రాంతీయ అస్తిత్వవాదం కంటే ప్రపంచీకరణ ప్రభావం వల్ల చిన్నాభిన్నమైపోతున్న జీవన వ్యధార్థ జీవిత దృశ్యాలను స్థానీయ కోణంతో వ్యక్తీకరిస్తున్నారు. ఒక భావజాలం గల వాళ్ళే ఇలా ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ సాహిత్యాన్ని సృష్టిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తుంది. అదే భావజాలం ఉన్న వాళ్ళు కూడా ప్రాంతీయ అస్తిత్వసాహిత్యాన్ని రాస్తూనే దాన్ని "వేర్పాటువాదం' గా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అలాంటి సమస్యల్ని పరిష్కరించడానికి పాలనలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిరంతరం తూర్పారపడుతూ, ప్రజల్ని నిత్యజాగృతుల్ని చేయగలగడం ద్వారానే ప్రాంతీయ సమస్యల శాశ్వత పరిష్కారాలు సాధ్యమన్నట్లు కూడా రాస్తున్నారు. నిజానికి దీన్ని కూడా ప్రాంతీయ అస్తిత్వ వాదంలో మరో పార్శ్వంగానే గుర్తించేవీలుంది. లేకపోతే తమ మాతృత్వ, పితృత్వంలో , కుటుంబంలో కోల్పోతున్న ఆత్మీయానురాగాలను గుర్తుచేసుకోలేరు. తమ గ్రామం, తమ సాంస్కృతిక వారసత్వాలను, తమ గ్రామీణ సమస్యలతో ముడిపెట్టి చూడ్డంలోనూ అస్తిత్వకోణం ఉన్నా అది స్థానీయమే అవుతుంది. ఇలా ప్రాంతీయ వాద అస్తిత్వ సాహిత్యం తెలుగులో పోరాటాల గడ్డ తెలంగాణ లోనే వివిధ ప్రక్రియల్లో విస్తరిస్తూ సాహిత్యానికి కొత్త దిశానిర్దేశం చేస్తుంది. అలాంటి చైతన్యంతో ముందుకెళ్తున్న రచయితలే సాహిత్యానికి నిజమైన జవజీవాల్ని అందించిన వాళ్ళవుతారు.
TEలంగాణా ప్రాంతం నుండి వచ్చిన దళిత కవుల్లో కూడా అంబేద్కర్ భావజాలం కంటే, మార్క్సిస్టు భావాల పట్లే ఎక్కువ మమేకత్వం కనపడేది. కానీ, ఈ మధ్య కాలంలో ఆ ధోరణి కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతుంది. అంబేద్కరిజమ్పై ఆసక్తి పెరుగుతుంది. స్థానీయతను ఆకాంక్షిస్తూనే, దళితుల ఆత్మగౌరవం అంబేద్కరిజమ్లోనే అంతర్భూతంగా ఉందనే సంగతిని గుర్తిస్తున్నారు.ఈ నేపథ్యంతో పరిశీలిస్తే, చాలామంది తెలంగాణా దళిత కవులు పరిణామం ఈ దిశగా కొనసాగుతుందని స్పష్టమవుతుంది. ఇటీవల పొన్నాల బాలయ్య ‘ఎగిలి వారంగ’ పేరుతో తన కవితలన్నీ ఒక సంపుటిగా తెచ్చాడు. ‘పొద్దు పొడవాల’నేది ఆ కవితా సంపుటికి పెట్టిన పేరులోని అర్థం. దళిత సమస్యలెలా పరిష్కరించబడాలో, తెలంగాణా సమస్యనెలా పరిష్కరించుకోవాలో, వర్గీకరణ సమస్యనెలా అర్థం చేసుకోవాలో, మార్క్సిస్టు పోరాటాల్ని, ఆ పోరాటాల్లో బలైపోతున్న దళితుల జీవితాన్ని ఎలా బాగుచేసుకోవాలో, ప్రపంచీకరణ నుండి ఎలా రక్షించుకోవాలో, అన్నింటికీ మించి సంస్కృతినెలా కాపాడుకోవాలో వివరించే దిశగా ఆలోచించి ఒక కొత్త ‘పొద్దు పొడవాల’నే ఆకాంక్షను కవి ‘ఎగిలి వారంగ’ లో వ్యక్తం చేశాడు.శక్తివంతమైన భావాన్ని, అంతేశక్తివంతంగా అందించగలగడమే కవిత్వం చేయడంలో కనిపించే శిల్పం. పొన్నాల బాలయ్య దాన్నింకా సాధన చేయవలసి ఉన్నా, తెలంగాణా పట్ల, ఆ ప్రాంతంలోని దళితుల పట్ల, మొత్తంగా ప్రజల ఆశల పట్ల స్పష్టమైన భావాలున్న కవి. వృత్తిరీత్యా హిందీ పండితుడైనా, తెలుగులో కవిత్వం రాస్తున్నందుకు ముందుగా ఆయన్ని అభినందించాలి. అలాగే, ఆ తెలుగులో కలిసిపోయిన మణి ప్రవాళ భాష గురించీ ఆలోచించమనాలి.‘ఎగిలి వారంగ’ లో చిన్నప్పుడే చనిపోయిన తండ్రి స్మృతితో కవిత్వం ప్రారంభమౌతుంది. తన బాల్యమెంత విషాదకరంగా సాగిందో ‘ఎగిలివారంగ’ కవిత అనేక దృశ్య చిత్రాలతో చూపిస్తుంది. కవిత అంతా విడివిడిగా పదాలున్నట్లు ఉంటుంది. ఒకదానితో మరొక దానికి సంబంధం లేనట్లుంటుంది. తన బాల్యం కూడా ఒక పద్ధతి ప్రకారం కొనసాగలేదనీ, తనలాంటి వాళ్ళ బాల్యం కూడా అలాగే ఉందని కవి శిల్ప నైపుణ్యంతో చెప్తున్నాడు. ఒక అస్తవ్యస్థత ఆ కవిత నిండా ఉన్నట్లు ఉంటుంది. ఆయన రాసుకున్న జీవిత నేపథ్యం చదివితే, ఆ కవిత బాగా అర్థమవుతుంది. బహుశా దాన్ని అలా చెప్తేనే బాగుంటుందనుకున్నాడేమో!“అయ్య కొట్టిన తంగెడు కట్ట
సోయి తప్పిన అవ్వ
ఆనిగపు బుర్ర నీళ్ళు….” ఇలా సాగిపోతుందీ కవిత.
తెలంగాణాకే ప్రత్యేకతను తెచ్చే పండగల్లో ఒకటి “బతుకమ్మ”. దీన్నితెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో దళితులు ఆడడానికి లేదు. ఆ పండగల్లో భాగస్వామ్యం కాలేని అలాంటి తెలంగాణా దళిత బాల్యాన్ని వర్ణిస్తూ…“అందరు పండుగ మోజులవుంటే
నేను పశుల గాస్తుంటే
డప్పుల చప్పుళ్ళతో
బతుకమ్మను తెచ్చి ఆడుతావుంటే
ఆవలుండి చూసుటే తప్ప
పండుగ జరుపుకున్న పాపాన పోలేదు” (పుట: 20) అని ఆనాడు అందుకోలేని అందమైన బాల్యాన్ని, చేజారిన సంతోషాన్ని గుర్తు చేసుకుంటున్నాడు కవి.మొదట్లో దళితుల్ని గుర్తించిందీ, చైతన్యం నింపిందీ ఖచ్చితంగా మార్క్సిస్టు సాహిత్యమే. నేటికీ దానిలో అదే మౌలిక భావన ఉంది. అయితే అది పీడిత వర్గదృక్పథంతో చూస్తుంది తప్ప, కుల స్పృహను ప్రధానంగా గుర్తించదు. కానీ, భారతదేశంలో కులమే ప్రధానమవుతుందని దళిత మేథావులు భావిస్తున్నారు. అదే అనేక సమస్యలకికారణమవుతుందని దళిత మేధావుల వాదన. ఆ పునాదిని గుర్తించకుండా కులాన్ని ఉపరితల అంశంగానే వర్గవాదులు గుర్తించడం జరుగుతోంది. మొదట్లో పీడిత వర్గ చైతన్యంతోనే తెలంగాణాలోనూ దళితులు ఆ భావజాల పార్టీల్లో పనిచేశారు. తర్వాత కాలంలో అంబేద్కర్ భావజాలంపై అవగాహన కొస్తున్నారు. దాన్ని కవి వర్ణిస్తూ…“పగలనక రాత్రనక పశులుగాసి
ప్రపంచానికీ దూరంగా పస్తులుండి
కారడవిలో వింత పశువునై
అడవే నాకు అవ్వ - అయ్య
ఆత్మీయతతో అడవితల్లి ఆదరించింద’నీ గుర్తు చేసుకుంటాడు. అయితే, తర్వాత కాలంలో జరిగిన మోసాన్ని కూడా గుర్తించమంటున్నాడు కవి.
“చెమట చుక్కలతో చెలకదున్నిన
ఎగిలి వారంగ యాతం బోసిన
అలసట ఎరగక అన్ని పండించిన
…………………………………
ఊరు బయటనే అంటరానోన్ని జేసిండ్రు” అని అక్కడ కులాన్ని ఆధారం చేసుకుంటున్నారని, అంతర్గతంగా మార్క్సిస్టుల విధానాన్ని ప్రశ్నిస్తున్నాడు. దళితులకు నాయకత్వాన్ని అందనివ్వని స్థితిని గుర్తు చేస్తున్నాడు. అక్కడా హిందూ భావజాలమే మార్క్సిస్టుల్లో అంతర్భూతంగా పనిచేస్తుందంటాడు. అందుకే దళితులకు“కనులు తెరిపించే కాంతొకటి వచ్చిందిఅంబేద్కరే ఆ కాంతి ” ( పుట: 34) అని స్పష్టంగా అంబేద్కరిజాన్ని ఎలుగెత్తి చాటుతున్నాడు కవి. భూములిప్పిస్తామంటూ పోరాటాలు చేస్తుంటే, పోలిసులు జరిపే కాల్పుల్లో దళితులే ఎందుకు బలవుతున్నారో, ఆ పోరాటానికి నాయకత్వం వహించే వాళ్ళనెందుకు ఆ తూటాలు తాకలేక పోతున్నాయో గుర్తించగలిగామని కూడా స్పష్టంగా ప్రకటిస్తున్నాడు కవి…
“ఎగేసుడు, సగేసుడు ఎనుకనే నిల్చుండుడు
ముందుండి… ముదిగొండలో
అసువులు బాసింది…. అణగారిన వారే” (పుట: 29) అని ముదిగొండలో దళితుల్నే ఎందుకు కాల్చారో, ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వారెలా తప్పించుకోగలిగారో చెప్తున్నాడు.తాను పుట్టి పెరిగిన తెలంగాణా ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేసుకుంటే తప్ప, నిజమైన పరిష్కారాలు లభించవనీ, అందుకే అందరూ కలిసికట్టుగా పోరాడమంటూ ప్రత్యేక రాష్ట్రం, ‘తల్లి తెలంగాణా’ కవితల్లో తెలంగాణాలో పాలకుల నిర్లక్ష్యం, స్వార్ధం వల్ల నిస్సారమై పోయిన స్థితిని వర్ణించాడు. “చావు తప్పి లొట్టబోయిన సంస్కృతిని, అస్తి పంజరంలా తయారైన గ్రామాల్ని నేపధ్యంగా చెప్పి, తేనెటీగల్లా కదిలి తెలంగాణా సాధించుకోవాలంటున్నాడు…
‘తెలంగాణ’ కవితలో!
“వలస పిట్టలు వాలకుండా
వడిశెలందుకుందాం
పర పాలకులు పొలిమేర పారంగ
తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందాం” అంటున్న పొన్నాల బాలయ్య తన నేలమీద నిలబడి, తన నిజమైన గొంతుతో, ఎలాంటి అస్పష్టతా లేకుండా కవిత్వం రాస్తున్నందుకు అభినందించవలసిందే!