Wednesday, September 15, 2010

  • పైశాచికత్వం కౄరంగా కాటువేసినప్పుడుఎన్ని అమాయకపు జీవితాలు..ఎన్ని అందమైన కలలు..ఎన్ని ఉన్నత ఆశయాలు..ఎన్ని లేత నవ్వులు..ఎన్ని ఆనందపు క్షణాలు..అంతమైపోయినవో కదా!కటిక పస్తులుండికన్నకొడుకుని చదివించికొత్త ఉద్యోగంలో కొడుకుని చూసిపస్తులేని రోజుల్ని కలలు కన్నఓ.. వెర్రి తల్లీ! నీ కోడుకునీ శరీరంలోని మాంసపు ముద్దనీ కన్నపేగు.. ఇప్పుడు నిజంగానే..మాంసపుముద్దగా.. పేగులగుట్టగా మారిఆసుపత్రి మార్చురీలో..శవాల గుట్టల మధ్య..ఆనవాలు లేకుండా ఉన్నాడు.ఎందుకీ ఘోరం.. ఎవరిదీ పాపం..అంతా అయిపోయింది..అవును..క్షణాల్లో.. అంతా అయిపోయింది.ఇక ఏడవకు తల్లీ..!ఏడ్చి మాత్రం సాధించేదేముందిలే!?ఇలా అన్నందుకునన్ను క్షమించు తల్లీ!నాకేం ఓదార్పు మాటలు ఎన్నైనా చెపుతాను.కాని.. కాని.. కాని..గర్భశోకం ఎవరిది తల్లీ!?నీది కాదా....!అవును నీదే కదా..!అందుకే ఏడువు..బాగా ఏడువు..గుండెలు పగిలేలా ఏడువు..కన్న తల్లుల కడుపు తీపిచల్లారేలా ఏడువు..ఈ పైశాచికపుఇ మారణహోమాలుణి కన్నీటితో తడీసి ఆరిపోయేలా..ఈ ఆటవిక కౄరచర్యలునీ ఆర్తనాదాలు విని ఆగిపోయే దాకా..ఏడువు...ఇంకా ఏడువు..ఏడువు..

No comments: