మాదక ద్రవ్యాల ముప్పు
- పిల్లల్లో సైతం వ్యాపిస్తున్న వ్యసనం- కేవలం చట్టాలే నిరోధించలేవు- డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం ఎంతో ముఖ్యం - దేశంలోనూ అధికసంఖ్యలో వ్యసన బానిసలుభామాదక ద్రవ్యాలు యన యువత భవితను బలి తీసుకుంటున్నాయి.. ముఖ్యంగా ముంబాయి నగరం మాదక పదార్ధాల కేంద్రంగా పనిచేస్తున్నది. బ్రౌన్ షుగర్ వంటి మత్తు పదార్ధాలను యువతీ యువకులు ఇంజెక్షన్ల ద్వారా తీసుకొంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో ఈ వ్యసనం పెరిగిపోతున్నది. ఎయిడ్స్ వ్యాధి కూడా ఆ ప్రాంతాలలోనే భయంకర స్థాయిలో ఉన్నది. ఇంక కొన్నేళ్ళకు దేశంలో మాదక ద్రవ్యాలను సేవించేవారి సంఖ్య కోటి, కోటిన్నర మందికి చేరుకోవచ్చునని ప్రస్తుత అంచనా. ఈ వ్యసనం ఇప్పటికి మాత్రం నగరాలకే పరిమితమై ఉంది. దీన్ని మొగ్గలోనే తుంచివేయకపోతే గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించి జాతి మొత్తాన్నే నిర్వీర్యం చేయడం తథ్యం. మత్తు పదార్ధాల వ్యసనానికి బానిసలు అయిన అయిన వ్యక్తులు జీవచ్ఛవాల వంటివారు. యువతీ యువకులే కాదు, పిల్లలు కూడా ఈ వ్యసనానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది. కొంతమంది కేవలం ఆనందంకోసం మాదక ద్రవ్యాలు సేవిస్తారు. కొంతమంది ‘సాహస’ భావంతో ఈ వ్యసనానికి శ్రీకారం చుడతారు. వీటి వినియోగం ఒక్కసారి అలవాటయ్యాక ఇక బయట పడడం కష్టం.చుట్టూ చక్కటి వాతావరణం లోపించినప్పుడు మాదక ద్రవ్యాలు పరిష్కారంగా కొందరికి కనిపిస్తాయి. చేతినిండా డబ్బు ఉండడం వల్ల కూడా ఈ వ్యసనం ఏర్పడవచ్చు. కేవలం చట్టాలతోనే ఈ వ్యసనాన్ని నిర్మూలించలేము. ప్రచారం కూడా సాగాలి. 1987- 94 మధ్య ‘కొకెయిన్’ ఉత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగింది. వరంగల్ వంటి జిల్లాలలో మూడు, నాలుగు ఎకరాల భూమిలో గంజాయి పండిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 1944లో 7900 టన్నుల గంజాయి ఉత్పత్తి అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 60 కోట్ల అమెరికా డాలర్ల విలువ చేసే మత్తు పదార్ధాల్ని సేవిస్తున్నారు. అమెరికా జాతీయోత్పత్తిలో ఇది 10 శాతం. మాదక ద్రవ్యాల దుష్ర్పభావాన్ని ప్రపంచానికి తెలియచెప్పడం కోసం ఐక్యరాజ్య సమితి 2000 దశాబ్దాన్ని మాదక ద్రవ్యాల వ్యతిరేక దశాబ్దంగా పాటించింది. ఈ దశాబ్దంలో వీటిని అరికట్టడానికి ప్రపంచ దేశాలమధ్య సహకారం గణనీయంగా పెరిగింది. డ్రగ్స్ నిరోధానికి చట్టబద్ధమైన చర్యలు కొన్ని తీసుకుంటున్నప్పటికీ ఫలితాలు రావడం లేదు. 1985 ఏప్రిల్‌లో భారత పార్లమెంటు ‘నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్‌స్టెన్స్ యాక్టు’ను రూపొందించింది.మత్తుపదార్ధాల అక్రమ రవాణాను అరికట్టేందుకు 1986లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను ఏర్పాటు చేసింది. మొత్తంమీద ఈ విషయంలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తీసుకుంటున్నంత కఠిన చర్యల్ని ఇండియా తీసుకోవడం లేదు. భారత సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 1944లో మొత్తం 11 లక్షల 28 వేల మంది డ్రగ్స్ బానిసలు నమోదు చేయించుకుని ఉన్నారు. వారిలో 44 శాతం మంది చిన్నవయస్సువారు. మొత్తం బానిసల్లో 4.54 శాతం మంది 12-15 సంవత్సరాల లోపు వారు.13.86 శాతం మంది 18-23 సంవత్సరాల లోపు, 30 శాతం 24-30 సంవత్సరాల లోపు, 35 శాతం మంది 31- 45 సంవత్సరాల లోపు వయస్సువారు. 13.1 శాతం మంది 46-60 సంవత్సరాలలోపు వారు కాగా 3.5 శాతం మంది 60 సం పైబడినవారు. అయితే, అదే సంవత్సరం అంతర్జాతీయ నార్కోటిక్స్ బోర్డు లెక్కల ప్రకారం ఇండియాలో 25 లక్షల మంది డ్రగ్స్ బానిసలున్నారు.డ్రగ్స్ బానిసల వృత్తుల్ని పరిశీలిస్తే, వారిలో 17.93 శాతం మంది చిన్నవ్యాపారులు, 17.25 శాతం మంది వ్యవసాయదారులు. 13.5 శాతం మంది రోజు కూలీలు. 11.52 శాతం మంది ప్రభుత్వోద్యోగులు.10.57 శాతం మంది వ్యవసాయ కార్మికులు. 3.3 శాతం మంది రిక్షా- ఆటో నడిపేవారు. 1.47 మంది వృత్తి నిపుణులు. వీరిలో 47 శాతం మంది నిరక్షరాస్యులు కాగా, 3.95 శాతం పి.జి.వరకూ చదివినవారు. డ్రగ్స్, మద్యపానం దురలవాట్లను నివారించడానికి 1999 లో 368 ప్రభుత్వేతర సంస్థలకు ఆర్థిక సహాయం అందజేశారు. దాంతో వారు 160 డ్రగ్స్ అవేర్‌నెస్ కేంద్రాలను, మరో 60కి పైగా చికిత్స, పునరావాస కేంద్రాలను ప్రారంభించారు. నార్కోటిక్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్‌స్టెన్స్ చట్టం కింద డ్రగ్స్ నేరాలకు కఠిన శిక్షలు విధించే వీలు కల్పించారు.డ్రగ్స్ నేరాలకు 10 సంవత్సరాల కఠినకారాగార శిక్ష, కనీసం రూ.లక్ష జరిమానా విధిస్తారు.తిరిగి అదే నేరం చేస్తూ పట్టుపడితే 15సం. జైలు శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తారు. ఇటువంటి కేసుల్లో 30 సం. జైలు శిక్ష, రూ.3 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. తిరిగి అదే నేరంచేస్తే మరణశిక్ష విధించవచ్చు. వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే డ్రగ్స్ స్పల్ప స్థాయిలో కలిగిఉన్నట్టు రుజువైతే స్వల్పశిక్షతో బయట పడవచ్చు.
- ఏడాకులపల్లి వెంకటేష్
More From Edit Page
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment