శ్రమ సంబందాలు నశించి ఆర్థిక మానవసంబందాలు పెద్దపీట వేయడం మీద కవి ఆవేదన వ్యక్తం అవుతుంది.రుతువులకు,రైతులకు ఉన్న సంబందం విడదీయరానిది.
"ఇకపై కృషివలుని చుట్టూకందకాల్లా కొత్తవలయాలుకాడికి కంప్యూటర్ మేడికి "కీ" బోర్డు వెబ్ సైట్ లో విత్తడం ఇంటర్నెట్ లో అమ్మకం అంతా గ్లోబలైజేషన్ సాగుభూముల్లో తొండల గుడ్లు"
'దగాపడ్డ చెమటచుక్క దిగాలుగ చూస్తుందీ అంటూ మొదలయ్యే 'దుక్కిచూపూకావ్యం పాఠకుడిని తనవెంట లాక్కుపోతుంది.'నిజంగా పేదరికం ఓ నిశ్శబ్దపు గాయం'అన్న పూర్తి అవగాహన కలిగిన రచయిత వెంకటేశ్వరరెడ్డి.
"ఈ రోజు మాట్లాడు కోవడానికిపేదరికమంతావిలువైన వస్తువు మరొకటిలేదు" అని దెప్పి పొడిచాడు.కవి వస్తువును ఎన్నుకోవడంతో పాటు వస్తువుకు తగిన రూపాన్ని,అభివ్యక్తిని తగిన విదంగా వాడుకొన్నాడు.రైతు భాధలను కవిత్వీకరించడంలో అనేక భావ చిత్రాలను ఎన్నుకొని వర్తమాన వ్యవసాయం ఎలా తయారయిందో చిత్రీకరించాడు.
"క్షణం క్షణం శిలువనెక్కే సేద్యం కారంతా కరువు ఏకరువు పెట్టుకోను దిక్కులేదు"
దేశానికే రైతు వెన్నుముక అని గొప్పలు చెప్పుకొనే రాజకీయ వ్యవస్థలో వ్యవసాయరంగం నగ్నస్వరూపాన్ని వెల్లడిస్తున్నాడు.
"అసలు పంట పొలాలకుపాడె గట్టిన ప్రతిభ ఎవరిది?
కరువు రైతులు రైతు కూలీలు అప్పుల ఊబిలో కూరుకపోయి ఆత్మహత్యలు చేసుకొనే పరిణామం దాపురించింది.
"అప్పును ఆత్మహత్యను బొమ్మగా గీస్తే పత్తి రైతు గోచరిస్తాడు ఇపుడు రైతును మోసగించనిది మరణమొక్కటే"
భారతీయ రైతుకు ప్రపంచీకరణ పరమ శత్రువు.కవి ఈ సత్యాన్ని గ్రహించాడు."సైబర్ సైతాంతో రక్కించాక సంస్కరణలన్ని శాడిజం సింబల్ కాబోతున్నాయ్నేలంతా గాయాలు అల్లుకున్నప్పుడు ఆయుధం ఓ తిరుగుబాటై చిగుర్చుతుంది"
అని ఈ రైతు కావ్యంలో కవి ఇస్తున్న సందేశం."దుక్కిచూపు" ఆకలి కావ్యం.రైతు ఆగ్రహ కావ్యం.రైతు గాయాన్ని పాడుతున్న కర్షక కవి "కొండ్రెడ్డి"మరిన్ని కావ్యాలు రాయాలని కోరుకుంటున్నాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment