ఒక తాత్వికుడు
రెండు కన్నీటి చుక్కలుకళ్ళలోకి దిగులు ఒంపుకొన్న చూపులుబక్క చిక్కిన శరీరంభారమైన హృదయంకఠినమైన జీవితపు నడక వెరసి వీదిలో బ్రతికే కళేబరం చేతిలో సత్తు గిన్నెతో చిల్లర నాణేల నాట్యం దర్మాత్ముల హృదయాల లోకి నిశ్శబ్ద ప్రసారం చేసే అసహాయపు ఆకలికేకలు ఎవరిని నోరుతెరిచి అడగని సంస్కారం పేవ్ మెంట్ నె నమ్ముకొన్న జీవితపు ఏకాకితనం అతడేం బిక్షకుడు కాదు అనుభవాల సారంలో పండిన ఆత్మఅందకారాన్ని వెక్కిరించే నిలువెత్తు పుస్తకంఅటువైపు నేనెప్పుడు వెళ్ళినా ఒక మంచి తాత్వికుడిని చూస్తాను నా నాగరికతను సహాలు చేసే ఒక అతీంద్రియ శక్తి అతని కనుల్లో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది అతడు జీవితపు తత్వాన్ని నిశ్శబ్ద సంగీతంలా ప్రసారం చేస్తునే ఉంటాడు.
2 comments:
Moving...touching!
బాగుంది. కాకుంటే stream of consciousness లాగా విరామాలు లేకపోయేసరికీ చదవడం కాస్త ఇబ్బందిగా ఉంది. కాస్త సరిదిద్దితే ఇంకా బాగుంటుంది.
www.parnashaala.blogspot.com
Post a Comment