- మార్కులు మా కక్కరలేదు.చిలుక పలుకులు,బట్టీలు పట్టడంమాకు చాతకాదు!సృజనాత్మకత మా పుట్టుకలోనే ఉంది.నా తండ్రి వ్యవసాయ పనిముట్లుతయారు చేయడంలో ఉంది.నా తల్లి పంట నూర్పిడిలో ఉంది.మీకు చేతనైతే ఒక అక్షరాన్నిఅందంగా చెక్కండి.వ్యాక్యాన్ని నల్లని దళితసౌందర్యవతిలా మార్చండి !కాలం మారిన కొద్దికులం రూపు మారిపోతుందనుకున్నానుకాని...ఉన్నత విశ్వ విద్యాలయాల్లోకాల నాగై కాటేస్తుందనుకోలేదు!మా ప్రతిభను కొలవడానికిమీకున్న ప్రస్తుత కొలమానాలు సరిపోవు.అనంతమైన నా తెలివినిమీ మోకాళ్ళతో కొలువలేరు!(విశ్వవిద్యాలయాల్లో కులవ్యవస్థ వికృత స్వరూపం చూసి...)
Thursday, February 12, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment