కన్నీటి జడివానలో
తడిచిన యవ్వనం
పేపరు పడవవలే
నీటిలో కొట్టుకుపోతున్నది!
అర్దరాత్రి లేచాను
పక్కలో అన్ని శవాల గుంపులు
రక్తపు సంద్రాలు
చిత్రం!వాటి రంగు నలుపులో ఉంది!
అధరాలు అమృతపాశాలై
నునులేత స్పర్శగా శరీరాన్ని
స్పృశించి కృశింపజేస్తున్నాయి!
బాల్యం ఒక మాయల మారాఠి
జీవితంలోని ఆనందం అంతా
అనుభవిస్తారని తొందరగా వెళ్ళిపోతుంది!
ఆకలి చూపులు
కడుపు నిండిన ఈర్షపుచూపులు
పరస్పరం పోరాడుతున్నాయి
చివరకు విజయం మాత్రం కన్నీటిదే !
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
బాగున్నాయండి.
Post a Comment