Wednesday, November 21, 2007

'రిజర్వేషన్ కవిత్వం"

'రిజర్వేషన్ కవిత్వం"





అవును మేము రిజర్వేషన్
గాళ్ళమే!
మా ప్రతిభను కొలవడానికి
మీరు పారేసే భిక్షపు
మార్కులు మా కక్కరలేదు
చిలుక పలుకులు,బట్టీలు పట్టడం
మాకు చాతకాదు!
సృజనాత్మకత మా పుట్టుకలోనే ఉంది
నా తండ్రి వ్యవసాయ పనిముట్లు
తయారు చేయడంలో ఉంది.
నా తల్లి పంట నూర్పిడిలో ఉంది
మీకు చేతనైతే ఒక అక్షరాన్ని
అందంగా చెక్కండి
వ్యాక్యాన్ని నల్లని దళిత
సౌందర్యవతిలా మార్చండి !
కాలం మారిన కొద్ది
కులం రూపు మారిపోతుందనుకున్నాను
కాని ...
ఉన్నత విశ్వ విద్యాలయాల్లో
కాల నాగై కాటేస్తుందనుకోలేదు!
మా ప్రతిభను కొలవడానికి
మీకున్న ప్రస్తుత కొలమానాలు సరిపోవు
అనంతమైన నా తెలివిని
మీ మోకాళ్ళతో కొలువలేరు!


(విశ్వవిద్యాలయల్లో కులవ్యవస్థ వికృత స్వరూపం చూసి...)

3 comments:

బళ్ల సుధీర్ said...

enough stop it thoug i was born in a poor family and iam also o.c me too facestrugglles to survive and worked hard and became a c.a . dont escape from the reality by showing caste plea

rākeśvara said...

So dude, what's your point?
మార్కులు ఎవరినీ కొలవలేవయ్యా. దానికి కులంతో సంబంధంలేదు.

Raj said...

సమాజంలో కులవిభజనలు గర్హణీయమే. రిజర్వేషన్ విధానాల వల్ల అర్హులకు న్యాయంగా అందవలసిన ఫలాలు అందలేదన్నది కూడా కఠిన వాస్తవం.