Saturday, September 1, 2007

మావూరి మట్టి వాసన...

మావూరి మట్టి వాసన
కమ్మదనం
రమ్మని చేతులు చాచింది!


రచ్చబండను అడుగు
ప్రపంచ జ్ఞానాన్ని
నీ అరచేతిలో పెడుతుంది!


బోసినవ్వు
ముడుతలు పడ్డ మొహం
గోచిగుడ్డ
మా పల్లె రాజు అలంకారాలు!


చింతతోపులోని
చెట్లు,పక్షులు
అలిగి అలకపానుపు
ఎక్కాయి!


సందేళ పశువులు
దీనంగా కాళ్ళీడిస్తున్నాయి
రేపటికి గ్రాసం
దొరుకుతుందో
లేదోనని!

No comments: