Tuesday, November 2, 2010
ణాత్మక భావవాది : అన్నమయ్య -వెంకటేశ్వరస్వామిని అమ్ముకుని బతికేపూజారులను అధికారులను మనం ఇవాళ చూస్తున్నాం. అయితే వెంకటేశ్వరస్వామినినమ్ముకుని మాత్రమే బతికిన కవి తాళ్ళపాక అన్నమాచార్యుడు.అన్నమయ్య భక్తకవి.అయితే ఆయన ఏనాడూ సమాజాన్ని విస్మరించి మాట్లాడలేదు. ఆయనది భావవాదమే .సృష్టి కర్త మీద విశ్వాసం ఉన్న కవే.“కుమ్మరి వాడులేకే కుండ లేబుట్టేనానెమ్మినీవు పుట్టించక నేనే బుట్టితినా”“అతని మూలమే జగమంతానిది”అని గట్టిగా నమ్మినకవి అన్నమయ్య. అన్నిటికే విష్ణువునే కర్తగా నమ్మినఅన్నమయ్య సంఘంలోని ఆనారోగ్యకర ధోరణులను ఎత్తి చూపడానికే నిరంతరం కృషిచేసాడు. సామాజిక రుగ్మతలన్నిటినే హరి భక్తే సరైన మందని భావించి, దానినేప్రచారం చేశాడు. అది మందు అవునా కాదా అన్నాదానిమీద భావ, బౌతిక వాదుల మధ్యఅభిప్రాయ భేదాలున్నాయి. అయితే ఆరువందల ఏళ్ళ క్రితమే ప్రజల భాషలో , ప్రజలవాణిలో సామాజిక రుగ్మతలను ఎత్తి చూపిన కవిగా అన్నమయ్యను గుర్తించాలి.రోగనిదానం సరిగ్గానే చేసిన అన్నమయ్య వైద్యం దగ్గరికి వచ్చేసరికిభావవాదంలో పడిపోయాడు. అది వేరే విషయం.హిందూమతం, మనువాదం - వీటి భౌతిక స్వరూపమైన వర్ణ - కుల వ్యవస్థ. దీనికిఆధిపత్యం వహించే భూస్వామ్య వర్గం - దీని స్వార్థం - ఇవి సమాజానికితెస్తున్న కీడూ - వీటిని అన్నమయ్య జాగ్రత్తగా గుర్తించాడు. ఆస్థాన కవులుకీర్తించే రాచరికాన్ని అన్నమయ్య ధిక్కరించాడు. అస్థాన కవులు కీర్తించేకుల వ్యవస్థను అన్నమయ్య తిరస్కరించలేదుగాని, కుల వివక్షనువ్యతిరేకించాడు. మనువాదం భారతీయ సమాజాన్ని కులసమాజంగా స్థిరీకరించి అధిభ్రష్టుపట్టిపోయిన దశలో, విదేశీ పాలకులు భారత దేశంలో స్థిరపడి వాళ్ళమతాలకు అనుగుణంగా ప్రజల్ని మల్చుకొనే క్రమంలో హిందూ మతం బలహీనపడుతున్ననేపథ్యంలో, జనం కుల ప్రాతి పదికన, దైవారాధన ప్రాతిపదికన చీలిపొయి జాతినిర్వీర్యమౌతున్న సమయంలో అనేక దైవారాధనాలతో జనం చీలిపోతున్న సందర్భంలోఅన్నమయ్య చలించిపొయి కలం పట్టాడు.ఏ దేవుని పేరు చెప్పి మనువు వర్ణ వ్యవస్థను శాశ్వతం చేశాడో, ఆ దేవునిమీది భక్తితోనే అన్నమయ్య వర్ణవివక్షను వ్యతిరేకించాడు. దేవుడుమంత్రానికి, బ్రాహ్మణులకు ఆధీనులనే వాదాన్ని తిరస్కరించి దేవుడూభక్తాధీనుడని చాటాడు అన్నమయ్య. ఒక రకంగా అన్నమయ్య దేవుని అల్పసంఖ్యాకులచెరనుంచి తప్పించి సార్వజనికం చేశాడు. దేవుని మానవీకరించాడు. భారత దేశవ్యాప్తంగా మధ్య యుగాలలో భక్తి ఉద్యమం ఉప్పెన గా వచ్చింది. ఆంధ్ర దేశంలోఅన్నమయ్య ఆ ఉద్యమ ప్రతినిధి. భక్తకవులు భక్తులుగా ఉంటూనే సమాజంలోసంస్కరణలను ప్రతిపాదించారు. నిలవనీటి మడుగుగా ఉన్న సమాజానికి ప్రవాహ గుణంతీసుకొచ్చాడు. అన్నమయ్య వెంకటేశ్వరుని మీద భక్తిని అన్ని రోగాలకు మందుగాప్రచారం చేశాడు. భగవంతుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్న అన్నమయ్యకు అవసరంలేదు. అన్నమయ్యకు దేవుడున్నాడు .ఆయన సృష్టిలో ఆర్థిక అసమానతలు, సాంఘీకవివక్షలు, స్వార్థం వంటి రుగ్మతలకు చోటు లేదని ఆయన భావించాడు . అందుకోసంతన పదాలలో సంస్కరణ భావాలను ప్రచారం చేశాడు.దేశంలో అనేక దేవతారాధనలు కొనసాగుతున్న సమయంలో బయటి నుంచి ఏకేశ్వరోపాసనచేసే మతం ప్రవేశించింది.అందువల్ల హిందువులలో ఏకేశ్వరోపాసనను ప్రచారంచెయ్యవలసిన చారిత్రక అవసరం ఏర్పడింది. అన్నమయ్య ఆ అవసరాన్ని గుర్తించి“బ్రహ్మమొక్కటే” అని నినదించాడు. కుల వ్యవస్థ విస్తృత రూపాన్నిసంతరించుకొని, నిరంకుశమై ప్రజల మధ్య సహజంగా ఉండవలసిన సంబంధాలువిచ్ఛిన్నమై ఆర్థిక వైరుధ్యాలు ఏర్పడిన సమయంలో అన్నమయ్య బాధ్యతాయుతమైనపాత్ర నిర్వహించాడు.” జంతు కులమంతా నొకటే ” అని సిద్ధాంతం చేశాడు అన్నమయ్య. “సానుజాతమయ్యేసకల కులము ” అని వేమన అనడానికి 250 ఏళ్ళకు ముందే అన్నమయ్య అన్నాడు. రాజునిద్ర, బంటు నిద్ర ఒకటేనని , బ్రాహ్మణుడు, చండాలుడు తిరిగే నేల ఒకటేనని,దేవతలకు , పశువులకు కామ సుఖమొకటేనని, ధన వంతునికి, పేదవానికిరాత్రింబవళ్ళు ఒక్కటేనని, శిష్టాన్నానికి దుష్టాన్నానికి ఆకలి ఒకటేననిదుర్వాసనను, సువాసనను మోసే గాలి ఒకటేనని, ఏనుగు మీద, కుక్క మీద పడే ఎండఒకటేనని - ఇలా ప్రకృతి లో లేని వివక్ష సంఘంలో ఉండకూడదని ప్రబోధించాడుఅన్నమయ్య.కర్మ పేరు చెప్పి , దైవం పేరు చెప్పి విస్తృత మానవాళి జీవితాన్ని తమగుప్పెట్లోకి తెచ్చుకోవాలనుకొనే పురోహితచర్యకు ప్రతి చర్య అన్నమయ్యకవిత్వం.” బ్రహ్మమనగ వేరే పరదేశమున లేడుతన్ను తానెరిగిన దానెబో బ్రహ్మంబు ” అని వేమన చెప్పకముందే అన్నమయ్య“మనసున నమ్మనేర్చితే మనుజుడే దేవుడంచుతనలోనె వున్న వాడు తావు లేని దైవము”అని చాటాడు. ఆత్మ సకల వ్యాపకమని అనుకుంటే జాతి, కుల అభిమానాలను గురించిచర్చించవలసిన అవసరమే లేదని చాటాడు.“కులముకన్న మిగులగుణము ప్రధానంబు” అని వేమన చాటకముందే , అన్నమయ్య“కొంచెమును ఘనముంగనుకొననేల ? హరిందలంచుపంచ మహాపాతకుండె బ్రహ్మణోత్తముండు”అని ప్రకటించాడు. కులానికి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అన్నది క్రీ.శ.15 శతాబ్దం నాటికి విప్లవాత్మకమైన ఆలోచన. నన్నయ్య తన భారతంలోఉదంకోపాఖ్యానంతో ” నిండుమానంబు” పద్యంతో కులాన్ని బట్టి గుణ ముంటుందనిచెప్పాడు. దీనిని అన్నమయ్య తిరస్కరించాడు. కుల వ్యవస్థ సృష్టించినసంఘర్షణను తగ్గించడానికి అన్నమయ్య వెంకటేశ్వర భక్తిని సాధనంగాచేసుకున్నాడు. అగ్ర వర్ణాల వాళ్ళను ఆధిపత్య భావననుంచి, కిందికి దించి .కింది కులాల వాళ్ళను ఆత్మన్యూనతనుంచి పైకిలాగి, ఇద్దరినీ ఒకేకేంద్రబిందువు దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు అన్నమయ్య.మల్లికార్జున రాయలును, అతని పినతండ్రి కొడుకును విరూపాక్షరాయలు, ఇతనినిఇతని పెద్ద కొడుకు, ఈ పెద్ద కొడుకును తమ్ముడు ప్రౌఢ రాయలు, ఇతనిని సాళువనరస నాయకుడూ చంపి రాజ్యధికారాలను హస్తగతం చేసుకున్నాడు. ఈ రక్త చరిత్రనుఅన్నమయ్య చూశాడు. అధికారం కోసం , అందలం కోసం హత్యలకూ వెనుకాడని రాజులదుర్మార్గాలను సహించలేదు అన్నమయ్య.“వెఱుతు వెఱుతు నిండు వేడుక పడనిట్టికుఱుచ బుద్ధులనెట్లు గూడుదురయ్యదేహమిస్తున్నవాని దివిడి చంపెడువాడుద్రోణి గాక నేడు దొరయటతోడబుట్టిన వాని తొడరి చంపెడువాడుచూడ దుష్టుడు గాక సుసృతియుట……కొడుకు నున్నతమతిగోరి చంపేడు వాడుకడుపాతకుడుగాక ఘనుడటతల్లి జంపెడువాడు తలప దుష్టుడుగాకయెల్లవారల కెల్ల నెక్కుడట….అని అధిక్షేపించాడు అన్నమయ్య. సాళువనరసింహుని ఆఙ్ఞను ధిక్కరించిన ఘనత అన్నమయ్యది.స్వార్థం , కపటం , అత్యాశవంటి దుష్టలక్షణాలు మన సమాజంలో అన్నమయ్యకాలానికే ముదిరిపోయాయి. ఆ సంఘాన్ని అన్నమయ్య సంస్కరింప బూనుకొని కొన్నివందల సూక్తులను రూపొందించాడు. అప్పటి సమాజంలో కులం, ధనం సృష్టిస్తున్నవైరుధ్యాలను అన్నమయ్య గమనించాడు. ఆ రెండు ఆధిక్యతలు మంచివి కావని చాటాడు.” కులమెంత గలిగిన కూడించు గర్వంబుధనమెంత గలిగెనది దట్టమౌలోభంబుఘన విద్య గలిగినను కప్పు పైపై మదముసిరులెన్ని గలిగినను చింతలే పెరుగు”వేదాంత ప్రవాననాల బరువుతో మన చానెళ్ళు మనల్ని గూనివాళ్ళుగా తయారుచేస్తున్నాయి. ఆచరణ సాధ్యంగాని వేదాంతం చెప్పడంలో భారతీయ వేదాంతాలుప్రపంచంలోనే అగ్రగ్రాములు. ఆచరణలోకి వచ్చేసరికి వాళ్ళు చాలా నేలబారుమనుషులుగా మిగిలిపొతారని ఇటీవల అనేక సంఘటనలు రుజువు చేశాయి ఇలాంటివాళ్ళను“చెవ్ప్పుడుమాటలే చెప్పుగొనుటగాకచెప్పినట్లు దాము సేయరెవ్వరును “అని అన్నమయ్య ఆనాడే దెప్పిపొడిచాడు. నాటి సమాజానికి ఇదొక జాటి దెబ్బ, ఒకములుగర్రపోటు. ఇతరులకోడును నిరంతరం కోరేవాళ్ళు, ఇతరుల కష్టాలు కలిగించేవాళ్ళు , ఇతరులకు కష్టాలు కలిగితే సంతోషించే వాళ్ళు మనకు కనిపిస్తారు.వాళ్ళలో ఈర్ష, అసూయ, ద్వేషం వంటి దౌర్జన్యాలు పుష్కలంగా ఉంటాయి.అన్నమయ్యఈ రకం జనానికి కూడా రాత పెట్టాడు. వాళ్ళ జన్మే వృధా అనే దాకా వెళ్ళాడుఅన్నమయ్య.పరుల మనసునకు నాపదగలుగజేయబరితాపకరమైన బ్రదుకేలా!సొదిదినితరుల మేలు చూసి సైపగలేకతిరుగుచుండేటి కష్టదేహమిద్యేలా?ఆర్థిక వైరుధ్యాలను అన్నమయ్య ఏ మాత్రం సహించనట్లు కనిపించడు. భూస్వామ్యవ్యవస్థకు ఆర్థిక సాంఘిక అసమానతలు రెండుకళ్ళు. వీటిని అన్నమయ్యనిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. కొంత మంది జీవితం కష్టాలమయం , మరికొందరికి సుఖాలజాలం కావడాన్ని ఆయన గమనించాడు.” పాటెల్ల నొక్కచోనుండు, భాగ్యమెక్కచోనుండుయీటువెట్టి పెద్ద తనం వెంచబనిలేదు”“అతి సంపదలు దేహన ఙ్ఞానిసేయుఅన్న ,మదమున చిత్తమగపడదు”అన్ని అన్నమయ్య ఆర్థిక కేంద్రీకరణ దుష్పలితాల పట్ల అనాడే హెచ్చరించాడు.భారతీయే వేదాంతం భారత జాతిలో సోమరితనాన్ని పెంచిన మాట వాస్తవం.కర్మ,జన్మ,పునర్జన్మల సిద్ధాంతం మనిషిని కర్తవ్య విముఖున్ని చేసింది.ప్రజల శ్రమ మీద ఆధారపడి బతికిపోయే సోమరిపోతుల్ని కూడా స్పష్టించింది.కొందరు కష్టపడి సృష్టిస్తుంటే కొందరు కూర్చొని తినే వాళ్ళుగ తయారయ్యారు.అలాంటి వాళ్ళనూ చూశాడేమో అన్నమయ్య.“మహినుద్యోగి గావలె మనుజుడైన వాడు” అని భోధించాడు. అదే సమయంలో అన్నమయ్యసుఖాల కోసం పరుగు పెట్టే భోగలాలసులకు వైరాగ్యాన్ని కూడా బోధించాడు.సంపాదన కోసం దేశాన్ని తాకట్టు పెట్టాడానికి, అమ్మేయడానికి, దేశరహస్యాలుబయట దేశాలకు అందించడానికి వెనకాడని దశకు మనం చేరుకున్నాం. పెళ్ళిళ్ళలోవిందులలో దుర్భరమైన భోజనాలు, అవసరానికి మించిన అంతస్తుల భవనాలు, వేదాంతంబోధించే బాబాలకు ఎకరాల కొలదే భనవాలు , సిగ్గూ , మర్యాదలు పోయినా ఫరవాలేదుధన వంతులైపోతే చాలు- ఇలా ఉంది నేటి మనుషుల తీరు. ఈ బాపతు జనాలకు అన్నమయ్యఏమైనా బోధించాడా అని వెతికితే ఈ పదం దొరికింది.అప్పులేని సంసారమైనపాటేచాలుతప్పులేని జీతమొక్కతారమైన జాలు”కంతలేని గుడిశెక్క గంపంతయినజాలుచింతలేని యంబలొక్క చారడేచాలుజంతగాని తరుణి యే జాతైన నది చాలువింతలేని సంపదొక్క వీసమేచాలు”తిట్టులేని బ్రతుకొక్కదినమైన నదెచాలుముట్టులేని కూడొక్క ముద్దడే చాలుగుట్టుచెడి మనికంటే కొంచెపుమేలైనచాలువట్టిజాలి బడుకంటే వచ్చినంతేమేలు…..భౌతికవనరుల మీద పెత్తనానికి దేశాలు, రాజ్యాలు , కులాలు , వర్గాలు పోటీపడుతున్న స్వార్థపరులు ఈ పదాన్ని చదువుతారా? వెంకటేశ్వరస్వామి చుట్టూమూగి నానాయాగీ చేస్తున్న వాళ్ళు ఆయన పేరు మీద అన్నమయ్య రాసిన ఈ పదాన్నిచదువు తున్నారా? మనిషి కోసం సంపదగాని, సంపదకోసం మనిషి కాదన్నవాస్తవాన్నిప్రపంచీకరణ జ్వరంలో పడికొట్టుకుపోతున్న వాళ్ళు గమనిస్తారా? నాబోటినాస్తికులకు అన్నమయ్య పదంలోని పధ్నాలుగు పంక్తులలో చివరి రెండు పంక్తులతోపేచీ ఉండవచ్చు . తక్కిన పంక్తులతో ఆయన లొకరీతినే చాటాడు.అన్నమయ్య తాత్వికంగా భావవాదికవిగా సంస్కరణవాది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment