Monday, October 4, 2010

vyasam

( మన కాలపు మహాకవి మహమూద్ దర్వీష్ ఇక లేరు.ఆయన ఈ నెల (9 ఆగష్టు 2008) తొమ్మిదో అమెరికాలోని హూస్టన్ లో కన్నుమూశారు.ఆయన స్మృతికి నివాళి ఇది)
కవిత్వపాదాలు ఆకాశానికి రాసుకున్న ప్రేమలేఖల్లాంటివని ఎప్పుడో రాసుకున్నాడు ఖలీల్ జిబ్రాన్ .కానే కాదు…… కవిత్వ పాదాలు పుట్టిన నేలకి రాసుకున్న ప్రేమలేఖలని జీవితంలోని చివరి క్షణం దాకా చెప్పుకుంటూ . కవిత్వం నిండా సొంత వూరి ఙ్ఞాపకాల పరిమళాల్మి నింపిన వాడు మహమూద్ దర్వీష్.
కవిత్వపాదాలు మట్టిలోంచి మొలుచు కురావాలని . తిరిగి మట్టిలోకే చేరుకోవాలని గట్టిగా నమ్మిన పాలస్తీనా మహాకవి దర్వీష్ . ఇజ్రే ల్ లో ఓ మధ్య తరగతి ముస్లిం రైతు కుటుంబంలో పుట్టిన దర్వీష్ కుటుంబానికి చిన్న పాటి పొలాలే సర్వసంపద. దర్వీష్ కి ఆరేళ్ళ వయసులో ఇజ్రేల్ ప్రభుత్వం ఆధి పత్యం కోసం అతని వూరంతా ధ్వంసం చేసింది. వూరు వూరంతా వల్లకాడయ్యింది. దిక్కు లేని పక్షుల్లా ప్రాణాలు అరచేతి పట్టుకుని దొంగదారిన లెబనాన్ చేరింది దర్వీష్ కుటుంబం.అక్కడి నుంచి మొదలైంది దర్వీష్ వలస బతుకు. అతనే ఒక కవితలో రాసుకున్నాడిలా-
ఎప్పటికీ నేను అక్కడి వాణ్నేఅక్కడే నా ఙ్ఞాపకాలన్నీ వున్నాయి.అందరిలానే పుట్టాను నేను ఆ వూళ్ళో.నాకూ ఓ తల్లి వుందిబోలేడు కిటికీలున్న ఇల్లుందితోబుట్టువులూ స్నేహితులూ వున్నారునాకూ ఓ జైలు గది వుందిఅతి చల్లని కిటికీలు బార్లా తెరుచుకున్న గది
ఒకే ఒక మాట మిగిలిపోయింది - సొంతూరు.ఆ ఒకే ఒక్క పలుకు కోసంఅన్ని నియమాల్ని తుంగలో తొక్కానుఅన్ని మాటల్నీ ధ్వంసం చేశానుఒకే ఒక్క మాట కోసం-సొంతూరు.
పుట్టినూరు పరాయిదైపోయింది . సైనిక పదఘట్టనల కింద నలిగిపోతున్న నేలతల్లి నెత్తుటి కనుకొలకుల్లోంచి రాలుతున్న కన్నీటి చుక్కలు అతన్ని ఎక్కడా ప్రశాంతంగా బతకనివ్వలేదు. నిరంతర అవిశ్రాంత యోధిడిలా అతను చారెడు నీడ కోసం దేశదేశాలూ సంచరించాడు దిక్కులేని పక్షిలా. అతని కవిత్వపాదాల సింహనాదాలకు భయపడి , రాజ్యం అతన్ని వెలివేసింది. గతవారం అమెరికాలోని హుస్టాన్ లో అతను కన్నుమూసేదాకా రాజ్యం కంటి మీద కునుకులేదు. మహమూద్ దర్వాష్ ఇక లేడన్న మరణవార్త విన్న నేలతల్లి పాలస్తీనా గుండె తల్లడిల్లింది. చివరి క్షణం దాకా ఎత్తిన కలం దింపకుండా కలానికి ఒక దేశపు జెండా కుండాల్సినంత పొగరునీ , శక్తినీ అందించిన కవి దర్వీష్. అందుకే అతని ప్రతి పలవరింతా . ప్రతి కలవరింతా జన్మభూమి ఆత్మఘోషగా మారిపోయింది. కాని , కవిత్వంలో అంతర్ముఖత్వానికీ , బహిర్ముఖత్వానికీ నికార్సయిన ఎల్లలు గీసుకున్న కవి దర్వీష్. అతని కవిత్వం చండ్ర నిప్పులు చెరిగిన క్షణాలు వున్నాయి. మంచు తునకల్ని ముఖమ్మీద చిలకరించిన క్షణాలు వున్నాయి. నిరసన నిరసనే . అట్లాగని, నా అనుభూతిని ఎందుకు దాచుకోవాలి? ‘ అంటూ కవిత్వపాదాల్ని తూనీగల నడకల మృదుత్వంతో పోటీపడేట్టు తీర్చిదిద్దిన అందమైన శిల్పి దర్వీష్. ఎప్పటికైనా ఎవరినైనా నా కవిత్వ పాదం దాని కవిత్వ శక్తి వల్లనే బతుకుతుంది. అందులోని వస్తువు కొంతకాలానికి నీరసించినా సరే..’ అని పదేపదే చెప్పుకున్నాడు దర్వీష్. కదనరంగానికీ, కవిత్వానికీ మధ్య సూది మొన అంతటి ఆ సున్నితమైన తేడాని గుర్తించి. ఆ గుర్తింపు ప్రతి కవితలోనూ కనబరిచి, కవిత్వ శక్తి ముందు ఏ శక్తి అయినా బలాదూరేనని రుజువు చేసినవాడు దర్వీష్.
సూట్ కేసే నా స్వదేశం
దర్వీష్ కవిత్వంలో అత్యంత బలంగా కనిపించేది మాతృభూమి భావనే. ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ప్రవాసశిక్ష పడింది దర్వీష్ కి.’ ఆ తరువాత సూట్ కేసు మాత్రమే నా సొంతదేశం అయింది . సంచారమే నాకు మిగిలింది ‘ అంటాడు దర్వీష్. అతని కమ్యూనిస్టు రాజకీయాలు, అతని కవిత్వపాదాల అగ్రహమూ అతన్ని ఎక్కడా క్షణం సేపు ప్రశాంతంగా వూపిరాడనివ్వలేదు. చివరికి తండ్రి చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలకి హాజరుకావడానికి అనుమతి దొరకలేదు. కాని, చాలా కాలం తరవాత ఒక డాక్యుమెంటరీ కోసం నాలుగు రోజుల పాటు పుట్టి వూరికి వెళ్ళడానికి ఇజ్రేలీ ప్రభుత్వం అతనికి అనుమతించింది. ఆ నాలుగురోజులూ దర్వీష్ జీవితంలో మరచిపోలేని స్మృతులు. అప్పుడే సమాధిలో చిరనిద్రలో వున్న తండ్రిని చివరిసారి చూసుకున్నాడు దర్వీష్.ఆ నాలుగు రోజులూ నేను పసిపిల్లాణ్నయిపోయాను. నేను చిన్నప్పుడు ఆడుకున్న చెట్టూ చేమలన్నీ నాకు గుర్తే. వాటిని మనసారా చేతులతో తడిమాను. వాటిని కావిలించుకుకునిఏడ్చాను. నేను కూర్చున్న ప్రతి రాయి మీదా మళ్ళీ కాసేపు కూర్చున్నాను. నా చిన్నతనాన్ని తలుచుకున్నాను. మళ్ళీ ఆ రోజులు వస్తాయా అని కాసేపు కాలంలోకి ఆశగా చూశాను. అంత పరవశం నాకు ఎప్పుడూ కలగలేదు. ఆ నాలుగు రోజులూ మళ్ళీ రావు కదా ?’ అని రాసుకున్నాడు దర్వీష్. నిజానికి ఆ నాలుగు రోజులు ఎప్పటికీ అతని జీవితంలో తిరిగిరాలేదు.దర్వీష్ గొంతు నిండా ఒక పట్టరాని కోపం నిండుకుపోయి వుంటుంది. ఒకోసారి చాలా ప్రాశాంతంగా సెలయేటి ప్రవాహంలాగా వెళ్ళే పద్యం . మరింకోసారి వున్నట్టుండి కట్టలు తెగిన ఏరులా వూళ్ళన్నిటినీ విపరీతాగ్రహంతో ముంచెత్తుతుంది.
1960 లో రాసిన కవిత ఇది-
రాసుకోనేను అక్షరాల అరబ్బువాణ్నినా గుర్తింపు కార్డు నెంబరు 50,000నాకు ఎనిమిది మంది సంతానం.తొమ్మిదోది ఈ ఎండాకాలంపుట్టబోతోంది.మొదటి పుటలో స్పష్టంగా రాసుకోనేను ప్రజల్ని ద్వేషించను
ఎవరి ఇలాకాలోకి జొరబడనుకానీ , ఆకలేసిందా,నీ కండల్నే కొరుక్కుతింటానుజాగ్రత్త, జాగ్రత్తనా ఆకలి మహా ప్రమాదకరమైందినా ఆగ్రహం మరీ మరీ ప్రమాదకరమైంది.
రెండు దశాబ్దాల పాటు దర్వీష్ కవిత్వం ఇదే ఆగ్రహంతో వూగిపోయింది. అరాఫత్ నాయకత్వంలోని పాలస్తీనా జాతీయోద్యమం అతని ఆశలకి ప్రతిరూపమైంది. అతని కవిత్వ ఆవేశానికి ఒక రూపాన్నిచ్చింది. ఉద్యమంలో అతను కీలకభాగస్వామి అయ్యాడు. 1974 లో అరాఫత్ ఐక్యరాజ్యసమితిలో చేసిన చరిత్రాత్మకమైన ప్రసంగంలోని మొదటి పంక్తి దర్వీష్ దే. ఒక ఆలీవ్ ఆకునీ , ఒక స్వాతంత్ర్య యోధుడి తుపాకినీ భుజాన్నేసుకుని వచ్చాను. ఆ ఆలీవ్ ఆకుని నా చేతుల్లోంచి జారిపోనివ్వకండి ‘ అన్న ఆ వాక్యం ఎన్నో విధాలుగా దర్వీష్ కవిత్వం ఒక రాజీపడని గొంతుక. కవిత్వంలో నానార్థాల పెడర్థాల గందర గోళాన్ని అతను ఎప్పుడు సహించలేదు. ప్రతీకలు దారితప్పడాన్ని అతను ఏనాడూ భరించలేదు . అందుకే - తన కవిత్వంలో అమ్మ అన్న మాట వచ్చినప్పుడల్లా ఆ పదాన్ని పాలస్తీనాకి ప్రతీకగా భావించే ధోరణిని అతను విమర్శించేవాడు. అమ్మ అంటే అమ్మీ. ఆ అమ్మ అచ్చంగా నా తల్లి మాత్రమే . అది దేశమూరాదు.ఇంకో ఆవేశానికి ప్రతీకా కాదు. కేవలం నా వ్యక్తిగతం. నా కవిత్వాన్ని ఒకే విధంగా చదవడం అలవాటయ్యి. అందరూ రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. కాని, నా కవిత్వానికి అనేక వ్యాఖ్యానాలు లేవు. ఒకే ఒక్క అర్థం వుంది ‘ అని చెప్పేవాడూ దర్వీష్ . ఒక్క మాటలో చెప్పాలంటే - దర్వీష్ కవిత్వాన్నే ఒక యుద్ధభూమిగా ప్రేమించాడు. నిరంతర వలసల మధ్య పుట్టిన వూరు ఒక కలగా మారిపోయిన కవిత్వాన్ని రాసుకున్నాడు . కాని , అతని ప్రతి కవితా ప్రపంచం తన కవితగానే పాడుకుంది. అతని వ్యక్తిత్వంలో ప్రపంచం తన ప్రతిబింబాన్నే వెతుక్కుంది. ఎక్కడ ఏ భూపోరాటం జరిగినా, ఆ పోరాటానికి అతని అక్షరాలు ఆయుధాల్ని అందించాయి.
దర్వీష్ మాటల్లోనే చెప్పాలంటే-
నా పదాలు గింజలయితేనేను నేలని.నా పదాలు పట్టరాని ఆగ్రహమయితేనేను పెనుతుపానుని.నా పదాలు రాళ్లయితేనేను నదిని.నా పదాలు తీయతేనియలయితేనా పెదాలు తేనెటీగల గూళ్ళు.

No comments: