తల్లి గోదారి
వెంకటేష్
శుక్రవారం, అక్టోబర్ 1, 2010, 9:57[IST]
తల్లి గోదావరి గల గలా వస్తోంది. రోజు తనకు పిండాలనే తిండి పెట్టేపంతులు పరమపదించాడు.వాడి ఆత్మ శాంతికై కాటన్ దొరతో చెప్పిఒడ్డునున్న ప్రజలందరికీ అన్న దానం చేయించింది.విరగబడి ప్రజలు విందారగించారు.మిగతా నదులన్నిటి స్థితి ఇలాగే! పంతులు పిల్లలు దిక్కు లేక దీనంగా చావలేక బ్రతుకీడుస్తూ మంచి చదువులు చదివి పిండాల చదువు రాక వేరే ఉద్యోగం లేక దీనంగా గోదారి చేరారు.ఓ పిల్లలారా మీ కష్టాలకు ధనసాయం చేస్తే చెతకాని వాళ్ళలామిగులుతారులెండి. మీరంతా ఏకం కండి. విప్లవ మూర్తులై ఉద్యోగ విద్యా సాధనలోరిజర్వేషన్లు చేయించుకోమనితల్లి గోదారి ఉప్పెనతో పిలుపునిచ్చింది.
Tuesday, October 5, 2010
Monday, October 4, 2010
అన్నాబావు సాఠే
భారతీయ గోర్కీ అన్నాబావు సాఠే !
- అట్టడుగునుంచి అత్యున్నత స్థాయికి
- ప్రజాకళకు, సాహిత్యానికి మార్గదర్శి
- తెలంగాణ సాయుధ పోరాటంపై ఒగ్గుకథ
- సామాజిక న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం
Anna_Bhau_Satheగ్రామీణ ప్రాథమిక విద్యాభ్యాసం అరకొరగా సాగించి, ఏ వంశ పారంపర్య సాహిత్య సాంస్కృతిక వాతావరణ మద్దతు లేకుండా, ఖూనీకోరుగా పోలీస్ రికార్డుల్లో బ్రిటిష్ సర్కార్ చిత్రించిన సంచార జాతికి చెందిన ఒక నిమ్న కుల వర్గీయుడు భారత దేశ సాహిత్య అకాడమీ అవార్డు పొంది, సోవియట్ యూనియన్ గుర్తింపు స్థాయికి ఎదిగి, భారతదేశ మ్యాక్సిం గోర్కీగా పేరు సంపాదించడం ఊహించలేని అంశం. మరాఠీ సాహిత్యం ద్వారా ప్రగతిశీల, దళిత, బహుజన వర్గాల కు ఎంతో అభిమాన పాత్రుడు, చిరస్మరణీయుడు, అగ్రశ్రేణి సాహితీకారుడు అన్నాబావు సాఠే. ఆయన జన్మదినం 1920 ఆగస్టు1న. అతి తక్కువ వ్యవధిలో అమూల్యమైన సాహిత్యాన్ని సృష్టించి 50 ఏళ్ళ వయసులోపునే 1969 జులై 18న అస్తమించిన రేపటి వెలుగు చుక్క.
మహారాష్టల్రోని సాంగీ జిల్లా వాఠేగావ్‌లో బావూ- వాలూబాయి దంపతులకు అన్నాబవు జన్మించాడు. అతి శూద్ర కుల వర్గానికి చెందిన మాంగ్ (మాతం గ్) అనే నిమ్నజాతిలో పుట్టినందున వారికి నిర్దిష్ట వృత్తి పని కూడా లేదు. బావూ నానా కష్టపడి విధిలేక ముంబాయికి ఒక్కడే వెళ్ళి గ్రామంలో వదలి వెళ్ళిన తన కు టుంబాన్ని ఏదో ఒక రూపంలో పోషిం చాడు. బావూకు ఐదుగురు సంతానం. వారిలో ఒకరు చిన్ననాడే మరణించా డు. మొదటి సంతానం కుమార్తె. పేరు బాగూబాయి. తర్వాత అన్నాబావు, శం కర్, జారుూబాయి జన్మించారు. బాల్యంలో అన్నాబావును తుకారాం అని పిలిచేవారు. కాని తర్వాత అందరూ ప్రేమతో అన్నా అనే పేరుతో పిలవడం వలన అదే పేరు స్థిరపడింది.
ఫకీరా అనే వ్యక్తి అన్నాబావు మామ- బ్రిటిష్ వారికిపై తిరుగుబాటు చేపట్టాడు. ఆయన ప్రభా వం చిన్న వయసులో అన్నా బావుపై పడింది. అన్నా విద్యాభ్యాసం రెండవ తరగతి వరకు జరిగిందని కొందరు, లేదు ఏడవ తరగతి వరకు కొనసాగిందని మరికొందరు పరిశోధకులు వాదించారు. కాని నేటికీ వాటికి సరియైన ఆధారాలు లభించడం లేదు.బాల్యంలో అన్నా ఊరిలో, ఊరవతల జరిగే జాతరలలో పాల్గొని అక్కడి సాహిత్య, సాంస్కృతిక, క్రీడా రంగాలలో ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. దానితో ఆయనకు ప్రజా గేయాలు, ఒగ్గు కథలు, జానపద, పురాణ, వీరగాథలు, వేట కథలు, సాహస కృత్యాలపై మక్కువ పెరిగింది.
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన క్రాంతి వీరుడు నానాపాటిల్ ఉద్వేగ ఉపన్యాసం ఆయనపై బలంగా ప్రభావం చూపింది. దీంతో వారితో కలిసి అజ్ఞాతవాస కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అన్నా బావు తల్లి ఈ పరిస్థితిని గమనించి వెంటనే తమ కుటుంబాన్ని ముంబాయికి రప్పించుకొమ్మని వినతి చేసింది. దానితో బావూ కుటుంబం మొత్తం నానా కష్టాలు పడి (సతారా నుంచి నడుస్తూ) ముంబాయికి చేరు కుంది. అక్కడ స్థిరమైన నివాసం లభించకున్నా బావూ తన చాలీ చాలనీ జీతంతో ఒక పూరి గుడిసెలో కా లం వెళ్ళబుచ్చి కుటుంబాన్ని పోషించుకున్నా డు. అన్నాబావు ముంబా యిలో తండ్రికి ఆర్థిక సహకారం నిమిత్తం నానా రకాల పనులు చేశాడు.
చివరికి బట్టల మిల్లులోనూ చేరా డు. అప్పుడే బట్టల మిల్లు కార్మికుల కోసం సంఘాలు స్థాపిస్తూ కమ్యునిస్టు పార్టీ బలమై న ఉద్యమాన్ని నిర్మించసాగింది. అన్నాబావు కు కమ్యునిస్టు భావాలు గల వ్యక్తులు పరిచయమయ్యారు. ఆయనలోని సాహిత్య కళను గుర్తించి వెలికి తీయడానికి సహకా రం అందించారు. బాల్యం నుంచే నాటకాలు, గేయాలు, జానప ద సాంస్కృతిక ప్రదర్శనలలో విశేష ఆసక్తి ఉన్నందున అన్నాబా వు సాహిత్య, సాంస్కృతిక రంగాలను ఎంచుకుని తొలి రచనకు ఉపక్రమించాడు.ఆ కాలంలో ముంబాయిలో కమ్యునిస్టుల నేతృత్వంలో సభలు, సమావేశాలు, సమ్మెలు, ధర్నాలు సాగేవి.గోడలపై రాతలు మొదలు నినాదాలు చేసే వరకూ అన్నింటిలో అన్నాబావు పాల్గొన్నాడు.మార్క్సిజం ప్రభావంతో పూర్తికాలం ఉద్యమ కార్యకర్తగా పని చేయడం ప్రారంభించాడు. ఉద్యమం లో తన ఆలోచనా ధోరణి విస్తరించి సాహిత్య సాంస్కృతిక రంగాలలో అగ్రశ్రేణికి చేరాడు.
‘జగ్ బదల్ ఘాలునీ సాంగూన్ గేలే మలాభీమ్‌రావ్’ గీతం అన్నాబావు రాసిన అన్ని గేయాలలో ప్రసిద్ధి చెందింది. దీని అర్థం ‘ప్రపంచాన్ని మార్చివేయమని నాకు నా భీమ్‌రావ్ (డా అం బేడ్కర్)చెప్పి వెళ్ళాడు’. క్రియాశీల కమ్యునిస్టు కార్యకర్త గా ఉన్న బావూ దళితుల పట్ల, వెనుకబడిన బలహీనవర్గాల పట్ల, కుల వివక్ష పట్ల ఝుళిపించిన కలం అగ్రకుల వర్గాల దోపిడీ గుండెల్లో అల్లకల్లోలం సృష్టించింది.అన్నాబావును ఒక రాజ కీయ కార్యకర్తగా కంటెగొప్ప సాహిత్యకారుడిగా మరాఠీ ప్రజ లంతా గుండెల కద్దుకుంటారు. భారత దేశ సాహిత్యంలో ఇంతవరకు ఏ ఒక్కరూ- కవి, రచయిత, నాట కకర్త, వాగ్గే యకారుడు, విమర్శకుడు వంటి అనేక విభిన్న రూపాను సమగ్రంగా అందుకొని ఎదగలేక పోయారు.కానీ అన్నా వారికి విరుద్ధంగా అద్భుత కళా సాహిత్యాన్ని సృష్టించ గలిగాడు.
అన్నాబావు రాసినవి 32 నవలలు. వాటిలో ప్రతి ఒక్కటి ఆణి ముత్యమే. వాటిలో దాదాపు 7 నవలల ఆధారంగా మరాఠీలో సినిమాలు విడుదలయ్యాయి. అవన్నీ బాక్సాఫీసులో హిట్టయ్యా యి. అందులో ‘ఫకీరా’ నవల కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకోవడమే కాకుండా మరాఠీ సాహితీ పాఠకలోకాన్ని ఊర్రు తలూగించిన కథ. అందులో హీరో దోపిడీ దొంగ. గ్రామాల్లో పేదలపై జరిగే అన్యాయాలను సహించలేక సాయుధుడై పీడకు లను గజగజ వణకిస్తూ అడవిలో మకాం చేస్తాడు.
సరిగ్గా ‘రాబిన్ హుడ్’ వలె భూస్వాముల, ధనవంతుల ధాన్యాన్ని, డబ్బును దోచుకుని గ్రామీణ పేద జనానికి పంచి పెడతాడు. కథ చివరలో పట్టుబడి ఉరిశిక్షకు గురి అయినా తను ఎంచుకున్న మార్గంలో తప్పులేదని, భవిష్యత్తు పరిణామాలకు తానొక మార్గదాతనని చాటి చెబుతాడు. ఇలా అన్నా రాసిన ప్రతి నవలలో ఏదో ఒక సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశం ఉండడం విశేషం. ప్రేమ, కుటుంబ కలహాలు, ఆర్థిక గొడవలు, రాజకీయాలు- ఒకటేమిటి విభిన్న మనస్తత్వాలతో పీడితుల పక్షాన నిలబడి వాటికి ఆలోచింపచేసే, ఆశ్చర్యపరిచే రీతిలో తుది రూపాన్ని సృష్టించడం ఆయన గొప్పద నం. అన్నాబావు రాసిన కథలు 22. వీటిలో అమృత ఆబీ నుంచి స్వప్న సుం దరి వరకు ప్రతి కథా గొప్పదే. ఆయన శిల్పం, శైలి గురించి ఎంత చెప్పినా తక్కువే.
అంత తక్కువ చదువుతో, అం త తక్కువ సమయంలో ఆయన ఎలా ఎదిగాడన్నది ఎందరో పరిశోధకులను సైతం ఆలోచింపజేసిన అంశం. అన్నా బావు మాములు కథకుడు నవలాకారు డే కాదు గొప్ప నాటకకర్త, జన నాట్య కార్యకర్త. అన్నాబావు రాసిన గొప్ప నాటకాలలో అతి ముఖ్య మైనవి 16. వాటిలో ఎన్ని కల మోసం, దేశభక్తి మో సం, నాయకుడు దొరికిండు, ప్రజాస్వామ్య యాత్ర వంటి నాటకాలు విరివిగా ప్రదర్శితమై జనాన్ని ఎంతో ఆకర్షించాయి.
అన్నాబావు రాసిన పద్యాలలో ‘షాహీర్’ (వాగ్గేయ కారుడు) మరాఠా ఆ బాల జనానికి ఎంతో నచ్చిం ది. అన్నాబావు స్వయంగా గానం చేస్తూ స్టేజీ పై ప్రదర్శన ఇచ్చి లక్షలాది జనం చేత ‘షాహీర్ అన్నా బావు’గా, ‘వాగ్గేయకారుడిగా’ పేరు గడించాడు. ఆయన జానపద కళా సాహిత్య కృతులలో ప్రధానమైనవి 1. పోవడా (ఒగ్గుకథ), 2. లావిణీ (స్ర్తీల నృత్యం), 3. పదే, 4. గీతే, 5. చక్కడ్. పోవడాలలో 9 అతి ప్రధానమైనవి. మొదటిది 1942లో వ్రాసిన స్టాలిన్‌గ్రాడ్ ఒగ్గుకథ. రెండవది బంగాళ్ హాక్. జులై 23, 1944లో రాశాడు. అలా బర్లిన్ చీ పోవడా, పంజాబ్, ఢిల్లీ అల్లర్లు 1947లో రాశాడు.ఆ తర్వాత 1947 లోనే తెలంగాణ సమస్య స్పష్టమైన రాజకీయ అవగాహనతో ‘తెలంగాణ సాయుధ పోరాటాన్ని’ సమర్థిస్తూ నిజాం రజాకార్ల దారుణ అత్యాచారాలను ఎండగ డుతూ బలమైన గీతాలతో, సంభాషణలతో ‘తెలంగాణ పోరా టం’ ఒగ్గుకథ రాశాడు.
వేలాది ప్రదర్శనలు ఇచ్చాడు. బహుశ మన నాజర్, సుంకర సైతం అంత విస్తృతంగా తిరిగి (నిర్బధం వల్ల) ఆ కాలంలో ప్రచార ప్రదర్శనలు ఇచ్చి ఉండక పోవచ్చు. ఆ తర్వాత ముంబాయి మిల్లు కార్మికులపై, నల్లబజారుపై అమర వీరులపై 1949 వరకు ఎన్నో నాటికలు రాసి స్వయంగా తనే ప్రదర్శన ఇచ్చే వాడు. ఆయన గొంతు గంభీరమై నందున చిన్ననాడు గానం, నృత్యం, నటన, పఠనం నేర్చుకున్నందున సాధన సులభమెంది.
కమ్యునిస్టు ప్రజానాట్య సంస్థ తరపున పని చేసినందున అందులో అమర్‌శేఖ్, గవన్‌కర్ లాంటి గొప్ప ప్రజా నాట్య కళా మండలి లభించడం వలన అన్నా అగ్రశ్రేణి స్థాయికి దూసు కు వెళ్ళగలిగాడు. దళిత కుటుంబంలో పుట్టినందున కొంత వరకు సాంప్రదా య మార్క్సిజంను వదులుకున్నాడు. అన్నాకు ఇప్టా (ఐ.పి.టి.ల)తో అనుబంధం వల్ల ముంబాయి హిందీ సినీ పరిశ్రమలో క్యారెక్టర్ నటుడిగా ప్రసిద్ధి చెందిన బలరాజ్ సహాని, ఎ.కె.హంగల్ వంటి ప్రముఖ నటులతో దగ్గరి సంబంధం ఉండ ేది. ఆ కాలంలో వెలువడే బ్లిట్జ్ సంపాదకుడు కె.ఎ.అబ్బాస్ నిర్మిం చిన చిత్రాల్ని సమీక్ష చేస్తూ అన్నా వ్యాసాలు సైతం ప్రముఖ దిన పత్రికలలో రాసేవాడు. ఆయన విలేకరిగా ఎన్నో నాళ్ళు పని చేసాడు. దానితో బాటు వివిధ పత్రికలో విస్తృత స్థాయిలో- సమ్మెలు, అత్యాచారాలు, దోపిడీలు, లంచగొండితనాలపై, రాజ కీయ, ఆర్థిక అంశాలపై ప్రత్యేక కథనాలు రాసేవాడు.
prbhakar ఇంతటి సమగ్ర ఆలోచనా ధోరణిలో ఉన్న సాహితీ వేత్త, బహుశా భారత దేశ సాహిత్యంలో అరుదు. అందుకే ఆయనను సోవియట్ యూనియన్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించ డం జరిగింది. ఆయన సాహిత్యం భారతదేశ భాషలలో బాటు చెక్, పోలిష్, రష్యన్, జర్మన్, స్లోవక్, ఇంగ్లీష్ వంటి 14 భాషల్లోకి అనువాదమయ్యాయి. లాల్ బావుటా వీధి నాటక సం స్థల ద్వారా అన్నా బావూ రచయితగా, అభినయకర్తగా, దర్శకుడ ిగా ఎంతో అను భవం గడించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో, కార్మిక వర్గ పోరాటాల్లో, వివిధ సామాజిక న్యాయ ఉద్యమాల్లో క్రియాశీల కర్తగా పాల్గొంటూ ఒక అగ్రశ్రేణి సాహిత్యవేత్తగా, కళాకారుడిగా రూపొందిన అన్నాబావూ సాఠే భారతదేశ సాహిత్యానికి మార్గదర్శి. తెలుగులో అన్నా సాహిత్యం లేని లోటు తీరలేనిది. దానిని త్వరలోనే తెలుగు- మరాఠి సాహిత్యకారులు పూడ్చగలరని ఆశిద్దాం.

vyasam
( మన కాలపు మహాకవి మహమూద్ దర్వీష్ ఇక లేరు.ఆయన ఈ నెల (9 ఆగష్టు 2008) తొమ్మిదో అమెరికాలోని హూస్టన్ లో కన్నుమూశారు.ఆయన స్మృతికి నివాళి ఇది)
కవిత్వపాదాలు ఆకాశానికి రాసుకున్న ప్రేమలేఖల్లాంటివని ఎప్పుడో రాసుకున్నాడు ఖలీల్ జిబ్రాన్ .కానే కాదు…… కవిత్వ పాదాలు పుట్టిన నేలకి రాసుకున్న ప్రేమలేఖలని జీవితంలోని చివరి క్షణం దాకా చెప్పుకుంటూ . కవిత్వం నిండా సొంత వూరి ఙ్ఞాపకాల పరిమళాల్మి నింపిన వాడు మహమూద్ దర్వీష్.
కవిత్వపాదాలు మట్టిలోంచి మొలుచు కురావాలని . తిరిగి మట్టిలోకే చేరుకోవాలని గట్టిగా నమ్మిన పాలస్తీనా మహాకవి దర్వీష్ . ఇజ్రే ల్ లో ఓ మధ్య తరగతి ముస్లిం రైతు కుటుంబంలో పుట్టిన దర్వీష్ కుటుంబానికి చిన్న పాటి పొలాలే సర్వసంపద. దర్వీష్ కి ఆరేళ్ళ వయసులో ఇజ్రేల్ ప్రభుత్వం ఆధి పత్యం కోసం అతని వూరంతా ధ్వంసం చేసింది. వూరు వూరంతా వల్లకాడయ్యింది. దిక్కు లేని పక్షుల్లా ప్రాణాలు అరచేతి పట్టుకుని దొంగదారిన లెబనాన్ చేరింది దర్వీష్ కుటుంబం.అక్కడి నుంచి మొదలైంది దర్వీష్ వలస బతుకు. అతనే ఒక కవితలో రాసుకున్నాడిలా-
ఎప్పటికీ నేను అక్కడి వాణ్నేఅక్కడే నా ఙ్ఞాపకాలన్నీ వున్నాయి.అందరిలానే పుట్టాను నేను ఆ వూళ్ళో.నాకూ ఓ తల్లి వుందిబోలేడు కిటికీలున్న ఇల్లుందితోబుట్టువులూ స్నేహితులూ వున్నారునాకూ ఓ జైలు గది వుందిఅతి చల్లని కిటికీలు బార్లా తెరుచుకున్న గది
ఒకే ఒక మాట మిగిలిపోయింది - సొంతూరు.ఆ ఒకే ఒక్క పలుకు కోసంఅన్ని నియమాల్ని తుంగలో తొక్కానుఅన్ని మాటల్నీ ధ్వంసం చేశానుఒకే ఒక్క మాట కోసం-సొంతూరు.
పుట్టినూరు పరాయిదైపోయింది . సైనిక పదఘట్టనల కింద నలిగిపోతున్న నేలతల్లి నెత్తుటి కనుకొలకుల్లోంచి రాలుతున్న కన్నీటి చుక్కలు అతన్ని ఎక్కడా ప్రశాంతంగా బతకనివ్వలేదు. నిరంతర అవిశ్రాంత యోధిడిలా అతను చారెడు నీడ కోసం దేశదేశాలూ సంచరించాడు దిక్కులేని పక్షిలా. అతని కవిత్వపాదాల సింహనాదాలకు భయపడి , రాజ్యం అతన్ని వెలివేసింది. గతవారం అమెరికాలోని హుస్టాన్ లో అతను కన్నుమూసేదాకా రాజ్యం కంటి మీద కునుకులేదు. మహమూద్ దర్వాష్ ఇక లేడన్న మరణవార్త విన్న నేలతల్లి పాలస్తీనా గుండె తల్లడిల్లింది. చివరి క్షణం దాకా ఎత్తిన కలం దింపకుండా కలానికి ఒక దేశపు జెండా కుండాల్సినంత పొగరునీ , శక్తినీ అందించిన కవి దర్వీష్. అందుకే అతని ప్రతి పలవరింతా . ప్రతి కలవరింతా జన్మభూమి ఆత్మఘోషగా మారిపోయింది. కాని , కవిత్వంలో అంతర్ముఖత్వానికీ , బహిర్ముఖత్వానికీ నికార్సయిన ఎల్లలు గీసుకున్న కవి దర్వీష్. అతని కవిత్వం చండ్ర నిప్పులు చెరిగిన క్షణాలు వున్నాయి. మంచు తునకల్ని ముఖమ్మీద చిలకరించిన క్షణాలు వున్నాయి. నిరసన నిరసనే . అట్లాగని, నా అనుభూతిని ఎందుకు దాచుకోవాలి? ‘ అంటూ కవిత్వపాదాల్ని తూనీగల నడకల మృదుత్వంతో పోటీపడేట్టు తీర్చిదిద్దిన అందమైన శిల్పి దర్వీష్. ఎప్పటికైనా ఎవరినైనా నా కవిత్వ పాదం దాని కవిత్వ శక్తి వల్లనే బతుకుతుంది. అందులోని వస్తువు కొంతకాలానికి నీరసించినా సరే..’ అని పదేపదే చెప్పుకున్నాడు దర్వీష్. కదనరంగానికీ, కవిత్వానికీ మధ్య సూది మొన అంతటి ఆ సున్నితమైన తేడాని గుర్తించి. ఆ గుర్తింపు ప్రతి కవితలోనూ కనబరిచి, కవిత్వ శక్తి ముందు ఏ శక్తి అయినా బలాదూరేనని రుజువు చేసినవాడు దర్వీష్.
సూట్ కేసే నా స్వదేశం
దర్వీష్ కవిత్వంలో అత్యంత బలంగా కనిపించేది మాతృభూమి భావనే. ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ప్రవాసశిక్ష పడింది దర్వీష్ కి.’ ఆ తరువాత సూట్ కేసు మాత్రమే నా సొంతదేశం అయింది . సంచారమే నాకు మిగిలింది ‘ అంటాడు దర్వీష్. అతని కమ్యూనిస్టు రాజకీయాలు, అతని కవిత్వపాదాల అగ్రహమూ అతన్ని ఎక్కడా క్షణం సేపు ప్రశాంతంగా వూపిరాడనివ్వలేదు. చివరికి తండ్రి చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలకి హాజరుకావడానికి అనుమతి దొరకలేదు. కాని, చాలా కాలం తరవాత ఒక డాక్యుమెంటరీ కోసం నాలుగు రోజుల పాటు పుట్టి వూరికి వెళ్ళడానికి ఇజ్రేలీ ప్రభుత్వం అతనికి అనుమతించింది. ఆ నాలుగురోజులూ దర్వీష్ జీవితంలో మరచిపోలేని స్మృతులు. అప్పుడే సమాధిలో చిరనిద్రలో వున్న తండ్రిని చివరిసారి చూసుకున్నాడు దర్వీష్.ఆ నాలుగు రోజులూ నేను పసిపిల్లాణ్నయిపోయాను. నేను చిన్నప్పుడు ఆడుకున్న చెట్టూ చేమలన్నీ నాకు గుర్తే. వాటిని మనసారా చేతులతో తడిమాను. వాటిని కావిలించుకుకునిఏడ్చాను. నేను కూర్చున్న ప్రతి రాయి మీదా మళ్ళీ కాసేపు కూర్చున్నాను. నా చిన్నతనాన్ని తలుచుకున్నాను. మళ్ళీ ఆ రోజులు వస్తాయా అని కాసేపు కాలంలోకి ఆశగా చూశాను. అంత పరవశం నాకు ఎప్పుడూ కలగలేదు. ఆ నాలుగు రోజులూ మళ్ళీ రావు కదా ?’ అని రాసుకున్నాడు దర్వీష్. నిజానికి ఆ నాలుగు రోజులు ఎప్పటికీ అతని జీవితంలో తిరిగిరాలేదు.దర్వీష్ గొంతు నిండా ఒక పట్టరాని కోపం నిండుకుపోయి వుంటుంది. ఒకోసారి చాలా ప్రాశాంతంగా సెలయేటి ప్రవాహంలాగా వెళ్ళే పద్యం . మరింకోసారి వున్నట్టుండి కట్టలు తెగిన ఏరులా వూళ్ళన్నిటినీ విపరీతాగ్రహంతో ముంచెత్తుతుంది.
1960 లో రాసిన కవిత ఇది-
రాసుకోనేను అక్షరాల అరబ్బువాణ్నినా గుర్తింపు కార్డు నెంబరు 50,000నాకు ఎనిమిది మంది సంతానం.తొమ్మిదోది ఈ ఎండాకాలంపుట్టబోతోంది.మొదటి పుటలో స్పష్టంగా రాసుకోనేను ప్రజల్ని ద్వేషించను
ఎవరి ఇలాకాలోకి జొరబడనుకానీ , ఆకలేసిందా,నీ కండల్నే కొరుక్కుతింటానుజాగ్రత్త, జాగ్రత్తనా ఆకలి మహా ప్రమాదకరమైందినా ఆగ్రహం మరీ మరీ ప్రమాదకరమైంది.
రెండు దశాబ్దాల పాటు దర్వీష్ కవిత్వం ఇదే ఆగ్రహంతో వూగిపోయింది. అరాఫత్ నాయకత్వంలోని పాలస్తీనా జాతీయోద్యమం అతని ఆశలకి ప్రతిరూపమైంది. అతని కవిత్వ ఆవేశానికి ఒక రూపాన్నిచ్చింది. ఉద్యమంలో అతను కీలకభాగస్వామి అయ్యాడు. 1974 లో అరాఫత్ ఐక్యరాజ్యసమితిలో చేసిన చరిత్రాత్మకమైన ప్రసంగంలోని మొదటి పంక్తి దర్వీష్ దే. ఒక ఆలీవ్ ఆకునీ , ఒక స్వాతంత్ర్య యోధుడి తుపాకినీ భుజాన్నేసుకుని వచ్చాను. ఆ ఆలీవ్ ఆకుని నా చేతుల్లోంచి జారిపోనివ్వకండి ‘ అన్న ఆ వాక్యం ఎన్నో విధాలుగా దర్వీష్ కవిత్వం ఒక రాజీపడని గొంతుక. కవిత్వంలో నానార్థాల పెడర్థాల గందర గోళాన్ని అతను ఎప్పుడు సహించలేదు. ప్రతీకలు దారితప్పడాన్ని అతను ఏనాడూ భరించలేదు . అందుకే - తన కవిత్వంలో అమ్మ అన్న మాట వచ్చినప్పుడల్లా ఆ పదాన్ని పాలస్తీనాకి ప్రతీకగా భావించే ధోరణిని అతను విమర్శించేవాడు. అమ్మ అంటే అమ్మీ. ఆ అమ్మ అచ్చంగా నా తల్లి మాత్రమే . అది దేశమూరాదు.ఇంకో ఆవేశానికి ప్రతీకా కాదు. కేవలం నా వ్యక్తిగతం. నా కవిత్వాన్ని ఒకే విధంగా చదవడం అలవాటయ్యి. అందరూ రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. కాని, నా కవిత్వానికి అనేక వ్యాఖ్యానాలు లేవు. ఒకే ఒక్క అర్థం వుంది ‘ అని చెప్పేవాడూ దర్వీష్ . ఒక్క మాటలో చెప్పాలంటే - దర్వీష్ కవిత్వాన్నే ఒక యుద్ధభూమిగా ప్రేమించాడు. నిరంతర వలసల మధ్య పుట్టిన వూరు ఒక కలగా మారిపోయిన కవిత్వాన్ని రాసుకున్నాడు . కాని , అతని ప్రతి కవితా ప్రపంచం తన కవితగానే పాడుకుంది. అతని వ్యక్తిత్వంలో ప్రపంచం తన ప్రతిబింబాన్నే వెతుక్కుంది. ఎక్కడ ఏ భూపోరాటం జరిగినా, ఆ పోరాటానికి అతని అక్షరాలు ఆయుధాల్ని అందించాయి.
దర్వీష్ మాటల్లోనే చెప్పాలంటే-
నా పదాలు గింజలయితేనేను నేలని.నా పదాలు పట్టరాని ఆగ్రహమయితేనేను పెనుతుపానుని.నా పదాలు రాళ్లయితేనేను నదిని.నా పదాలు తీయతేనియలయితేనా పెదాలు తేనెటీగల గూళ్ళు.

Subscribe to:
Posts (Atom)