--వెంకటేష్
ఎక్కడని వెతకను
ఉన్నావన్నా ఆశతో
నిరంతరం డేగ చూపులతో
అణువణువు గాలిస్తూ...
రహదారిపై ఎర్రటి ఎండలో
ఏడో నంబరు మైలురాయిపై
ఎవరో కూర్చొన్నారు...
శరీరాన్ని ముద్దలా మడిసి
గుండ్రంగా సున్నాల కనిపిస్తున్నారు!
అర్దనిమీలిత నేత్రాలతో
ఆత్రంగా వెతుకులాట
అక్కడో,ఇక్కడో,మరెక్కడో
నిను వెతుకుంటున్నాను!
సూదూర తీరాన్నుంచి
నీ గద్గద స్వరం
మలయమారుతంలా తాకింది
నా మనోహర నేత్రం విచ్చుకుంది సంతోషంగా!
రెండు రక్తపు బొట్లు
నేలపై రాల్చి
పెను వృక్షమై ఎదిగినా...
నాపై వాలే పావురాలు
కూడ నీ జాడ చెప్పలేదు!
కన్నీటి తెరలలో
నీ అస్పస్ట రూపం
కనులు మూసి తెరిచేలోగా
మాయమై పోతున్నది!
చిక్కటి చీకటిలో కూడ
ఎక్కడివో వెలుతురు జాడలు
మనస్సులోకి దూరి దైర్యానిస్తున్నాయి!
కనిపించక పోవడం తత్కాలికమే
కనుమరుగవడమే భరించలేనిది!
2 comments:
"కనిపించకపోవడం తాత్కాలికమే, కనుమరుగవడమే భరించలేనిది" ఈ లైన్లు నాకు బాగా నచ్చాయి.
మీ భావాల్లో లోతు ఉంది. ఇంతకీ ఇది కవితా? చైతన్య స్రవంతా? కవితను సరిగా పేర్చినట్లు లేదని నాకనిపించింది. కంటెంట్ వార్నింగ్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు.
అన్నట్లు చదువరి పేరుతో ఇప్పటికే ఒక ప్రముఖ బ్లాగుంది. మీరు వేరే పేరు ఎంచుకుంటే బాగుంటుందేమో చూడండి. ఆ బ్లాగు చూశారా?
www.chaduvari.blogspot.com
మీ కామెంటుకి ధన్యవాదాలు!నిజానికి అది చైతన్య స్రవంతి ధోరణితో ఉంచాలనే అనుకున్నాను. కానీ, చాలా మంది చదవడానికి అనుకూలంగా ఉండేవిధంగా కవిత రూపంలో ఉంటేనే బాగుంటుందన్నారు. అందువల్ల దీన్ని మరలా మీరు కోరినట్లు ప్రచురిస్తున్నాను.
ఇక, మీరు అన్నట్లు చదువరి బ్లాగు ఉన్నది. నేను దాన్ని గమనించక పోవడం వల్ల మళ్ళీ అలా పెట్టాను. త్వరలో నా కవితాత్మను ప్రతిబింబించే టైటిల్ కోసం ఆలోచిస్తున్నాను. మీరు కూడా ఎలాంటి టైటిల్ పెడితే బాగుంటుందో నా బ్లాగు రచనలు చదివి మీ అభిప్రాయాన్ని తెలపవలసినదిగా కోరుతున్నాను.
-వెంకటేశ్
Post a Comment