వెంకటేష్
to తెలుగు
show details
9:16 pm
తడి ఆరని కవిత్వం-మంచుపూల వెన్నెల రెండవభాగంఆర్థిక సరళీకృత విధనాల వల్ల "మొబైల్ విప్లవం"బయలుదేరింది.సెల్ పోన్ లువచ్చిన తరువాత మనుషుల మధ్య దూరం పెరగసాగింది.మనుసులు విప్పి మాట్లాడటంలేదు.ఉత్తరం ఎప్పుడో ఉత్తర దిక్కుకు పారిపోయింది."సెల్ పోన్పలకరింతలు"ఎక్కువయ్యాయి.దీనినిచిత్రిస్తూ రచయిత అభివృద్ది మాటున మానవసంబంధాలు ఎలా చిధ్రం అవుతున్నాయో "ఎస్సెమ్మెస్"కవితలో ప్రతిభావంతంగావ్యక్తీకరించారు.ఏ రంగుల ప్రపంచంలోనో విహరించే నేనునా మాటల యత్రం శబ్దానికిఉలిక్కిపడి మేల్కొంటానుసంకేతాల నందు కోవడంలో రాత్రిని మించిన జాణ లేదుఇలా కవితను ఎత్తుకొని హృదయంతో మాట్లాడుకోవాలని అంటాడు.తుషారమంతా అమాయకంగాఇక హృదయంతో మట్లాడు కుందాంఒక అందమైన స్వేచ్చ భావ ప్రపంచంలోకి ఎగిరిపోదాంఅంటూ కవితను ముగిస్తాడు.రచయితకు భాల్యం పట్ల మమకారం ఉంది. చిన్నప్పటి స్నేహాలను,దొంగిలించినగోలీలను "వరదపూలు" కవితలో చూపిస్తాడు.తడవడం భావుంటుంది....!నీళ్ళలోనైన...కవిత్యంలోనైనఅంటూ నూతన అభివ్యక్తిని వ్యక్తికరిస్తున్నాడు.ఈ సంపుటిలో ఉత్తమ కవిత :పుట్టిల్లు".వస్తువు రిత్యా,శిల్పరిత్యా కొత్తపుంతలు తొక్కిన కవిత.అమ్మ వెళతానంటుందిఇష్టం లేని బల్లోకి పిల్లాడిని పంపిస్తేఅక్కడ వాడు మారాం చేసినట్టుఅమ్మ తన పుట్టింటికి వెళతానంటుంది.......................అన్ని క్షణాలు మాకోసం త్యాగం చేసిచివరికిలా మిగిలిపోయిన అమ్మ ఋణాన్నేలా తీర్చుకోవడంఅమ్మకు నాన్ననై పుడితే తప్ప ....!మొత్తానికి బెల్లంకొండ రవికాంత్ "మంచుపూల వెన్నెల" మనల్ని హృదయాంతరాల్నితాకుతూ మంచుపూల వెన్నెల్లో తడిపేస్తుంది. ప్రతి ఒక్కరు చదవవలసిన మంచికవితా సంపుటి ఇది.(ప్రతులకు:ఎ-26 యూనివర్సిటీ ప్యాకల్టీ క్వార్టర్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గచ్చిబౌలి -హైదరాబాద్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment