Wednesday, February 6, 2008

మరక మంచిదే...బట్టలపై నైన్నాజీవితంలో నైనా!
పండినే చెట్టుకే రాళ్ళ దెబ్బలుజీవితం అంటేమరకయొక్క శాశ్వతగుర్తే కదా!
కళ్ళలోకి నిండినకన్నీటి కుండలుదేహం మొత్తం కాలినాచితిమంటల రక్తపు కాసరాలు!
మేఘపు సమూహాలురమ్మని బలవంతం చేస్తూవర్షపు చినుకుల్ని అతిధులుగాపంపుతున్నాయి!
చినుకుల్ని రాలుస్తూఆకాశం గర్బస్థమైందిమనుషులు అహాన్ని రాలుస్తూ రాక్షసులు అవుతున్నారు!
కష్టాల కొలిమిలో వేడిక్కినాజీవితం కడు రక్తపు కవిత్వాలు రాస్తున్నది!
సంస్కారం ఒక రాచపుండునటనకు ఆస్కార్ ల పంటఇపుడు మనం నాగరికులం అట!
ప్రపంచీకరణ ఎండినా డొక్కలోతన్నిన దున్న కాలునా కారం రొట్టేను గుంజుకున్న పిచ్చికుక్క!

నాకు కావలసినదంతాటీవి ఇస్తునప్పుడునాక్కొంచం జీవితం పట్లనమ్మకం కావాలి!
ఎవరన్నారు అభివృద్దిజరగలేదనిపల్లె పల్లె లో కేబుల్ టీవీలుకోకాకోలాలు, పెప్సీలు!
ప్రస్తుతం అభివృద్ది అంటే మార్కేట్ నిర్దేశించే వస్తువుల్ని సమీకరించుకోవడమే!

No comments: