Friday, August 24, 2007

భుజాలపై మోసిన శవాలెన్నో

భుజాలపై మోసిన శవాలెన్నో
వికృతంగా నవ్వుతున్నాయి
జననానికి మరణానికి
తేడా లేనట్లు!


ఎక్కడో చచ్చిన మరణం
పుట్టడానికి విశ్వప్రయత్నం
చేస్తున్నది!


అవును!ఇది మరణ వృత్తమే
జీవిత మంత మరణించి
ఇపుడు జీవిచడానికి
తయారవుతున్నది!


చావు పల్లకిలో ఊరేగడానికి
కొత్త మనుషులు కొత్త బట్టలు
కట్టుకొని వచ్చారు!


నాకు తెలుసు
మరణం అంటే ఏమిటో
ఎందుకంటే నేనెప్పుడో
మరణించను!

No comments: