Wednesday, March 14, 2007

ఈరోజు నా చావు ముహూర్తం...

ఈరోజు నా చావు ముహూర్తం...
ఖచ్చితంగా పన్నెండు గంటలకి
ఒక క్షణం తేడా ఉండదు!
ఎందుకు చస్తున్నావని
కారణాలు అడక్కండి
చావడానికి కారణాలు ఉండవు!
పరీక్షల్లో తక్కువ మార్కులు రాలేదు
ప్రేమ విఫలం కాలేదు
ఆర్థిక సమస్యలు లేవు
మానసిక వికృతాలు లేవు
అయినా చావడానికి
నేను సిద్దమై పొయాను!
మీకొక అనుమానం రావచ్చు
ఎలాంటి సమస్యలు లేకుండ ఈ గోల ఏమిటని
ఎమైతేనేం నేను చావడనికి సిద్దమై
పోయాను!
కాని ఒక పెద్ద డౌట్ ఏమిటంటే ఎలా చావాలి?
మీలొ ఎవరైన చావడానికి మార్గాలు
ఉంటే చెప్పండి!
మీ పేరు ఎవరికి చెప్పనులే
ఏమిటి రైలు కింద తల పెట్టాలా
ఇంత బ్రతుకు బ్రతికి కుక్కల చావ మంటారా
నాకు నచ్చలే! ఇంకొక నొప్పి తెలియని మార్గం ఉంటే చెప్పండి!
విషం తాగమంటారా
ఉరి వేసుకోమంటార
అమ్మో!ఊహించడానికే భయంగా ఉంది!
చీ ఈ ఆధునిక యుగంలో
నొప్పి తెలియకుండ చావలేమ!
ఇపుడు తెలిసింది విషం కూడ నకిలిదని
అది తాగితే చావం సరికదా ఆయుస్సు పెరుగుతుంది!
మీకు సలహాలు ఇవ్వడం కూడ చేతకాదు
నాకు అద్బుత మైన ఆలోచన వచ్చింది
చావడానికి సుఖమైన మార్గం
శీతల పానీయాలు తాగడమే
పది రూపాయలతో ప్రాణం పైకెగిరిపోతుంది!
ఈరోజు నేను చావడానికి సిద్దమై పొయాను
దయచేసి ఎవరు నా గురించి కన్నీల్లు
పెట్టుకోవద్దు!

No comments: