Thursday, September 30, 2010
ట్రింగ్...ట్రింగ్...ట్రింగ్హలో హలో...మీ సినిమా థియేటర్ లోబాంబ్ పెట్టాము...అది మరికొద్ది క్షణాల్లోపేలిపోతుంది!ప్రాణం పై ఆశ ఉన్నవాళ్ళుపారిపోవచ్చుపరిగెత్తరానివారు తోపులాటల్లో పడి చావచ్చు!సరదాకి కూడనగరంలోకి వెళ్ళితే అనుకోని అతిథిలా మరణం మిమ్మల్నిఆహ్హానిస్తుంది!వాన రాకడ ప్రాణం పోకడ ఇపుడు బట్టలు మార్చి నంత సులువు.ప్రభువా వీళ్ళను క్షమించు.వీరేమి చేసున్నారో వారికి తెలియదు!సెల్ ఫొన్ బాంబ్ లతోక్షణంలో మీ శరీరం శకలాలుగా మిగులుతుంది!కాబట్టి తస్మాత్ జాగ్రత్త.బ్రతకాలంటే ఇప్పుడు నాలుగుకళ్ళు ఉండాల్సిందే!
Wednesday, September 15, 2010
- పైశాచికత్వం కౄరంగా కాటువేసినప్పుడుఎన్ని అమాయకపు జీవితాలు..ఎన్ని అందమైన కలలు..ఎన్ని ఉన్నత ఆశయాలు..ఎన్ని లేత నవ్వులు..ఎన్ని ఆనందపు క్షణాలు..అంతమైపోయినవో కదా!కటిక పస్తులుండికన్నకొడుకుని చదివించికొత్త ఉద్యోగంలో కొడుకుని చూసిపస్తులేని రోజుల్ని కలలు కన్నఓ.. వెర్రి తల్లీ! నీ కోడుకునీ శరీరంలోని మాంసపు ముద్దనీ కన్నపేగు.. ఇప్పుడు నిజంగానే..మాంసపుముద్దగా.. పేగులగుట్టగా మారిఆసుపత్రి మార్చురీలో..శవాల గుట్టల మధ్య..ఆనవాలు లేకుండా ఉన్నాడు.ఎందుకీ ఘోరం.. ఎవరిదీ పాపం..అంతా అయిపోయింది..అవును..క్షణాల్లో.. అంతా అయిపోయింది.ఇక ఏడవకు తల్లీ..!ఏడ్చి మాత్రం సాధించేదేముందిలే!?ఇలా అన్నందుకునన్ను క్షమించు తల్లీ!నాకేం ఓదార్పు మాటలు ఎన్నైనా చెపుతాను.కాని.. కాని.. కాని..గర్భశోకం ఎవరిది తల్లీ!?నీది కాదా....!అవును నీదే కదా..!అందుకే ఏడువు..బాగా ఏడువు..గుండెలు పగిలేలా ఏడువు..కన్న తల్లుల కడుపు తీపిచల్లారేలా ఏడువు..ఈ పైశాచికపుఇ మారణహోమాలుణి కన్నీటితో తడీసి ఆరిపోయేలా..ఈ ఆటవిక కౄరచర్యలునీ ఆర్తనాదాలు విని ఆగిపోయే దాకా..ఏడువు...ఇంకా ఏడువు..ఏడువు..
మాదక ద్రవ్యాల ముప్పు
- పిల్లల్లో సైతం వ్యాపిస్తున్న వ్యసనం- కేవలం చట్టాలే నిరోధించలేవు- డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం ఎంతో ముఖ్యం - దేశంలోనూ అధికసంఖ్యలో వ్యసన బానిసలుభామాదక ద్రవ్యాలు యన యువత భవితను బలి తీసుకుంటున్నాయి.. ముఖ్యంగా ముంబాయి నగరం మాదక పదార్ధాల కేంద్రంగా పనిచేస్తున్నది. బ్రౌన్ షుగర్ వంటి మత్తు పదార్ధాలను యువతీ యువకులు ఇంజెక్షన్ల ద్వారా తీసుకొంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో ఈ వ్యసనం పెరిగిపోతున్నది. ఎయిడ్స్ వ్యాధి కూడా ఆ ప్రాంతాలలోనే భయంకర స్థాయిలో ఉన్నది. ఇంక కొన్నేళ్ళకు దేశంలో మాదక ద్రవ్యాలను సేవించేవారి సంఖ్య కోటి, కోటిన్నర మందికి చేరుకోవచ్చునని ప్రస్తుత అంచనా. ఈ వ్యసనం ఇప్పటికి మాత్రం నగరాలకే పరిమితమై ఉంది. దీన్ని మొగ్గలోనే తుంచివేయకపోతే గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించి జాతి మొత్తాన్నే నిర్వీర్యం చేయడం తథ్యం. మత్తు పదార్ధాల వ్యసనానికి బానిసలు అయిన అయిన వ్యక్తులు జీవచ్ఛవాల వంటివారు. యువతీ యువకులే కాదు, పిల్లలు కూడా ఈ వ్యసనానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది. కొంతమంది కేవలం ఆనందంకోసం మాదక ద్రవ్యాలు సేవిస్తారు. కొంతమంది ‘సాహస’ భావంతో ఈ వ్యసనానికి శ్రీకారం చుడతారు. వీటి వినియోగం ఒక్కసారి అలవాటయ్యాక ఇక బయట పడడం కష్టం.చుట్టూ చక్కటి వాతావరణం లోపించినప్పుడు మాదక ద్రవ్యాలు పరిష్కారంగా కొందరికి కనిపిస్తాయి. చేతినిండా డబ్బు ఉండడం వల్ల కూడా ఈ వ్యసనం ఏర్పడవచ్చు. కేవలం చట్టాలతోనే ఈ వ్యసనాన్ని నిర్మూలించలేము. ప్రచారం కూడా సాగాలి. 1987- 94 మధ్య ‘కొకెయిన్’ ఉత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగింది. వరంగల్ వంటి జిల్లాలలో మూడు, నాలుగు ఎకరాల భూమిలో గంజాయి పండిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 1944లో 7900 టన్నుల గంజాయి ఉత్పత్తి అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 60 కోట్ల అమెరికా డాలర్ల విలువ చేసే మత్తు పదార్ధాల్ని సేవిస్తున్నారు. అమెరికా జాతీయోత్పత్తిలో ఇది 10 శాతం. మాదక ద్రవ్యాల దుష్ర్పభావాన్ని ప్రపంచానికి తెలియచెప్పడం కోసం ఐక్యరాజ్య సమితి 2000 దశాబ్దాన్ని మాదక ద్రవ్యాల వ్యతిరేక దశాబ్దంగా పాటించింది. ఈ దశాబ్దంలో వీటిని అరికట్టడానికి ప్రపంచ దేశాలమధ్య సహకారం గణనీయంగా పెరిగింది. డ్రగ్స్ నిరోధానికి చట్టబద్ధమైన చర్యలు కొన్ని తీసుకుంటున్నప్పటికీ ఫలితాలు రావడం లేదు. 1985 ఏప్రిల్‌లో భారత పార్లమెంటు ‘నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్‌స్టెన్స్ యాక్టు’ను రూపొందించింది.మత్తుపదార్ధాల అక్రమ రవాణాను అరికట్టేందుకు 1986లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను ఏర్పాటు చేసింది. మొత్తంమీద ఈ విషయంలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తీసుకుంటున్నంత కఠిన చర్యల్ని ఇండియా తీసుకోవడం లేదు. భారత సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 1944లో మొత్తం 11 లక్షల 28 వేల మంది డ్రగ్స్ బానిసలు నమోదు చేయించుకుని ఉన్నారు. వారిలో 44 శాతం మంది చిన్నవయస్సువారు. మొత్తం బానిసల్లో 4.54 శాతం మంది 12-15 సంవత్సరాల లోపు వారు.13.86 శాతం మంది 18-23 సంవత్సరాల లోపు, 30 శాతం 24-30 సంవత్సరాల లోపు, 35 శాతం మంది 31- 45 సంవత్సరాల లోపు వయస్సువారు. 13.1 శాతం మంది 46-60 సంవత్సరాలలోపు వారు కాగా 3.5 శాతం మంది 60 సం పైబడినవారు. అయితే, అదే సంవత్సరం అంతర్జాతీయ నార్కోటిక్స్ బోర్డు లెక్కల ప్రకారం ఇండియాలో 25 లక్షల మంది డ్రగ్స్ బానిసలున్నారు.డ్రగ్స్ బానిసల వృత్తుల్ని పరిశీలిస్తే, వారిలో 17.93 శాతం మంది చిన్నవ్యాపారులు, 17.25 శాతం మంది వ్యవసాయదారులు. 13.5 శాతం మంది రోజు కూలీలు. 11.52 శాతం మంది ప్రభుత్వోద్యోగులు.10.57 శాతం మంది వ్యవసాయ కార్మికులు. 3.3 శాతం మంది రిక్షా- ఆటో నడిపేవారు. 1.47 మంది వృత్తి నిపుణులు. వీరిలో 47 శాతం మంది నిరక్షరాస్యులు కాగా, 3.95 శాతం పి.జి.వరకూ చదివినవారు. డ్రగ్స్, మద్యపానం దురలవాట్లను నివారించడానికి 1999 లో 368 ప్రభుత్వేతర సంస్థలకు ఆర్థిక సహాయం అందజేశారు. దాంతో వారు 160 డ్రగ్స్ అవేర్‌నెస్ కేంద్రాలను, మరో 60కి పైగా చికిత్స, పునరావాస కేంద్రాలను ప్రారంభించారు. నార్కోటిక్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్‌స్టెన్స్ చట్టం కింద డ్రగ్స్ నేరాలకు కఠిన శిక్షలు విధించే వీలు కల్పించారు.డ్రగ్స్ నేరాలకు 10 సంవత్సరాల కఠినకారాగార శిక్ష, కనీసం రూ.లక్ష జరిమానా విధిస్తారు.తిరిగి అదే నేరం చేస్తూ పట్టుపడితే 15సం. జైలు శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తారు. ఇటువంటి కేసుల్లో 30 సం. జైలు శిక్ష, రూ.3 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. తిరిగి అదే నేరంచేస్తే మరణశిక్ష విధించవచ్చు. వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే డ్రగ్స్ స్పల్ప స్థాయిలో కలిగిఉన్నట్టు రుజువైతే స్వల్పశిక్షతో బయట పడవచ్చు.
- ఏడాకులపల్లి వెంకటేష్
More From Edit Page

Tuesday, August 3, 2010
సూర్య(28-6-2009)లో దళితతాత్త్వికుడు సమీక్ష
#fullpost{display:inline;}
దళిత కవిత్వాన్ని కేవలం అనుభవాల, ఆ త్మన్యూనతా భావాల వ్యక్తీకరణగా కుదించే ప్రయత్నం చేసిన అగ్రకుల సాహితీ వేత్తల కుహకత్వాన్ని ప్రశ్నించి ఆర్థిక నియతి వాద అసమగ్రతని బద్దలు కొట్టి తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపు కుదిపింది దళిత కవిత్వం. దళితుల ఆశలకీ, ఆకాంక్షలకీ, ఆవేదనకీ, ఆక్రోశానికీ, ఆగ్రహానికీ, ఆత్మగౌరవానికీ ప్రతి రూ పంగా నిలిచిన దళిత కవిత్వం కొత్త చూపుతో, కొత్త వ్యక్తీకరణతో బలంగా వస్తోంది. ఈ కోవ లో వచ్చి దళిత సాహిత్యంలో కనిపించే బలమై న తాత్విక భూమికను విశదీకరించే కవితల సంపుటి ‘దళిత తాత్వికుడు’. డా దార్ల వెంకటేశ్వర రావు ఈ కవితలన్నీ అప్పుడప్పుడూ రాసి నా, దళిత తాత్త్విక భూమికను ఒకేచోట చూపడంలో ఏకసూత్రత కనిపిస్తుంది.ఈ కవితా సంపుటిలో 23 కవితలు ఉన్నాయి. వీటితో పాటు ప్రతి పుటలో ఒకటి, రెండు మినీ కవితలున్నాయి. వస్తువు రీత్యా, అభివ్యక్తి లో ఈ కవితలు కొత్త పంథా తొక్కాయి. దళితు ని ఆత్మ న్యూనత భావాన్ని విడనాడి ఆత్మగౌరవ పోరాటానికి నడిపే కవితలకు ప్రతీకలుగా వీటి ని అభివర్ణించవచ్చు. ‘బడిలో అమ్మ ఒడిలో’ కవితలో కవి దళితుల ఆత్మగౌరవాన్ని కవిత్వీకరించాడు.
‘ఈ కులంలో పుట్టక పోతే
నేను ఇం కోలా ఆలోచించే వాణ్ణేమో
ఈ కులంలో పుట్టడ మే మంచిదైంది
అవమానమంటే అర్థమైంది
అందర్ని ప్రేమించిడం తెలిసింది’ అంటాడు. ఈ కవిత కథనాత్మక శైలిలో ఉన్న దీర్ఘ కవితా లక్షణాలతో కొనసాగింది. చిన్న నాటి నుండే అందరిలా చదువుకోవాలని దళితునికీ ఉన్నా, తప్పని సరిగా పశువుల్ని మేపడానికో, కూలి పనికో వెళ్ళవలసి వస్తుంది. కేవలం పేదరికం వల్ల మా త్రమే కాదు. గ్రామ పెత్తందారీ తనం వల్ల కూ డా అలా వెళ్ళవలసిన దయనీయ స్థితిని వర్ణిం చారు. ప్రాచీన సాహిత్యం నేటికీ తప్పనిసరి బోధనాంశమవుతోంది. అవి కొన్ని వర్ణాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాసినవి. కానీ, ఆ ప్రాచీన సాహిత్యంలోనే శాశ్వత విలువలున్నాయనే వితండ వాదనల వల్ల యావత్తు ఆ సాిహ త్యం పట్లనే వ్యతిరేకత కలుగుతుంది.
‘ప్రాచీన సాహిత్యం పాఠమైనప్పుడల్లా
నా ముఖకవళికలన్నీ మారిపోయేవి
మూకుమ్మడిగా కళ్ళన్నీ నాపైన పోకస్
ఎన్ని సార్లు చంపుతావంటూ
దేవుణ్ణి కాలర్ పట్టుకోవాలనిపించేది’అనడంలో దళితుల మానసిక సంఘర్షణను కవి బలంగా అభివ్యక్తీకరించగలిగాడు. కవిని తన పల్లె తాలుకు గతం వెంటాడుతోంది. పురుగుల్ని, పాముల్ని లెక్క చేయకుండా, గాయాల చేతుల తో పొద్దున్నే కారం పచ్చడి నూరుతున్న ‘అమ్మ’ గుర్తొచ్చి ‘మా ఊరు నవ్వింది’ కవితలో చక్కగా చిత్రీకరించాడు.
‘మనం సదూకోకుడదంటే ఇ న్వేందిరా
భయపెట్టే గ్రామ పెత్తందారీతనం
మా యమ్మా బాబుల గొంతుల్లో
ఆవేదన జీరకు
సజీవ సాక్షాలుగా
నాకు కనిపించే మా ఊరి పాఠశాల, పశుపాకలు’ అని నాటి బాల్య స్మృతులను గుర్తుచేసుకుంటున్నాడు. దళిత తాత్వికతని, దళిత సౌందర్యాన్ని ‘పు ట్టు మచ్చ మీద ప్రేమ’ అనే కవితలో భావగర్భితంగా దార్ల వెల్లడిస్తున్నాడు. ‘పుట్టుకతో మచ్చ ఒకడికి అందమైన అలంకారంగాను
మరొకడి కి అసహ్యంగాను మారుతుంది
నాకున్న పుట్టుమచ్చలో
నా ఎదుటి వాళ్ళకేమి దర్శనమవుతుందో కానీ
వెన్నుపూసై నిలిచిన సౌందర్య రమణీ
నా పుట్టుమచ్చా
నిన్ను నేను ప్రేమిస్తున్నాను’ అని అనడంలో కులం వల్ల వచ్చిన హీనత్వంతో పాటు, తన కులమే తనకు రక్షణ కవచంగా కూడా నిలిచే ఒక విచిత్ర పరిస్థితిని దీని లో వర్ణించాడు కవి.కులం పోవాలనుకుంటూ నే, మళ్ళీ ఆ కులం వల్లే భద్రత పొందడంలో ఒక దె్వైదీభావం కనిపిస్తుంది. రిజర్వేషన్స్ లేకపోతే కనీసం తమకి రావాల్సిన వాటిని అందుకోలేని స్థితినీ, రాజ్యాంగ పరంగా దళితులు కావడం వల్లే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం వంటి వాటి వల్ల కనీస ఉపశమనం పొందుతున్నారనే భావాన్ని చక్కని లోతైన ప్రతీకలతో అక్షరీకరిస్తున్నారు. దళితుల సహన శీలతను, ప్రేమించే తత్వా న్ని అగ్రవర్ణాల వాళ్ళు ఎంత ద్వేషించినా వేధించి నా, దళితులెంతగానో ప్రేమించే తత్వాన్నే కలిగి ఉంటారని ‘దళిత తాత్వికుడు’ కవితలో రచయి త కవిత్వీకరించారు.
‘ఇప్పటికైన నువ్వెప్పుడైనా
అమ్మ తినిపించే గోరుముద్దల రుచిని చూడు
మిట్ట మధ్యాహ్నం చెట్టు నీడకెల్లి చూడు
నీకు ప్రేమించడమే తెలుస్తుంది’ అంటూ ప్రేమించేతత్వాన్ని నేర్చుకోవాలని ఈ కవిత ద్వారా శక్తిమంతంగా తెలియజేస్తున్నాడు. దళిత సాహి త్యం రావట్లేదనడం కంటే, ఒక తాత్త్విక దృక్పథంతో వస్తున్న తీరుతెన్నులు గమనించేందుకు ఈ కవితాసంపుటిని చదవాల్సిందే. అప్పుడే దళి త సాహిత్య తత్త్వం పతాక స్థాయిని అర్థం చేసుకోగలుగుతారు.- ఏడాకులపల్లి వెంకటేశ్
http://www.suryaa.com/showaksharam.asp?ContentId=4742
Wednesday, March 17, 2010
బాల రసాల...
బాలరసాలపుష్ప నవపల్లవ కోమల కావ్య కన్యకన్గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్హాలికులైననేమి మరి యంతకు నాయతి లేనినాడు కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమైఏవిటి, ఇది పోతన పద్యంలా అనిపిస్తోంది కాని కాదు అని ఆలోచిస్తున్నారా? అవును ఇది పోతన పద్యం కాదు. ఇది మంచన రచించిన కేయూరబాహు చరిత్ర కావ్యంలోని పద్యం. ఈ మంచన కవి క్రీ.శ. 1300 ప్రాంతం వాడని పరిశోధకుల అభిప్రాయం. పోతనకన్నా ముందరివాడు. ఇక్కడ "కూళలు" అంటే క్రూరుడు, మూఢుడు అనే అర్థం. అటువంటి వారికి సుకుమారమైన కావ్య కన్యకని ఇచ్చి ఆ పడుపుకూడు తినడం కన్నా పొట్టపోసుకోడానికి కవులు హాలికులగా మారి పొలం దున్నుకోడం మంచిది. అదికూడా లేదూ అంటే "కౌద్దాలికులు" అయినా పరవాలేదు అని దీని భావం. "కుద్దాలము" అంటే ఒక రకమైన గడ్డపార. కౌద్దాలికులంటే గడ్డపార పట్టుకొని కందమూలాలు తవ్వి తీసుకొని తినేవాళ్ళు అని అర్థం చెప్పుకోవచ్చు. నిజానికి మంచన తన కేయూరబాహు చరిత్రని నండూరి గుండనమంత్రికి అంకితం ఇచ్చాడు. అంచేత ఇక్కడ అతని ఉద్దేశం కావ్యాన్ని కూళలకి అంకితమివ్వకూడనే కాని నరులెవ్వరికీ అంకితమివ్వకూడదని కాదు.మనకి చాటుపద్యాల సంప్రదాయం ఉండేది. సామాన్య ప్రజల నాలుకల మీదగా చాటువులు ప్రచారం పొందేవి. చాలాసార్లు అసలు వీటిని రాసినదెవరో కూడా తెలియదు. కొన్ని చాటువులు కొందరు కవుల పేర్ల మీద చెలామణీ అవుతూ ఉండేవి. కొన్ని కావ్యాలలోని పద్యాలు కూడా ఇలా చాటువులుగా మారిన సందర్భాలున్నాయి. అదిగో అలా మారిన ఒక చాటువు యీ పద్యం. ఈ చాటువులు మార్పులు చెందుతూ ఉండడం కూడా సాధారణంగా జరిగేదే. అలా కొన్ని మార్పులు చెంది తర్వాత కాలంలో ప్రసిద్ధి పొందిన పద్యం ఇది:బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్హాలికులైననేమి గహనాంతరసీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమైఈ మార్పులు పద్యానికి మరింత అందాన్నిచ్చాయి. "బాలరసాలపుష్ప" అనడం కన్నా "బాలరసాలసాల" అనడం సొగసుగా లేదూ! "సాలము" అంటే చెట్టు. లేతమావిడి చెట్టుకి పూసిన కొత్తచిగురంత కోమలమైన కావ్య కన్యక అని అర్థం. అలాగే "గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులు" అనడంలో పద్యానికి బిగువు వచ్చింది. "గహనము" అంటే అడవి అని అర్థం. అడవిలోపల కందమూలాలు తవ్వుకుంటూ బతుకు సాగించినా మంచిదే అని అర్థం.చాటు సంప్రదాయంలో ఇక్కడ జరిగిన మరో గమ్మత్తు, ఈ పద్యం పోతనగారిదని ప్రచారంలోకి రావడం. పోతనగారు నరునికి తన కావ్యాన్ని అంకితమివ్వనన్న విషయం ప్రసిద్ధమే. పోతన రైతు జీవితం గడిపాడన్న విషయం కూడా ప్రచారంలో ఉన్నదే. అంచేత ఊహశాలులెవరో, ఇందులో కూళలు అంటే మూఢులైన మనుషులు అని అర్థం చెప్పి దీన్ని పోతనగారికి అంటగట్టారు. పైగా "హాలికులైననేమి" అని ప్రతిజ్ఞ చేసి రైతుగా జీవితాన్ని కొనసాగించాడని అన్నారు. భలేగా ముడిపెట్టారు కదా! అన్నీ చక్కగా అమరిపోయాయి! అంచేత అది బహుళ ప్రచారంలోకి వచ్చింది.ఇదీ ఈ పద్యం కథ. ఏది ఏమైనా ఈ పద్యం పోతన నోటినుండి వచ్చిందని ఊహించుకోడమే తెలుగువాళ్ళకి ఇష్టం. ఈ పద్యం చదివినప్పుడల్లా మనకి పోతనే గుర్తుకువస్తాడు. అంచేత ఇది పోతన పద్యమే!
- తెలంగాణ జాడ
అంతరాత్మ లేని వాడి పాదయాత్రకువెనక్కి తిరిగిన పాదాల గుర్తులే తప్ప అడుగుజాడలుండవుతెలుగుతల్లి మా సవతి తల్లేనని తెల్లవారేసరికి నాయకులుతేటతెల్లం చేసిన తర్వాతఇక మిగిలింది భాష అనే అర్థ సత్యమే కదా!వాదించటానికి నిజాలు లేనప్పుడుఅబద్ధాలు ఆకాశం అంటుతాయిభాష ఆకలి కడుపులు నింపలేదుబీళ్ళవైపు దప్పిగొన్న నోళ్ళవైపు నీళ్ళను మళ్ళించలేదుప్రాంతాన్నే ఫ్రీజోన్ చేసి దురాక్రమించుకున్నఉద్యోగాలు తిరిగి ఇవ్వలేదుపెట్టుబడిదారుకు తాకట్టయిన భూములు విడిపించలేదుచరిత్ర తవ్వకాల్లో దగాపడ్డ తమ్ముడి శవంతో పాటు వెన్నుపోటు పొడిచిన బాకు కూడా బయటపడుతుందిరాష్ట్రం- బుల్స్‌ఐ- రాజధాని నిండా ఉల్లంఘనల తూట్లుసంస్కృతి తెలియదు సంక్రాంతితెలియదనే వాణ్ణి చూసిచుక్కలను మించిన గాలిపటాలుపక్కున నవ్వుకుంటాయిద్వేష భాషను వినీ వినీ కృష్ణా గోదావరులు మురుక్కాల్వలవుతాయిపంచప్రాణాలవంచనా శిల్పం తెలిసినవాడే విగ్రహానికేదో జరిగిందని ఆగ్రహం ప్రకటిస్తాడువేల వేల కాళ రాత్రుల తర్వాతఒక అర్థరాత్రి ఉదయ సంకేతం వెలువడగానేప్రమాణం చేసి ప్రజా పీఠం ఎక్కినవాడు కూడాపట్టపగటి కుట్రలకు పాలికాపవుతాడుఏ ప్రాంతంలోనైనాచరిత్రలో అణచివేయబడే వాళ్ళనే ప్రజలంటారుబలైపోయిన తర్వాత బతికే వాళ్ళనే అమరులంటారుకాని ట్రిగ్గర్ మీద వేలుపెట్టి ‘కలిసుంటా’ అని బెదిరించే నాయకులనుఏమనాలో నిఘంటువులు వెతకాలి.
Friday, March 12, 2010
అవును మేము రిజర్వేషన్ గాళ్ళమే!
-ఇ. వెంకటేశ్
మా ప్రతిభను కొలవడానికి మీరు పారేసే భిక్షపు మార్కులు మా కక్కరలేదు చిలుక పలుకులు,బట్టీలు పట్టడం మాకు చాతకాదు! సృజనాత్మకత మా పుట్టుకలోనే ఉంది నా తండ్రి వ్యవసాయ పనిముట్లు తయారు చేయడంలో ఉంది. నా తల్లి పంట నూర్పిడిలో ఉంది మీకు చేతనైతే ఒక అక్షరాన్ని అందంగా చెక్కండి వ్యాక్యాన్ని నల్లని దళిత సౌందర్యవతిలా మార్చండి ! కాలం మారిన కొద్ది కులం రూపు మారిపోతుందనుకున్నాను కాని... ఉన్నత విశ్వ విద్యాలయాల్లో కాల నాగై కాటేస్తుందనుకోలేదు! మా ప్రతిభను కొలవడానికి మీకున్న ప్రస్తుత కొలమానాలు సరిపోవు అనంతమైన నా తెలివిని మీ మోకాళ్ళతో కొలువలేరు!
(విశ్వవిద్యాలయాల్లో కులవ్యవస్థ వికృత స్వరూపం చూసి...)
--- E.Venkatesh, M.A., Lecturer in Telugu,
Sravanthi Junior College, Zaheerabad, Medak Dist.
Ph: 9912950309, mail: venkat9venkat9@gmail.com
Home Page: www.venkateshuoh.blogspot.com

Subscribe to:
Posts (Atom)