Saturday, September 19, 2009

అదొ నిశ్చల చిత్రం...

అదొ నిశ్చల చిత్రం
కిర్రు మన్న బూట్ల శబ్దం
రాత్రికి సిగ్గయింది
సోక్రటీస్ మళ్ళి పుట్టాడు!


జీవితాన్ని కొలవడానికి
ఏ కొలబద్దలు అవసరం లేదు
మనువుని నరికెయ్యండి!


కడుపులొ ఖాళి
చెవిలొ సెల్లు
మెరిసే రోడ్లు
ప్రపంచీకరణ ఫలాలు!


హృదయం బద్దలైంది
అద్దంలో ప్రతిబింబం
శూన్యంలో కనిపిస్తుంది!


మాతృత్వం
మాయమైంది మందులు లేవా
మనసుకు!


బడబాగ్నిలా
శరీరం అంతా ఒకటే
నిప్పు కణికలు అర్పేయడానికి
ఉన్నాయి కదా "పెప్సి" లు!

మౌనం మాట్లాడుతోంది...

మౌనం మాట్లాడుతోంది
మానవత్వం మట్టికలిసినపుడు
మనిషితో మనిషి కరచాలనం
గతకాలపు వైభవం మాత్రమే!



రెండు రక్తపు చుక్కలు
చిందించి ఎంతమంది
నల్లవాళ్ళు వారి శరీరాన్ని
కళేబరాల్ని చేసుకున్నారో!



నా అస్తిత్వం మాయమై
ఆకాశం వరకు చిమ్మిన
చెమట చుక్కలు
ఇపుడు వర్షమై మీ దాహాన్ని
తీర్చుతున్నాయి!


చిన్నప్పుడు చెప్పిన
చందమామ కథ
పగిలిన గాజు పెంకుల్లా
చెల్ల చెదురుగ పడిన శకలాల్ల
తోస్తున్నాయి!


చరిత్ర ఎప్పుడు పునరావృతం
అవుతుంది
ఒంటరి సమూహంలో ఉన్నప్పుడు
రాత్రిల్లో పేలిన బాంబుల శబ్దాల్లా!


అనుమానపు చూపులతో
దేహాలను ఎక్సెరే తీస్తున్నారు
రక్త మాంసాలతో పాటు కాసింత
మానవత్వపు రేఖలు అస్పష్టంగా
కనిపిస్తున్నాయి!


ఆకాశమే హద్దుగా
కంఠమెత్తి విలపిస్తున్నా
మారణ హోమానికి వ్యతిరేకంగా!


చివ్వున చిందిన నెత్తురు మరకల
సాక్షిగా మీ నీత్తురు వృధాపోదని
అభయ హస్తం ఇస్తున్నా!

మరణ సదృశ్యమే...

దూరమవడం ఎప్పుడూ
మరణ సదృశ్యమే...
మెరుపుల వచ్చి
కలల అలలపై
ఓల లాడించి
వలపును ఒడుపుతో
మనసులో గుప్పించి
మౌనంగా మాట్లాడి
కళ్ళతో మమకారాన్ని నింపి
సుదూర తీరాలలో
ఎవరికి అందని ప్రేమను
శరీరం అంతా నింపేసి
అణువణువులో నీ నామాన్ని
అతికించి...
ఇపుడు దూరమవడం
నరకయాతనే!
గంటల తరబడి మాట్లాడిన
ఊసులన్ని ఇపుడు వ్యర్థమేనా
నిరీక్షణలో...
నీ రూప దర్శనముకై
పడిన వేదన అంతా శూన్యమేనా
ఆకాశంపై ఆశపడడం
ఆడియాశే అవుతుంది
అందుకే మళ్ళీ మళ్ళీ
చెబుతున్నా దూరమవడం
ఎప్పుడూ మరణ సదృశ్యమే!